జ‌గ‌న్‌..! ఇక ఏడ్చేస్తాడేమో?!

Publish Date:Mar 28, 2024

Advertisement

నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని   అని చెప్ప‌డం మిన‌హా,    ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది.   స‌ర్వేల‌న్నీ బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మికే జై కొడుతుండ‌టంతో జ‌గ‌న్ శిబిరం కంగారెత్తిపోతున్నది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు చేసిన పాపాలు అన్నీఇన్నీకావు.. ఏకంగా బాబాయ్ హ‌త్య‌, కోడి క‌త్తి  దాడి.. ఇలా చాలానే ఉన్నాయి. పోనీ ఇన్ని చేసి అధికారం దక్కించుకున్న తరువాత పాలన అయినా సక్రమంగా  సాగించారా అంటే అదీలేదు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌ను రోడ్డున ప‌డేశారు. అంతెందుకు ఉన్న కంపెనీల‌ను పంపించేసి నిరుద్యోగుల‌కు ఉపాధి లేకుండా చేశారు. ఫ‌లితంగా చిన్న‌చిన్న ప‌నుల‌కోసం సైతం ఏపీ ప్ర‌జ‌లు హైద‌రాబాద్ బాట ప‌డుతున్నారంటే ఏపీలో   ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయ్యింది.  వీట‌న్నింటిని వ‌దిలేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ  చంద్రబాబే కారణమని జనం ముందు ప్రసంగాలు ఇస్తున్నారు.  

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలో ఉన్న‌న్నిరోజులు బ‌య‌ట‌కు రావాలంటే ప‌ర‌దాలు కట్టుకుని జనానికి ముఖం చూపకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవలసిన పరిస్థితి. అయితే ఇప్పుడు  ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జ‌గ‌న్‌ ప్రారంభించాడు. మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టిన జ‌గ‌న్.. ప్రొద్దుటూరులో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం.. క‌లియుగ స‌త్య హ‌రిశ్చంద్రుడిని నేనే అని డ‌బ్బాకొట్టుకోవ‌డానికి పరిమితమైంది.  ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చెప్ప‌కుండా.. నేను మీ బిడ్డ‌ను.. అంద‌రూక‌లిసి నాపై దండ‌యాత్ర చేస్తున్నారు.. మీరే న‌న్ను కాపాడాలి అంటూ ప్ర‌జ‌ల‌ను  దీనంగా జ‌గ‌న్ అభ్య‌ర్ధించారు. ఐదేళ్ల పాల‌న‌పై ఆగ్రహంతో ఉన్న ప్ర‌జ‌ల‌ను సానుభూతి అస్త్రంతో త‌న‌వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. బాబాయ్ హ‌త్య‌కేసు విష‌యంపై మాట్లాడిన జ‌గ‌న్‌.. తన వాళ్ల‌నే చంద్ర‌బాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ ప్ర‌జ‌ల ముందు క‌న్నీరు పెట్టుకునంత ప‌నిచేశాడు. వివేకానందను అన్యాయంగా, అతిదారుణంగా చంపారు.. ఆ హంత‌కులెవ‌రో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలుసు.. అని చెప్పిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి.. వారి పేర్ల‌ను మాత్రం చెప్ప‌లేదు. 

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబాయ్ హ‌త్య‌కు కార‌ణం చంద్ర‌బాబే అంటూ మొత్తుకున్న జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బాబాయ్ హ‌త్య‌కేసును ఎందుకు సీరియ‌స్ గా తీసుకోలేద‌నే విష‌యాన్ని మాత్రం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో  ఎక్కడా పొరపాటున కూడా ప్ర‌స్తావించ‌లేదు. త‌న ఇద్ద‌రు చెల్లెళ్లు, సీబీఐ అధికారులు వివేకా హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయి వైసీపీ ఎంపీ అవినాశ్  రెడ్డి అని బ‌హిరంగంగానే చెబుతున్నారు.  సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు   క‌డ‌ప వెళ్లారు.. బాబాయ్ పై జ‌గ‌న్ కు నిజంగా ప్రేముంటే అవినాశ్ అరెస్టును ఎందుకు అడ్డుకోవాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై ప్ర‌జ‌లకు చెప్పేందుకు జ‌గ‌న్ సాహ‌సించ‌లేదు. కేవ‌లం అభాండాలు వేయ‌డమే తన పని అన్నట్లుగా జగన్ తీరు ఉందని జనం బాహాటంగానే అంటున్నారు త‌న ఇద్ద‌రు చెల్లెళ్ల‌ను చంద్ర‌బాబు త‌న‌పై ఉసిగొల్పుతున్నాడ‌ని జ‌గ‌న్ పేర్కొనడం విడ్డూరంగా ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ష‌ర్మిల‌, సునీత‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక వారిని కూడా చంద్ర‌బాబు మ‌నుషులుగా వైసీపీ నేత‌లు చిత్రీక‌రించే ప్ర‌య‌త్న చేస్తూ వ‌చ్చారు. తాజాగా జ‌గ‌న్ కూడా త‌న ప్రంస‌గంలో అదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం జ‌గ‌న్ లో ఓట‌మి భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఇన్నాళ్లు చెల్లెళ్లు రోడ్డెక్కి మొత్తుకుంటున్నా క‌నీసం మాట‌ కూడా మాట్లాడ‌ని జ‌గ‌న్‌  ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఓట్లు కావాలి కాబ‌ట్టి సానుభూతికో సం అంతా చంద్ర‌బాబే చేస్తున్నారని చెప్ప‌డం వైసీపీ నేత‌ల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. జ‌గ‌న్ చెల్లెళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ముందు స‌మాధానం చెప్పిన త‌రువాత చంద్ర‌బాబు పేరు ఎత్తితే బాగుంటుంద‌ని   విశ్లేష‌కులు సూచిస్తున్నారు.  

