పులివెందుల పులి జగన్ పలాయనం..!

Publish Date:Jul 29, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ దివాళాకోరు తనానికి ఓటమి తరువాత ఆయన తీరే నిదర్శనం. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. విజయంతో విర్రవీగి, ఓటమితో కృంగిపోవడం నాయకుడి లక్షణం కాదు. పార్టీని ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు తనలో ఇసుమంతైనా లేవని జగన్ తన ప్రతి చేష్టతో, ప్రతి మాటతో, ప్రతి విమర్శతో రుజువు చేసుకుంటున్నారు. పులివెందుల పులిగా నిన్న మొన్నటి వరకూ ఆయన గురించి గొప్పగా చెప్పిన వైసీపీ నేతలూ, శ్రేణులూ కూడా ఆయన ధైర్యం గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడడానికి జంకుతున్నారు.  

జగన్ హయాంలో  చంద్రబాబు నాయుడుని శాసనసభలో  వైసీపి ఎమ్మెల్యేలు దారుణంగా అవమానించారు. అప్పుడు చంద్రబాబు  మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతాను అంటూ శపథం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. కౌరవ సభను గౌరవ సభగా మారుస్తాను అంటూ ప్రతిజ్ణ పూనారు.   2024 ఎన్నికలలో పార్టీకి గొప్ప విజయాన్ని అందించి, తన శపథం నెరవేర్చుకుని హుందాగా సభలో అడుగుపెట్టారు.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. కేవలం 23 మంది సభ్యులు మాత్రమే ఆ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కృంగిపోలేదు. పార్టీని పటిష్టంగా నిలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారు. పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా కాపాడుకున్నారు.  జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొన్నారు. రాజకీయ పోరాటం చేశారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చారు. 

అదే సమయంలో 2019 ఎన్నికలలో విజయం తరువాత జగన్ జనం ముఖం చూడలేదు. ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. విపక్ష నేతలను, కార్యకర్తలను వేధించడమే పాలన అన్నట్లుగా వ్యవహరించారు. సభలో విపక్ష నేతను, విపక్ష సభ్యులను అవమానించడమే సభా నిర్వహణ అనుకున్నారు. అభివృద్ధి అంటే విధ్వంసమే అన్నట్లుగా వ్యవహరించారు. సంక్షేమం అంటే బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడమే అని భావించారు. సరే ఐదేళ్ల జగన్ పాలన పట్ల తమ అభిప్రాయం ఏమిటన్నది ప్రజలు ఎన్నికలలో ఓటు ద్వారా విస్ఫష్టంగా వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ పాలనను తిరస్కరించారు. ఘోరంగా ఓడించారు. 

అయితే  ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం తరువాత  వైసీపీ అధినేత జగన్  అసెంబ్లీలో అడుగుపెట్టేందుకే జంకుతున్నారు. అర్హత లేకపోయినా తనకు విపక్ష నేత హోదా ఇవ్వాలంటూ దేబిరిస్తున్నారు.  వైనాట్ 175 అన్న నోటితోనే  ఇప్పుడు విపక్ష హోదా ప్లీజ్ అంటూ బతిమలాడుకుంటున్నారు.  గతంలో అంటే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులు ఉన్నప్పుడు.. తాను చిటికేస్తే తెలుగుదేశం పార్టీకి విపక్ష హోదా లేకుండా పోతుందని ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు ఆ హోదా కోసం వెంపర్లాడుతున్నారు.  క్యాడర్ లో, నేతలలో విశ్వాసం పాదుకొల్పి పార్టీని కాపాడుకోవలసిన జగన్.. తనను కాపాడుకోవడానికి పార్టీ మీద, క్యాడర్ మీదా ఆధారపడుతున్నారు.  అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక.. మీడియా సమావేశాలలో ప్రసంగాలు చేస్తున్నారు. మీడియా ప్రశ్నలకు సమాధానాలు దాటేస్తున్నారు.  మొత్తంగా జగన్ ప్రజలను, విపక్షాలనూ ఫేస్ చేసే ధైర్యంలేక పలాయనం చిత్తగిస్తున్నారు.  

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.