అక్రమ కేసులకీ అసెంబ్లీని వాడుకుంటారా?

Publish Date:Sep 17, 2023

Advertisement

ఈ నెల 21 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు 21వ తేదీన మొదలైతే ఎన్నిరోజులు జరగాలని బీఏసీ సమావేశంలో డిసైడ్ అవుతుంది. కాకపోతే, వర్షాకాల సమావేశాలు కాబట్టి సుమారు ఐదారు రోజులు నిర్వహించే అవకాశం ఉందన్నది అంచనా.  మరి ఈ సమావేశాలలో ప్రభుత్వం ఏం ప్రతిపాదనలు చేయనుంది? ఎలాంటి నిర్ణయాలను తీసుకోనుంది? ఏపీ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఏం చెప్పనుంది? ప్రతిపక్ష పార్టీ ఈ సమావేశాలలో పాల్గొంటుందా? పాల్గొంటే ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలనుకుంటుంది? సహజంగానే ఇలాంటి చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. ఇది ఎన్నికల ఏడాది కనుక ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఏ స్థాయి హీట్ పెంచనున్నాయన్న ఉత్కంఠ కూడా నెలకొంది.

అధికార పార్టీ ప్రభుత్వం తరపున ప్రజలకు ఎలాంటి తాయిలాలు సిద్ధం చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, ఏపీలో ఇప్పుడు  మాత్రం పైన చెప్పుకున్న అంశాల కన్నా టీడీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ సెషన్ ను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లు పరిశీలకులు విశ్లేషించింది. తమ ప్రభుత్వం అంత చేసింది.. ఇంత చేసింది అని అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పుకుంటూనే చంద్రబాబును ఒక అవినీతి పరుడిగా చిత్రీకరించేందుకు ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, అస్సైన్డ్ భూములు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలకు ఇచ్చిన రాయతీలు ఇలా అన్నిటిలో తెలుగుదేశం పార్టీని కుట్రదారుగా చూపించాలని.. చంద్రబాబును దోపిడీ దారుగా చూపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నార చెబుతున్నారు. తెలుగుదేశం సభ్యులు  అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాలు తక్కువ గా ఉన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన బాటలో ఉన్న తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ సమావేశాలను పూర్తిగా తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకే వినియోగించుకోవాలని వైసీపీ పన్నాగం పన్నుతున్నదంటున్నారు.

నిజానికి అసెంబ్లీ వేదికగా అవినీతి ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు. చంద్రబాబు కేసు కోర్టు మెట్లెక్కేసింది. కాకపోతే ఇంకా ట్రయల్ మొదలు కాలేదు. సీఐడీ కస్టడీకి కోరినా అక్రమ అరెస్టుతో కోర్టు ముందు వివరాలు కావాలని కోరింది. మరోవైపు చంద్రబాబు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా బెయిల్ దరఖాస్తు చేసున్నారు. రెండు చోట్లా కేసుపై విచారణలు మొదలైతే   ఈ కేసు బండారం బయట పడిపోతుంది.  అసలు ఈ కేసు నిలబడుతుందా? అన్న అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ నిలబడితే దర్యాప్తు జరిపి అప్పుడు అవినీతి జరిగిందా? లేదా అన్నది కోర్టు తేలుస్తుంది.   కానీ, జరిగిన,  జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఇందులో కుట్ర ఉందన్నది విశ్లేషకుల వివరిస్తున్నారు. మేధావులు, మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులూ కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, కక్షపూరిత రాజకీయంలో భాగమే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు, చంద్రబాబు అక్రమ అరెస్టు వల్ల ఇప్పటికే వైసీపీకి భారీ నష్టం వాటిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటిది    ప్రభుత్వం  ప్రతిపక్షంపై ఇలా తప్పుడు కేసులు పెట్టి వాటిని తిరిగి అసెంబ్లీలో చర్చ పెట్టి చర్చిస్తామని చెప్పడం.. కోర్టులు కేసును తేల్చక ముందే చట్టసభలలో దోషులుగా ముద్ర వేయాలని ప్రయత్నించడం దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. ఎక్కడైనా కేసులు పెడితే దర్యాప్తు చేసి కోర్టులో పెట్టి శిక్షలు వేస్తారు. దీనికి పక్కా ఆధారాలు కావాలి. కానీ, ఇక్కడ అవే లేకపోవడంతో బట్ట కాల్చి మీద వేయడమే ప్రభుత్వ వ్యవహారశైలిగా భావించాల్సి వస్తున్నదంటున్నారు.   అందుకు అసెంబ్లీని వేదికగా వాడుకోవాలని ప్రయత్నించడం ప్రభుత్వ దుర్మార్గం వినా మరొకటి కాదని చెబుతున్నారు.  అదే జరిగితే ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన అసెంబ్లీ చివరికి రాజకీయ కక్షల కేసుల కోసం చేసే దుష్ప్రచారానికి వేదిక కావడం ఏపీ ప్రజల దురదృష్టంగానే భావించాలి.

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.