ఇటీవ‌ల విశాఖ తీరంలో దొరికిన డ్ర‌గ్స్ కేసుపైనా జ‌గ‌న్‌ స్పందించాడు. డ్ర‌గ్స్ తో ఉన్న కంటైన‌ర్ లో పేర్కొన్న అడ్ర‌స్సు చంద్ర‌బాబు వ‌దిన చుట్టం కంపెనీది అంటూ జ‌గ‌న్ అన్నాడు. అయితే, ఆ కంపెనీ వాళ్లు వైసీపీ నేత‌ల‌ని, ఇటీవ‌ల సంక్రాంతి పండుగ‌కు వాళ్లు జ‌గ‌న్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీల‌ను ఎందుకు వేయించార‌నే విష‌యంపై మాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నోరువిప్ప‌క పోవ‌టం గ‌మ‌నార్హం. త‌న‌పై, త‌న వ‌ర్గీయుల‌పై వ‌చ్చే ప్ర‌తీ ఆరోప‌ణ‌ను చంద్ర‌బాబు చేసేదే అని చెప్ప‌డం మిన‌హా బ‌స్సు యాత్ర ప్ర‌సంగంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడింది పెద్ద‌గా ఏమీలేద‌నే చెప్పొచ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం ప్ర‌జల సానుభూతికోసం  జ‌గ‌న్ పాకులాడిన‌ట్లు క‌నిపించింది. మొత్తంగా చెప్పాలంటే.. క‌న్నీళ్లు పెట్ట‌డం త‌ప్పితే అన్ని విన్యాసాలు ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ చేశాడ‌ని చెప్పొచ్చు.

By
en-us Political News

  
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించడం లేదు. 25 ఎంపీల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ సిఎం జ‌గ‌న్ తాను ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రానికి హోదా సాధించడంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేన పార్టీలు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, టీడీపీ, జనసేనలు మిత్రపక్షం కాబట్టి. గత రెండు ఎన్నికల్లో ఇది కీలకమైన అంశంగా మారగా, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగా మారింది.
నమస్తే జలగన్నా. అలియాస్ జగనన్నా. నాపేరు జలగశ్రీ. నువ్వేమో సింబాలిక్ జలగవి.. నేనేమో రియల్ జలగని! నేను ఈమధ్యే పుట్టాను.
పౌరుషానికి మారు పేరు పల్నాడు. అయితే జగన్ ప్రభుత్వంలో పల్నాడు ప్రాంతాన్ని అన్ని విధాల  దోచుకుంటున్న వారికి తగిన బుద్ది చెప్పడానికి గుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుంబిగించారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, అంతకు మించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు.
జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు.
వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.
 పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం  బార్లు, రెస్టారెంట్లలో  అక్రమంగా కార్యకలాపాలు  నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది.  బిఆర్ఎస్ హాయంలో యదేచ్చగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని ముచ్చెమటలు పట్టిస్తోంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వున్న జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు
పించన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను సూచించింది
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి వేసవి ఎండలను మించిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తై పోలింగ్ ఇక రోజుల వ్యవధిలోకి రావడంలో పార్టీలూ, పోటీలో ఉన్న అభ్యర్థులూ తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించడానికి సమాయత్తమౌతున్నారు.
తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.