సినీ పరిశ్రమపై జగన్ సర్కార్ కక్ష సాధింపు!

Publish Date:Aug 10, 2023

Advertisement

ఇంత కాలం జగన్ సినీ ఇండస్ట్రీ పట్ల ఎంత వివక్షతో వ్యవహరించినా.. రాజకీయాలతో మనకెందుకు అనుకున్నారో ఏమో సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. జగన్ సర్కార్ తీరు పట్ల కనీసంగా కూడా నిరసన వ్యక్తం చేయలేదు.

అదే సమయంలో జగన్ పంచన చేరిన కొందరు పరిశ్రమకు చెందిన నటులు మాత్రం నేల విడిచి సాము చేసిన చందంగా రాజకీయంలో జగన్ కు వ్యతిరేక పార్టీలకు మద్దతుగా నిలిచిన వారిపై విమర్శలతో చెలరేగిపోయారు. అయితే పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు అన్నట్లుగా ఇప్పుడు సినీ పరిశ్రమలో గుర్తింపు ఉన్న ఒక్కొక్కరూ ఏపీలో జగన్ సర్కార్ తీరు పట్ల కన్నెర్ర చేస్తున్నారు. నిర్మొహమాటంగా ఇండస్ట్రీ జోలికొస్తే ఊరుకునేది లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల నాటికే ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ అప్పటి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ కూటమి తరఫున ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగారు. జయాపజయాల సంగతి పక్కన పెడితే.. ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తే అయినా ఎక్కడా సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ రాజకీయం చేసిన సందర్భం లేదు.

అయితే అప్పటి ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, పార్టీ టికెట్ ఆశించి.. అన్ని పార్టీల తలుపూ తట్టి చివరికి జగన్ గూటికి చేరిన అలీ, ఇంకా పోసాని వంటి వారు మాత్రం జగన్ మనసెరిగి పవన్ కల్యాణ్ సహా జగన్ ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకు ప్రతిఫలమేమిటన్నది ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అంతే కాదు స్వయంగా వారు అనుభవిస్తున్నారు కూడా. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకీ, అధికార వైసీపీకి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్లకు పైబడి సాగిన జగన్ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి పెల్లుబుకుతున్న సంగతిని గ్రహించిన వైసీపీ నేతలలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యధాలాపంగా ప్రభుత్వ విధానాలపై చేసిన వ్యాఖ్యలను కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.

అధికార పార్టీ ఎంపీ రాజ్యసభ వేదికగా సినీ నటుల పారితోషకాలపై చేసిన కామెంట్లపై ఓ సినీ ఫంక్షన్ లో హీరో చిరంజీవి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క సారిగా దూషణలతో విరుచుకుపడటం చూస్తుంటూ అధికార పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందే అర్ధం చేసుకోవచ్చు. ఇంత కాలం చిరంజీవిని భుజాన మోసిన వారే ఇప్పుడు ఆయనను తూలనాడటం చూస్తుంటే.. చిన్న పాటి వ్యతిరేక వ్యాఖ్యను కూడా సహించలేనంతగా అధికార పార్టీ నాయకులలో  అహం, అసహనం ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవుతోందని పరిశీలకులు అంటున్నారు.  పైగా చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్ లో విమర్శలు చేయలేదు.. అధికార పార్టీ సినీ పరిశ్రమపై పడి ఏడవడం కాదు.. అంత కంటే పెద్ద పనులు ఉన్నాయి వాటిని చేయాలని హితవు మాత్రమే పలికారు.  

లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం సినీమా హీరోల పారితోషకాల గురించి మాట్లాడటమేమిటని సహజంగానే జన బాహుల్యంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అలాగే రజనీకాంత్ గతంలో అంటే ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో రెండు ముక్కలు చంద్రబాబు గురించి మంచిగా మాట్లాడినందుకే ఆయనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ విమర్శలకు సూపర్ స్టార్ రజనీకాంత్  తన స్టైల్ లో దీటుగా సమాధానం ఇచ్చారు.  సరే అదలా ఉంటే.. ఇప్పుడు చిరంజీవి లేటెస్ట్ మూవీ  భోళా శంకర్ ఆగ‌స్ట్ 11న రిలీజ్‌కి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఏపీ స‌ర్కార్‌కి టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు.  అయితే  భోళా శంకర్ కు ఏపీ ప్ర‌భుత్వం షాకిచ్చింది. టికెట్ ధరల పెంపుకోసం వచ్చిన అనుమతిని కనీసం పరిశీలను కూడా తీసుకోవద్దంటూ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయని చెబుతున్నారు.

 గతంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా జగన్ సర్కార్ ఇదే తీరున వ్యవహరించిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద జగన్ సర్కార్ సినీ పరిశ్రమపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందన్న మెసేజ్ ఇప్పటికే బలంగా ప్రజలలోకి వెళ్లింది.  ఇది జగన్ సర్కార్ కు ఎంత మాత్రం మేలు చేయదు. సినీ పరిశ్రమ మీద ఆధారపడి జీవించే  లక్షలాది మందే కాకుండా ఆయా హీరోల అసంఖ్యాక అభిమానలను కూడా వైసీపీ దూరం చేసుకున్నట్లేననీ, వచ్చే ఎన్నికలలో ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనీ అంటున్నారు. 

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.