జగన్ రెడ్డికి ఊరికో ప్యాలెస్.. ఎక్కడా స్థిమితంగా, స్థిరంగా ఉండరు!

Publish Date:Oct 15, 2023

Advertisement

సీఎం అంటే ఓ ఇల్లు.. రెండు కార్లు సరిపోవా? పోనీ, ఒక ప్యాలెస్, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ తలా ఒక కారు సరిపోదా? నగరానికో ఇల్లు.. డజన్ల కొద్దీ కార్లు కావాలా?  రానా దగ్గుబాటి హీరోగా నటించిన లీడర్ సినిమలో డైలాగ్ దాదాపుగా ఇలాగే ఉంటుంది.  ఇప్పుడు ఇది ఏపీ   ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే జగన్ ఎక్కడకి వెళ్తే అక్కడ ఓ ప్యాలెస్ కట్టుకుంటున్నారు. నిధులు, నిబంధనల   సంగతెలా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు తన ప్యాలెస్ లతోనే  హైలెట్ అవుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని తాడేపల్లిలో నిర్మించుకున్న ప్యాలెస్ లో నివాసం ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కోసం విశాఖ రుషికొండపై వందల కోట్లతో నివాసం(ప్యాలెస్) సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈ నివాసంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గృహప్రవేశం కూడా చేయనున్నారు.

అయితే, సహజంగా సీఎం నివాసం అంటే అధికారం ఉన్నన్ని రోజులే ఉటుంది. ఎందుకంటే అది ప్రభుత్వ భవనం కనుకప.  ముఖ్యమంత్రి  మాజీ కాగానే అది ఖాళీ చేయాలి. కానీ రుషికొండపై కడుతున్న నివాసాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసమే జీవిత కాలం ఉండేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. పర్యాటక శాఖ పేరిట కడుతున్న ఈ నిర్మాణాన్ని 33 ఏళ్ల పాటు ఓ ప్రైవేట్ వ్యక్తికి లీజుకి ఇవ్వనున్నట్లు చెప్తున్నారు. ఈ ప్రైవేట్ వ్యక్తి సీఎం జగన్ బినామీనే అనీ, అందుకే  జగన్ కోసమే ఆ నివాసం నిర్మాణమైందనీ అంటున్నారు. ఇప్పుడు జగన్ వయసు 50 సంవత్సరాలు కాగా మరో 33 ఏళ్ళు అంటే 83 సంవత్సరాల వయసు వరకూ ఆ నివాసం జగన్ కోసమే ఉంటుంది. దీంతో అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్ని నివాసాలు ఉన్నాయి? ఇప్పటికే ఎన్నో ప్యాలెస్ లు ఉండగా  ఇప్పుడు రుషికొండపై ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్యాలెస్ లాంటి నివాస భవనం కూడా  తనకే కావాలని జగన్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఆయన ఎన్ని నివాసాల్లో  కాపురం చేస్తారు? అసలు ఆయనకు ఈ నివాసాల ఫాంటసీ ఏంటి అనేది చర్చకు వస్తున్నది. 

అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇదేం ఫాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఓ ప్యాలెస్ ఉండాలనుకుంటున్నారు.  ఊరికో బిల్డింగ్ కట్టుకుంటారు కానీ అందులో ఉండలేరు. అప్పటికప్పుడు అవసరానికి అక్కడ ఉండాల్సి వస్తే అక్కడ ఓ ప్యాలెస్ కట్టేసి ఉన్నన్ని రోజులు ఉండేసి వస్తున్నారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రాంతం పులివెందులలో, తాతల కాలం నుండి వచ్చిన పాత ఇంటి స్థానంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు. ఇది చూసేందుకు సాధారణంగానే ఉన్నా లోపల 50 కాపురాలు నివాసం ఉండేలా ఉంటుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ సొంత జిల్లా కడపలో మరో   ప్యాలెస్ ఉంది. అప్పట్లోనే దీనిని రాజశేఖరరెడ్డి కళ్ళు చెదిరేలా నిర్మించారు. ఈ కడప నివాసం మొత్తం రాయలసీమకు హైలెట్ గా నిలుస్తుంది. దేశవిదేశాల నుండి తెప్పించిన మెటీరియల్ తో ఇది నిర్మించగా విదేశీ నిపుణులతో ఆర్కిటెక్ట్ చేయించారు. జగన్ కు ఉమ్మడి కడప జిల్లాలోని ఇడుపులపాయలో కూడా ప్యాలస్ లాంటి  భవనం ఉంది.

 ఇక  జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పనవసరం లేదు. అంతే కాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుమారు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలిపాడ్, ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉండగా.. ఇందులో మూడు షిఫ్టులులో వందల మంది పని వారు ఉంటారని చెప్తారు. సామాన్య మానవునికి ఏ మాత్రం ఎంట్రీ లేని ఈ ప్యాలెస్ విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం   రెండు, మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక, అది కాకుండా ఇప్పుడు జగన్ నివాసం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ గా పిలవబడే భవనం కూడా సామాన్యమైంది కాదు. ఇప్పుడు ప్రభుత్వం అంతా అక్కడ నుండే నడుస్తుందంటేనే అర్ధం చేసుకోవచ్చు అది ఏ స్థాయిలో ఉందో. దీని విలువ కూడా వందల కోట్ల రూపాయలలోనే ఉంటుందని అంచనా. మరోవైపు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ చెన్నైలో కూడా ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పుడు  సుమారు రూ.500 కోట్ల వ్యవయంతో ఆయన కోసం రిషికొండపై ప్యాలెస్ రెడీ అవుతోంది. 

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.