తూచ్.. మూడు రాజధానులు కాదు.. విశాఖ ఒక్కటే!

Publish Date:Feb 15, 2023

Advertisement

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారీ తెన్నూ లేకుండా పోయినట్లు తయారైంది. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, పారిశ్రామికంగా అధోగతికి చేరింది. ఉద్యోగుల వేతనాలకే లాటరీ కొట్టాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది.  దీంతో ఈ పూట గడిస్తే చాలు అన్నట్లుగా జగన్ ప్రభుత్వం దినదిన గండంగా రోజులు గడుపుతోంది. అందుకే ఒక విధానం అంటూ లేకుండా.. గంటకో మాట.. పూటకో విధానం అన్నట్లుగా   జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. రంగులు మార్చడంలో ఊసరవెల్లి ఎలాగో మాటలు మార్చడంలో జగన్ సర్కార్ అలా అన్నట్లుగా తయారైంది పరిస్దితి.   ఊసరవెల్లే సిగ్గుపడే విధంగా ఏపీ సర్కార్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీ ఏపీ రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ సాక్షిగా అప్పటి విపక్ష నేత జగన్ అమరావతే రాజధాని అని విస్పష్టంగా ప్రకటించారు.

తీరా గెలిచి అధికారం చేపట్టిన తరువాత మాట మార్చి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరతీశారు. ఇప్పుడు నాలుగేళ్ల పాటు మూడు రాజధానులంటూ చేసిన జపానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఏపీకి రాజథాని ఒక్కటే అనీ, అయితే అది అమరావతి కాదు, విశాఖ అంటూ ప్లేట్ ఫిరాయించారు. కర్నూలు న్యాయ రాజథాని, అమరావతి శాసన రాజధాని, విశాఖ పాలనా రాజధాని అంటూ తమ ప్రభుత్వం ఇంత కాలం చెబుతూ వచ్చిన దంతా సమాచార లోపమంటూ విత్త మంత్రి బుగ్గన గారు ముక్తాయించేశారు. పాలనా వికేంద్రీకరణా లేదు ఏం లేదు అని ప్రకటించేశారు. అసలు రాజధాని అంశం కోర్టులో ఉండగా.. ఈప్రకటనలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్న విషయాన్నే సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. విశాఖలో వచ్చే నెల 3, 4 తేదీలలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు జరగనుంది. ఇందుకు సన్నాహకంగా ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజధాని విశాఖేననీ, త్వరలోనే అక్కడ నుంచి తాను పాలన ప్రారంభిస్తాననీ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా బెంగళూరులో మంగళవారం ( ఫిబ్రబరి 14)న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  విశాఖే ఏపీ రాజధాని అని చెప్పేశారు. అంతే కాకుండా కర్నూలులో ఏర్పాటు చేసేది హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమేననీ, అదేమీ న్యాయ రాజధాని కాదని కుండబద్దలు కొట్టేశారు.

రాజకీయ ప్రయోజనాలు, లబ్ధే పరమావధిగా ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ పబ్బం గడుపుకోవడానికే జగన్ సర్కార్ పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఏపీకి రాజధాని అమరావతే. లీగల్ గా విశాఖను రాజధాని చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో ఉన్న కేసు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే తప్ప ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు.  కోర్టు తీర్పు వెలువడలేదు. అయినా ప్రభుత్వం ఇలా ప్రకటనలు చేయడం ఇన్వెస్టర్లను మోసం చేయడమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.