దేవుడి సొమ్ముకూ జగన్ సర్కార్ ఎసరు!

Publish Date:Jul 16, 2022

Advertisement

ఎవరేమనుకుంటే నా కేంటి.. అంతా నా ఇష్టం..ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా  ఇష్టం చెడ మడ చేలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం అన్నట్లుగా జగన్ సర్కార్ చెలరేగిపోతోంది. చివరికి  జగన్ సర్కార్ దేవుడి సొమ్మకు కూడా ఎసరు పెట్టేసింది. మహాకవి శ్రీశ్రీ  కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. త‌లుపు గొళ్లెం.. కాదేదీ కవిత కనర్హం అంటే జగన్ మాత్రం వాటి సంగతి ఎందుకు దేవుడి మన్యం, దేవుడి సొమ్ము, దేవాలయాల ఆదాయం ఇవేవీ స్వాహాకి అనర్హం కాదని చెబుతున్నారు. అడవులు, కొండలు కరిగించేసి సొమ్ము చేసుకున్న సర్కార్ ఇప్పుడు దేవుడి సొమ్ముపై కన్నేసింది.

దేవాలయాల డిపాజిట్లను రద్దు చేయాలని ఎండోమెంట్ కమిషనర్ ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేవాలయాల బ్యాంకు ఖాతాలు వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ఈ నెల 1 వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి 45 కోట్ల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్లను ఈవోలు క్యాన్సిల్ చేశారు. మొత్తంగా దేవాలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా 500 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ టార్గెట్ గా చెబుతున్నారు.

ఆయా దేవాలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా వచ్చిన నగదును ఆలయ అధికారులు కామన్ గుడ్ ఫండ్ (సీజెఎఫ్)కు జమ చేస్తున్నారు. సీజేఎఫ్ నిధులను ఆలయాల జీర్ణోద్ధరణకే ఉపయోగించాల్సి ఉండగా దేవాదాయ శాఖ మాజీ మంత్రి వాటిని ఇష్టానుసారం బదలాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు కూడా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి అభ్యంతరాలూ, ఆందోళనలను పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల దేవాలయాలలో ఎఫ్ డీలను రద్దు చేయడానికి జగన్ సర్కార్  సిద్ధమైపోయింది. ఇలా ఎఫ్ డీల రద్దు ద్వారా 500 కోట్ల రూపాయలు సమీకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రోజువారిగా ఆలయాల డిపాజిట్ల రద్దుపై దృష్టి సారించారు దేవాదాయ శాఖ అధికారులు. గతంలో అవినీతి కేసులో ఏసీబీకి చిక్కిన ఒక దేవాదాయ శాఖ ఉన్నతాధికారి సూచన మేరకు జగన్ సర్కార్ ఈ డిపాజిట్ల రద్దుకు తెరతీసిందని చెబుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లా అయినివిల్లిలంక వినాయక టెంపుల్, నెల్లూరు జిల్లా మూలస్థానేశ్వరస్వామి దేవాలయం, విజయవాడ యనమలకుదురు శివాలయం  30లక్షల రూపాయల చొప్పున ఎఫ్ డీలను రద్దు చేయగా,  సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి 20 లక్షల రూపాయల డిపాజిట్లు క్యాన్సిల్ అయ్యాయి.

కాగా అత్యధికంగా వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి 60 లక్షల రూపాయల డిపాజిట్లను ఉప సంహరించారు. ఎన్టీఆర్ జిల్లా కోటిలింగాల ఆలయం డిపాజిట్లు 40 లక్షల రూపాయలను ఉపసంహరిం చారు. రానున్న రోజులలో ఈ డిపాజిట్ల క్యాన్సిలేషన్ మరింత వేగం పుంజుకోనుందని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు. మరి దేవాల‌యాల అత్య‌వ‌స‌ర భారీ ఖ‌ర్చుల‌కు మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని దేవాల‌య అధికారులు ప్రాధేయ‌ప‌డ‌వ‌ల‌సిందేనా?

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.