అందరికీ హ్యాండిచ్చిన జగనన్న.. ఎన్నికల్లో దిక్కెవరు?
Publish Date:Mar 23, 2022
Advertisement
అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా.. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఉందనే ఓ టాక్ అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవుతోంది. రానున్నది ఎన్నికల సీజన్. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆచీ తూచీ మరీ అడుగులు వేయాలి. అందుకు వైయస్ జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా మస్త్ మస్త్‌గా నడుస్తోంది. ఆ క్రమంలోనే సీఎం జగన్.. తన కేబినెట్‌ను మార్చాలని నిర్ణయించారని.. అందుకు ఉగాది రోజుని ఫిక్స్ చేశారనే సమా చారం. అంత వరకు ఓకే కానీ.. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రచార బాధ్యతలు చేపట్టే వారు ఎవరంటే... మాత్రం కనుచూపు మేరలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదని.. ఫ్యాన్ పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరి మధ్య ఓ చర్చ అయితే హాట్ హాట్‌గా నడుస్తోంది. గతంలో అంటే వైయస్ఆర్ ఆకస్మిక మృతి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్‌కు అండ దండ... గా ఆయన తల్లి వైయస్ విజయమ్మ, సోదరి వైయస్ షర్మిల నిలబడ్డారు. పరోక్షంగా వైయస్ జగన్ బావా బ్రదర్ అనిల్ సైతం మద్దతు ఇచ్చారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదు. వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించి.. హైదరాబాద్ లోటస్ పాండ్ వేదికగా రాజకీయం చేస్తూ.. అక్కడ అధికారం అందుకునేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో వీరిద్దరు .. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు బాగా దూరం జరిగినట్లేనని అందరికీ అర్థమవుతోంది. మరోవైపు ఏపీ సీఎం బావా బ్రదర్ అనిల్ కూడా కొత్త పార్టీ పెట్టి.. బావమరిది వైయస్ జగన్‌కు చెక్ పెట్టేందుకు తన వంతు ప్రయత్నాలకు ఇప్పటికే ఆయన శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు వైయస్ వివేకా హత్య నేపథ్యంలో పులివెందులలోని వైయస్ ఫ్యామిలీ అంతా.. వైయస్ సునీత వైపు ఉంటే.. ఈ హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి వైపు సీఎం వైయస్ జగన్ ఉన్నారనే టాక్ అయితే రాష్ట్రంలో గట్టిగానే ఉంది. దీంతో వైయస్ జగన్‌కు వైయస్ ఫ్యామిలీ నుంచి మద్దతే కాదు.. ప్రచారం కూడా చేయరనే చర్చ కూడా గట్టిగానే సాగుతోంది. ఇక 2019 ఎన్నికలకు ముందు టాలీవుడు నటీనటులలో చాలా మంది వైయస్ జగన్ గెలుపు కోసం అలా ఇలా కాదు ఓ రేంజ్‌తో ప్రచారం చేశారు. ఆ తర్వాత వారంతా సీఎం జగన్‌కే కాదు పార్టీకి సైతం దూరమైయ్యారు. అలీ, పోసాని కృష్ణ మురళీ, 30 ఈయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వగైరా వగైరా మాత్రం సీఎం జగన్‌తో టచ్‌లో ఉన్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. మీగతా వారు .. అంటే జీవితా రాజశేఖర్, తనీష్, కొన వెంకట్, మంచు ఫ్యామిలీ, కృష్ణుడు, జయసుధ తదితరులంతా.. వైయస్ జగన్‌కు చాలా చాలా దూరంగానే జరిగారని సమాచారం. జీవితా రాజశేఖర్ అయితే గతంలోనే కమలం గూటిలోకి చేరిపోయారు. ఇక జయసుధ.. సైలెంట్ అయిపోయారు. తనీష్, కృష్ణుడు తెరమరుగయ్యారు. ఇక మంచు ఫ్యామిలీలోని మోహన్ బాబు.. ఇటీవల హాట్ హాట్ కామెంట్స్ చేసిన విషయం విదితమే. ఇంకో వైపు సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టాలీవుడ్ అంతా గుర్రుగా ఉంది. అలాంటి పరిస్థితిలో రానున్న ఎన్నికల వేళ... టాలీవుడ్ నుంచి ఎవరు ముందుకు వచ్చి మరీ జగన్ కోసం ప్రచారం చేస్తారనే చర్చ అయితే చిత్ర పరిశ్రమలో చాలా రంజుగా సాగుతోంది. ఓ వేళ.. ఎవరైనా జగన్ తరఫున ప్రచారం కోసం వెళ్లితే.. ఆ తర్వాత వారి భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న కూడా సదరు చిత్ర పరిశ్రమలో ఉత్పన్నమవుతోందనే చర్చ కూడా తాజాగా ఫిలింనగర్‌లో నడుస్తోంది. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల వేళ.. జగన్ కోసం ప్రచారం చేయాలంటే.. ఆర్కే రోజా, ఆలీ, పోసాని కృష్ణమురళీ, పృద్శీ రాజ్ కన్‌ఫార్మ్ అని తెలుస్తోంది. మరి వీరి ప్రచారంతోనే వైయస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారా ? అంటే మాత్రం.. అదీ సందేహమే. ఎన్నికల్లో గెలుపంటే.. ఒక్కరితోనో ఇద్దరితోనే కలి ప్రచారం చేస్తే వచ్చేది కాదు.. అది ఓ సమిష్టి కృషి.. అందుకు 2019 ఎన్నికలే ఉదాహరణ. ఈ ఎన్నికల వేళ.. ప్రశాంత్ కిషోర్, వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల, బ్రదర్ అనీల్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ.. ఇలా ఇతరత్రా ఇతరత్రా అంతా కలిసి ప్రచారం చేయడంతో.. ఓట్లు గంపగుత్తిగా ఫ్యాన్ పార్టీకి వచ్చి పడ్డాయి. దాంతో జగన్ గెలుపు నల్లేరు మీద నడక అయింది. కానీ నేడు వీరంతా... వైయస్ జగన్ వెంట ఉన్నారా అంటే అదీ లేదు. మరి 2024 ఎన్నికల వేళ.. ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏమిటంటే.. అంటే అదీ ఆ జగనన్నకే ఎరుక... అని ఆ పార్టీలోనే ఓ వర్గం పేర్కొనడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/jagan-reddy-remains-alone-39-133420.html





