నిర్మాణాలు తెలియదు కానీ.. మహా జోరుగా కూల్చివేతలు.. జగన్ సర్కార్ స్పెషాలిటీ!

Publish Date:Nov 8, 2022

Advertisement

నిర్మాణాలు, అభివృద్ధిని పట్టించుకోకపోయినా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విధ్వంసాల విషయంలో మాత్రం తెగ ఉత్సాహంతో పని  చేస్తోంది. ప్రజా వేదిక కూల్చివేతతో ఆరంభమైన విధ్వంస కాండ ఈ మూడున్నరేళ్లలో రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న మంగళగిరి ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట ఇళ్లను కూల్చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు విశాఖలోనూ కూల్చివేతల పర్వం కొనసాగించింది. మంగళగిరి ఇప్పటం లో జనసేన ఆవిర్భావ సదస్సుకు స్థలం ఇచ్చారన్న కక్షతో ఆ పార్టీ మద్దతు దారుల ఇళ్లు లక్ష్యంగా కూల్చివేతలకు పాల్పడిన జగన్ సర్కార్ విశాఖలో ప్రధాని మోడీ పర్యటన పేర ఈ కూల్చివేతల పర్వం కొనసాగించింది.

 విశాఖ ఆంధ్రా వర్సిటీ మైదానం సమీపంలోని దుకాణాలను అధికారులు రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చివేశారు. నిజానికి ఈ నెల 12న ఆంధ్రావర్సిటీలో జరగనున్న ప్రధాని మోడీ సభ కోసం ఈ దుకాణాలను కూల్చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు వాటిని మూసి ఉంచితే సరిపోతుంది. అధికారులు తొలుత ఆయా దుకాణదారులను అదే సమాచారం ఇచ్చారు. నవంబర్ 12న మోడీ సభ కారణంగా ఆ రోజు దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. అందుకు దుకాణ దారులు అంగీకరించారు కూడా. కానీ అంతలోనే ఏమైందో ఏమో కానీ సోమవారం(నవంబర్7) అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా, కనీసం దుకాణ దారులకు సమాచారం కూడా ఇవ్వకుండా దుకాణాలను  జేసీబీలతో కూల్చేశారు.

మంగళవారం ఉదయం తమ దుకాణాలను తెరుద్దామని వచ్చే వరకూ ఈ కూల్చివేతల సంగతి దుకాణదారులకు తెలియనే తెలియదు. గత పాతికేళ్లుగా తాము అక్కడే తమ వ్యాపారాలు చేసుకుంటున్నామనీ, కనీస సమాచారం లేకుండా తమ దుకాణాలను కూల్చివేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ సభ రోజున దుకాణాలు తెరవవద్దని మాత్రమే తమకు సమాచారమిచ్చారని వారు చెబుతున్నారు. అలా కాకుండా దుకాణాలను కూల్చేస్తామని చెప్పి ఉంటే వాటిలోని విలువైన వస్తువులు, సామగ్రిని తరలించుకునే వాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా అణుబాంబు వేసినట్లుగా జగన్ ప్రభుత్వం తమ మీద కూల్చివేతల బాంబు వేసిందన్నారు.  

ఇలా ఉండగా ఈ కూల్చివేతలపై విపక్షాలు మండి పడుతున్నాయి. సంబంధం లేకుండా తగుదునమ్మా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి మోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నడుం బిగించడమేమిటి? ఇప్పుడు ఆ సభకు ఎంత మాత్రం అడ్డు కానీ దుకాణాలను కూల్చివేయడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. విశాఖ కబ్జాల పర్వంలో ఇది కూడా ఒక భాగమేనని ఆరోపిస్తున్నాయి. ఈ స్థలం మీద విజయసాయి కన్ను పడటం వల్లనే దుకాణదారులు రోడ్డు పాలయ్యారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనను అవకాశంగా తీసుకుని దుర్మార్గంగా దుకాణాల కూల్చివేతకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.   

By
en-us Political News

  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.