జగన్ నియోజకవర్గ సమీక్షలకు మంగళం.. ఎందుకో తెలుసా?

Publish Date:Sep 20, 2022

Advertisement

రాజుగారికి వేగులు ఎలాగో రాజకీయ పార్టీకి క్యాడర్ అలగ..ఇది ఏపీ సీఎం జగన్ నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. రాజుగారి వేగులు రాజ్యంలో ప్రజలేమనుకుంటున్నారన్నది రహస్యంగా సమాచారం సేకరించి రాజుగారికి చేరవేస్తారు.

ఆ చేరవేసే సమాచారం అంతా రాజుగారి చెవులకు, మనసుకు హాయి కలిగించేదిలాగే ఉండాలన్నది అలిఖిత షరతు. ఎవ్వరూ ఆ సంగతిని వేగులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకి అలా తెలిసిపోతుందంతే. ఏదో సినిమాలో నటి అంజలి మాటమాటికీ ‘ఏమో నాకన్నీ తెలిసిపోతాయంతే’ అంటుంటుంది. అలా ప్రత్యకమైన హేతుబద్ధమైన కారణం ఏమీ లేకుండానే రాజుగారి వేగులకు రాజుగారికి ఏం చెబితే నచ్చుతుందో అలా తెలిసిపోతుందంతే.

అలా తెలియని వేగులకు ఎలాగూ సమస్యలు తప్పవు. తల కోటగుమ్మానికైనా వేలాడొచ్చు. వేగు కొలువు ఊడిపోయినా ఊడిపోవచ్చు. జగన్ విషయంలో కూడా అంతే తమ పార్టీ అధినేతకు ఏం చెబితే రుచిస్తుందో ఆయన పార్టీ క్యాడర్ కు తెలుసు. ఏమో వారికి అలా తెలిసిపోయిందంతే. కానీ అదే క్యాడర్ లో అలాంటి లోకజ్ణానం లేని వారు కూడా ఉన్నారు.

వారు అధినేత ముందు సమస్యలు ఏకరవు పెట్టారు. అభివృద్ధి, చేసిన పనులకు బిల్లులు, ఆగిపోయిన పెన్షన్లు అంటూ కొండవీటి చాంతాడంత జాబితాను జగన్ ముందు ఉంచారు. ఎలా అంటారా? తనకు అవసరమైతే తప్ప మంత్రుల ముఖం కూడా చూడటానికి ఇష్టపడని జగన్ పార్టీ క్యాడర్ ను ఎప్పుడు కలిశారు అన్న అనుమానం కలుగుతోంది. జగన్ ను కలిసిన వారు ఓ రెండు నియోజకవర్గాలకు చెందిన క్యాడరే. వాళ్లని కూడా అనేక వడపోతల తరువాత.. వారంతా జగన్ కు పరమ భక్తులని నిర్ణయించుకున్న తరువాత వారిని జగన్ ముందు ప్రవేశ పెట్టారు.  అయితే వందిమాగధుల ఊహలు తల్లకిందులయ్యాయి. అంతటి భక్తులూ అధినేత ముందు సమస్యల చిట్టా విప్పేశారు. పార్టీ పరువు గంగలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అధినేతకు నివేదించారు.

అసలు విషయమేమిటంటే.. రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరగడంతో ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ సమీక్షలకు ఉపక్రమించారు. ముందుగా ఆయన కుప్పం, రాజాం నియోజకవర్గాల క్యాడర్ తో భేటీ కావాలని అనుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున ఎంపిక చేసి మరీ పిలిపించారు. వరుసగా రెండు రోజుల పాటు రోజు కో నియోజకవర్గం చొప్పున జగన్ సమీక్షించారు. అంతే అక్కడితో నియోజకవర్గ సమీక్షలను జగన్ బంద్ చేశారు. నియోజకవర్గ సమీక్షలు, క్యాడర్ తో సమావేశాలు అంటేనే ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఎందుకు అలా అని ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. పరిశీలకుల కథనం ప్రకారం జగన్ అభిమానులు టుది కోర్ అనుకున్న 50 మంది పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసి మరీ నియోజకవర్గ సమీక్షల కోసం పిలిపిస్తే.. జగన్ ముందు వారు హాజరు ప్రభో అనడానికి ముందే నియోజకవర్గంలో పార్టీకి సానుకూల అంశాలు తప్ప ప్రతికూల అంశాలు ఏ మాత్రం ప్రస్తావించవద్దని విస్పష్ట ఆదేశాలు ఇస్తే.. వారు మాత్రం జగన్ ముందు సమస్యలనే ఏకరవు పెట్టారట.

బిల్లులు, పథకాలలో కోతలు, రోడ్లపై గుంతలు, అడుగంటిన అభివృద్ధి అంటూ ఓ పేద్ద జాబితాను జగన్ ముందు ఇచ్చారు. కుప్పం క్యాడర్, రాజాం క్యాడర్ కూడా కూడబలుక్కున్నట్లు ఇవే విషయాలు ప్రస్తావించడంతో జగన్ ఇక క్యాడర్ తో కలిసే ప్రశక్తే లేదని ఖరాఖండిగా నిర్ణయానికి వచ్చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో జగన్ నియోజకవర్గాల సమీక్ష రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇక నియోజకవర్గాన్ని కాపాడుకుని, అక్కడ పార్టీ జెండా ఎగిరేలా చూడాల్సిన బాధ్యతను ఉన్న చోట ఎమ్మెల్యేలకూ లేని చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జీలకు అప్పగించేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు.  దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి కొండలా పేరుకు పోతోంది. ఈ పరిస్థితిపై పార్టీ క్షత్రస్థాయి క్యాడర్ లో ఆందోళన పెరుగుతోంది. జగన్ ఇప్పటికైనా పట్టించుకుని క్యాడర్ సమస్యలను అడ్రస్ చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున పని చేయడానికి క్యాడర్ ఉండని పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.