అప్పుడు ఇందిరమ్మ .. ఇప్పడు జగనన్న

Publish Date:Jan 6, 2023

Advertisement

వినాశకాలే విపరీత బుద్ధి  1975 జూన్ 25న అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించారు. రాత్రికి రాత్రి వందల సంఖ్యలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో పముఖ సోషలిస్ట్ నాయకుడు, సంపూర్ణ క్రాంతి ఉద్యమ నిర్మాత  లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. తలుపు తట్టారు. నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చిన జేపీతో పోలీసు అధికారులు దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం చెప్పారు. తాము ఆయన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చామని తమతో సహకరించాలని కోరారు.అప్పుడు జేపీ ... ఎక్కువ తక్కువ లేకుండా ఒకే ఒక్క మాటన్నారు. ఆ మాటే .. వినాశకాలే విపరీత బుద్ధి. 

ఆమాటకు అర్థం విడమరఛి చెప్పవలసిన అవసరం లేదు.ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పట్టిస్తుంది.అలాంటి పెడ ధోరణిని పెద్దలు వినాశ కాలానికి, పతనానికి సంకేతంగా నిలిచే విపరీత బుద్ధి అన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎలాంటి రాజకీయ పరాభవాన్ని ఎదుర్కొన్నారో వేరే చెప్పనక్కరలేదు. అత్యవసర పరిస్థితి తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడి పోవడం కాదు, స్వయంగా ఇందిరా గాంధీ తమ సొంత నియోజక వర్గం రాయిబరేలి (యుపీ)లో ఓడిపోయారు. ఆమె కుమారడు సంజయ్ గాంధీ అమేథిలో ఓడి పోయారు.  

ఇక ఇప్పుడు ఏపీకి వస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల కదలికలకు సంకెళ్ళు వేశారు. రాజకీయ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ   జీవో (నంబర్ 1) తెచ్చారు.  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అప్పుడు ఇందిరా గాంధీ అనుసరించిన మార్గంలోనే జగన్ రెడ్డి  ప్రతిపక్షాల పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు కాదు  స్వపక్షీయులే అంటున్నారు. అందుకే  వినాశకాలే విరీత బుద్ధి  ‘దీవెన’ జగన్ రెడ్డికు కూడా వర్తిస్తుందని అంటున్నారు. ఇలా ఇంకెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో, రాజకీయ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధించడం  చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ ఆయన పర్యటను అడ్డుకోవడం  పోలీసుల దౌర్జన్యం ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్ట్ పాలన, నియంతృత్వ పోకడలకు అద్దం పడుతున్నాయి.ఇందిరమ్మ అత్యవసర పరిస్థితిని గుర్తు తెస్తున్నాయని అంటున్నారు. 

నిజానికి  జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు నియంతృత్వ పోకడలు పోతున్నారనే ఆరోపణలున్నాయి.ఇప్పడు ఆయనకు సహజ సిద్ధంగా అబ్బిన కక్షపూరిత రాజకీయ సు...గుణాలకు ఓటమి భయం తోడవడంతో జగన్ రెడ్డి  వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వ్యవ్హరిస్తున్నన్నారని అంటున్నారు. ఆయన తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారనీ అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాయి. చేయాలి .. అందులో భాగంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన  కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ధర్నాలు, రోడ్డు షోలు, బహిరంగ సభల ద్వారా ప్రజా వ్యతీరేక ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెడతాయి.ఇవన్నీ, కూడా ఒక విధంగా ప్రజాస్వామ్య ఆభరణాలు. ఇప్పడు జగన్ రెడ్డి  ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, అరాచక పాలనను, మరో మెట్టు పైకి తీసుకు పోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  
అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమి ఆశించి  ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఇంకేమి ఆశించి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారో కానీ,రాజకీయ వినాశనాన్ని ఆయన కోరి తెచ్చుకుంటున్నారని ప్రత్యర్ధి పార్టీల నాయకులే కాదు, సొంత పార్టీ, సొంత కుటుంబ సభ్యులే అంటున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు  నాయుడు  సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి ముఖ్యమంత్రి రాజకీయ సభలు, ర్యాలీలపై విధించిన ఆంక్షలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అధికార పక్ష నేతలే ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలను చూసి జగన్ భయపడుతున్నాడనే సంకేతం పంపినట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికలలో 151 సీట్లు మాత్రమే గెల్చుకున్నామని,ఈ సారి కుప్పంతో సహా మొత్తం 175 నియోజకవర్గాలలో ఎందుకు విజయం సాధించలేమని  గొప్పలకు పోయిన జగన్ రెడ్డి, ఇప్పడు ప్రతిపక్ష నాయకులకు భయపడి జీఓల చాటున దాక్కోవడం  ఎలాంటి సంకేతాలు పంపుతుందని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి, నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి మీటలు నొక్కుతూ ఓట్లు లెక్కేసుకుంటూ  ప్యాలెస్  లో కులాసాగా గడిపేశారు, కానీ  ఒక సారి బయటకు వచ్చిన తర్వాత కానీ, ఆయనకు సత్యం బోధ పడలేదు. మనము కట్టుకున్నవి దేవతా వస్త్త్రాలనే నిజం తెలిసి రాలేదు. ఇప్పుడు తెలిసొచ్చినా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఆయన విపరీత పోకడలు పోతున్నారని  వైసీపీ నేతలే వాపోతున్నారు.

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.