వినరు..కనరు..నోరెత్తనివ్వరు!

Publish Date:Jun 9, 2022

Advertisement

చెప్పింది వినరు, చేసేది చెప్పరు.. సమస్యలు పట్టించుకోరు.. విమర్శలను సహించరు. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు.. కానీ రాజే మొండివాడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలంటే.. ఛఛ చెప్పడం ఎందుకు ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలను చూపిస్తే సరిపోతుంది. నోరెత్తడానికి లేదు.. చెవులకు పని చెప్పడం తప్ప. నియోజకవర్గాలలో చేయడానికి ఏమీ ఉండదు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలూ చేసేది చూడటం తప్ప.

నియోజకవర్గంలో సమస్యలపై జనం నిలదీస్తుంటే ఏం చేయాలో తెలియక జగన్ వద్దకు వెడితే.. ఆయన ప్రభుత్వ పథకాలూ, గత ప్రభుత్వ తప్పిదాలు అంటూ ఆవు కథ చెబుతారు. అది విని తీరాలి. అదే వినాలి. అయన ఎదుట చెవులకే పని చెప్పాలి. నోరెత్తి  మాట్లాడకూడదు. ఫైరైపోతారు. ఫైర్ చేసేస్తారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు నోరు కుట్టేసుకోవడం తప్ప మట్లాడే అవకాశమే లేదు. ఇంతా చేసి అన్నీ సహించి ఊరుకుంటే చివరాఖరికి ప్రజా వ్యతిరేకతకు ఎమ్మెల్యేల అసమర్థతే కారణమంటూ వారి ఫర్ఫార్మెన్స్ కు మార్కులేసి క్లాసులు పీకుతారు. దీంతో ఎమ్మెల్యేలు బలికి సిద్ధమైన గొర్రెల్లా మారారు. తమను బలిచ్చైనా సరే మరో సారి తాను ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యాన్ని చేరుకోవడమే జగన్ ధ్యేయంగా కనిపిస్తోందని ఎమ్మెల్యేలు లబో దిబో మంటున్నారు.

ప్రజలు అయితే హాయిగా జగన్ ప్రసంగాలు వినకుండా సభనుంచి వెళ్లిపోయి నిరసన తెలపగలరు. వాళ్లకా హక్కు ఉంది. దానికి కూడా ఎమ్మెల్యేలే బాధ్యులంటే ఎలా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఏ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కలిసినా బాధలు పంచుకుని భోరు మనే పరిస్థితి ఉంది. ఇక మంగళవారం నాటి వర్క్ షాప్ అయితే మరీ దారుణమని వైసీపీ ఎమ్మెల్యేలే ఆఫ్ ది రికార్డ్ చేబుతున్నారు. ఇంతకీ అసలు వర్క్ షాపులో ఏమైందంటే.. జగన్ ప్రభుత్వ గొప్పలను సుదీర్ఘ ప్రసంగంలో వివరించేశారు. ఎమ్మెల్యేలు ప్రజలలో మమేకం కావాలని ఉద్భోదించారు. గడప గడపకూ  మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోలేదంటూ క్లాస్ పీకారు.

అసలీ కార్యక్రమం ఇంకా ప్రారంభించని ఎమ్మెల్యేలకు జీరో పర్ఫార్మెన్స్ అంటూ ‘వీరతాడులు’ తగిలించారు. ఇక అప్పుడు మీ కేమైనా సమస్యలున్నాయా చెప్పండంటూ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. ఇక్కడే జగన్ డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకునేలా తొలుత మాట్లాడిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో సమస్యలే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలనూ ఎత్తి చూపేశారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న లక్ష్యం చేరుకోవాలంటే.. పనులు చేయక తప్పదనీ, బిల్లులు చెల్లించి తీరాలనీ సూచనలూ సలహాలూ ఇచ్చేశారు.అయితే జగన్ వాటిని వేటినీ అంగీకరించలేదు. ఎమ్మెల్యేలై ఉండి మీడియాలో వచ్చిన వార్తలు ఇక్కడ వల్లె వేస్తారేమిటంటూ చిరాకు పడ్డారు.

అయినా సరే అవన్నీ చేయడం సాధ్యం కాదు అని కుండబద్దలు కొట్టేశారు.దీంతో మిగిలిన ఎమ్మెల్యేలెవరూ మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కాదు కాదు సాహసం చేయలేదు. మొత్తం మీద  ఈ వర్క్ షాపు ద్వారా అర్ధమైందేమిటంటే.. జగన్ ప్రభుత్వం పనులు చేయదు, వైఫల్యాలను సరిదిద్దు కోదు..  జగన్ మరోసారి సీఎం అవ్వడానికి వైసీపీ ఎమ్మెల్యేలు బలి పశువులుగా మారి సోపానాలవ్వాలి. అంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదు, ఎమ్మెల్యేల వైఫల్యంగా చూపించి..వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వరు. మరో కొత్త ముఖాన్ని తీసుకువచ్చి.. మీ పాత ఎమ్మెల్యే చాతకాని తనం వల్లే సమస్యలు పేరుకుపోయాయి.. అందుకే టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటారు. ఒక్క చాన్స్ సరిపోలేదు, మరోక్క చాన్స్ అంటూ మళ్లీ నవరత్నాలనో, ఏవో వజ్రాలంటూనో జనం ముందుకు వస్తారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలకు దూరమై, పార్టీలోనూ పలుచనై వైసీపీ ఎమ్మెల్యేలు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యరని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.