అర్థమవుతోందా..? సామీ..!

Publish Date:Sep 30, 2022

Advertisement

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీ సీఎం జగన్ సమర శంఖం పూరించేశారు. ఎన్నికలకు ఇంకా 19 నెలల సమయం ఉందంటూనే.. ఇప్పటి నుంచే రెడీ కావాలని తన ఎమ్మెల్యేలకు హుకుం జారీచేసేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించిన గడప గడపకు వర్క్ షాపులో వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గాల బాధ్యులకు ఊపిరాడని విధంగా జగన్ ఇబ్బంది పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో సీఎం జగన్ వారితో నిర్మొహమాటంగా, కఠినంగానే మాట్లాడారు.
‘నవరత్నాల ద్వారా 88 శాతం మంది ఓటర్లకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఎన్నికల దాకా ఇలాగే చేస్తాం. మన వల్ల లబ్ధి పొందిన వారు మనకు కాక ఇంకొకరికి ఎందుకు ఓట్లు వేస్తారని ఎమ్మెల్యేలను జగన్ ప్రశ్నించారు.  151 స్థానాలు కాదు.. మొత్తం 175 స్థానాల్లోనూ మనమే గెలిచి తీరాలని జగన్ విస్పష్టంగా చెప్పారన్నారు. మనం 175 సీట్లు గెలుచుకోబోతున్నాం.. గెలిచే తీరుతాం  అంటూ సాగిన జగన్ ప్రసంగం ఎమ్మెల్యేల్ని హిప్నటైజ్ చేసినట్లు ఉందంటున్నారు. తాను చెప్పడమే కానీ ఎమ్మెల్యేలకు మాట్లాడే ఛాన్సే జగన్ ఇవ్వలేదు.  మళ్లీ మీరు గెలవాలంటే ఇంటింటికీ వెళ్లి,  మీకు ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇంత లబ్ధి చేకూర్చాం  అని చెప్తే చాలు.. ఒక్క ఇల్లు కూడా వదలిపెట్టకూడదు అని ఆదేశించారు. ఓ 27 మంది ఎమ్మెల్యేలు ఆ పని చేయడం లేదని చెబుతూ వారి పేర్లు వెల్లడించి మరీ వారందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్. మరొకసారి చెప్పేది లేదు.. టిక్కెట్ ఇచ్చేది లేదు’ అని హెచ్చరించారు. జగన్ మాటల తీవ్రతకు బుర్ర గిర్రున తిరిగిందని, మైకం కమ్మినట్లైందని ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారంటున్నారు.

టికెట్లకు అనర్హులని జగన్ చదివిన 27 పేర్లలో ఎక్కువ మంది మహా చురుకైన వారే. చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియోజకవర్గంలో చేయని పనిలేదు. ప్రత్యర్థుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కొడాలి నాని సింహం నోట్లో తలపెట్టేందుకైనా వెనుకాడరని తెలిసిందే.  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షణం ఖాళీగా ఉండరు. అందరి కంటే ముందు గడప గడప కార్యక్రమం పూర్తిచేశారు. రాజకీయంగా ఇంత చురుకుగా ఉండే ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీఎం ఏ ప్రాతిపదికన అంచనా వేశారో తెలియదు. కేవలం గడప గడప తిరిగితేనే ఓట్లు పడతాయా అనేది తొంభై శాతం మంది ఎమ్మెల్యేల్లో మెదులుతున్న ప్రశ్న. గడప గడపకు వెళ్లి జనం సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిళ్లు నమిలి వచ్చేస్తే ప్రయోజనం ఏమిటన్నది వారి సందేహం. ఈ ప్రశ్నలను, సందేహాలను జగన్ ముందు ఉంచలేక ఎమ్మెల్యేలు వారిలో వారు మధన పడుతున్నారు.  

