జగన్ మావిగన్ సవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్ చెబుతున్న మావిగన్ అంటే ఏమిటో భగవంతుడికే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల.. వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అమరావతి పనుల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు.. ఆ అవినీతికి విరుగుడుగా.. తాను అధికారంలోకి వస్తే మావిగన్ ను రాజధాని చేస్తానని ప్రకటించారు. అదే తన ఎన్నికల నినాదమని చెప్పారు. సహజ వనరులు, ముందే సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల వల్ల మావిగన్ లాభదాయకమన్నారు.
జగన్ మావిగన్ ప్రకటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లెలో జరిగిన విక్సిత్ భారత్-గ్రామ్ స్కీమ్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలా మావిగన్ ఏమిటో దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానులంటూ ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారనీ, ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో 29 వేల మంది రైతులు 33వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా అప్పగించారని గుర్తు చేసిన ఆయన అటువంటి అమరావతిని గత ప్రభుత్వం శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసిందన్నారు. రాజకీయ స్వార్థం కోసం చెరుకు తోటలకు నిప్పు పెట్టి, ఆ నెపం ఇతరులపై నెట్టే కుట్రలు చేశారని గుర్తు చేశారు.
తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ లాంటి శాశ్వత రాజధానులు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి గత ఐదేళ్లలో దాపురించిందన్న చంద్రబాబు.. 2026లో పార్లమెంటు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టాన్ని ఆమోదించిందని, ఇది జూన్ 2024 నుండి పాత తేదీతో అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్రం అందించిన ఈ చట్టబద్ధమైన రక్షణతో అమరావతి ఎదుగుదలను భూమిపై ఏ శక్తి కూడా ఆపలేదన్న చంద్రబాబు.. రాజకీయ నాయకుడు మాట మీద నిలబడాలని.. పూటకో మాట మార్చే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతిని 2028 నాటికి క్వాంటం వ్యాలీగా, నాలెడ్జ్ హబ్‌గా పూర్తిస్థాయిలో నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-no-consistenct-on-capital-25-224925.html
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.