అన్ని ప్రతికూలతల మధ్యా సాహసించి గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను జనం వదలిపెట్టడం లేదు. తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. ఎక్కువ శాతం మందికి పథకాలు అంది, వారంతా జగన్ పట్ల కృతజ్ఞతగా ఉంటే ఇక ఎమ్మెల్యేల పాత్ర ఏమి ఉంటుంది?  వారు గడప గడపకు తిరగకపోతే వచ్చే ప్రమాదం ఏమి ఉంది?  ఎమ్మెల్యేలను చూసి జనం ఓటు వేయనప్పుడు, ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఎందుకు? అనే ప్రశ్నలు విన వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను అర్ధం చేసుకోకుండా సీఎం చేయిస్తున్న సర్వేలు, అంచనాలు మేలు చేస్తాయా అనేది వైసీపీ శ్రేణులు సైతం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవం. ప్రజలు శాపనార్ధాలు పెడుతున్నారు. నిందిస్తున్నారు. కానీ జగన్ మాత్రం లబ్ధి పొందినవారు గంప గుత్తగా తనకే ఓట్లు వేస్తారని గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ విధమైన జగన్ తీరే ఎమ్మెల్యేలకు నచ్చడంలేదు. కాగా.. జగన్ పైకి కన్పించినంత అమాయకుడు కాదని, ఎన్నికల నాటికి ప్రత్యర్థులు అవాక్కయ్యేలా దెబ్బకొట్టడానికి అస్త్రాలు రెడీ చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలను ఆయన ఆంతరంగికులు సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది.

జగమొండి జగన్ కు అర్థం కాని మరో కీలకాంశం కార్యకర్తల్లో ప్రబలుతున్న అసంతృప్తి. ఈ మూడేళ్లలో వైసీపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఉపకారమేదీ లేదు. జగన్  విజయం కోసం వైసీపీ కార్యకర్తలు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకొని ఎందుకు పనిచేస్తారనే ప్రశ్న వస్తోంది. ఈ ప్రమాదాన్ని జగన్ గుర్తించడం లేదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై సీఎం ఆదేశాలకు, ఎమ్మెల్యేల ఆలోచనలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తన పథకాలు, బటన్ నొక్కుడు వల్ల సగానికి పైగా స్థానాల్లో వైసీపీ గెలవడం ఖాయమని, మరోసారి అధికారం తథ్యమనీ జగన్ నమ్ముతున్నారు. కానీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వెళ్లి, ప్రచారంచేసే పరిస్థితులు ఉండకపోవచ్చుననీ, పోలీసు భయం పోయిన తర్వాత ప్రజల తిరుగుబాటు ఉధృతంగా ఉంటుందనీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.

బాగా పనిచేసే వారిని, నిత్యం ప్రజల మధ్యే తిరిగేవారిని తప్పు పట్టి, జనానికి అందకుండా తిరిగే వారికి మంచి మార్కులు వేయడంలోనే జగన్ అంచనాలు సరిగా లేవని అర్ధమవుతోందని ఎమ్మెల్యేలు  వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ప్రభుత్వం సమస్య ఎదుర్కొంటోందా అనే ఆలోచన సీఎం చేయడం లేదని వీరి భావన. ధరల పెరుగుదల, దోపిడీ మాదిరిగా సాతుగున్న మద్యం, ఇసుక అమ్మకాలు, ఉద్యోగుల అసంతృప్తి, ఉపాధ్యాయుల ఆగ్రహం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోయిన అవినీతి వంటి అంశాలను ప్రధానంగా జనం చర్చిస్తున్న విషయం జగన్ కు తెలుస్తోందా? ఆయనకు అర్ధమౌతోందా అని ప్రశ్నిస్తున్నారు. 

ధరల పెరుగుదలతో జనం మండిపోతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిప్పు రాజేస్తున్నారు. జగన్ తీరుతో వైసీపీ కార్యకర్తల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇవన్నీ గాలికి వదిలేసి పథకాలు మాత్రమే ఓట్లు తెస్తాయనుకొంటే పుట్టి మునగడం తధ్యం సామీ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసలు వ్యతిరేకత అంతా మీ మీదే సామీ.. మా మీద కాదు’ అని తన జగన్ పైనే  వారు సెటైర్లు వేసేదాకా వచ్చింది. అయినా  పరిస్థితి జగన్ కు ఎందుకు అర్ధం కావడం లేదో అర్ధం కావడం లేదని వారు జుట్టు పీక్కుంటున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.