గెలిపించండి మంత్రిప‌ద‌విస్తా.. జ‌గ‌న్ తాయిలాల ప్ర‌క‌ట‌న‌!

Publish Date:Sep 3, 2022

Advertisement

ఎవ‌రు హోంవ‌ర్క్ త్వ‌ర‌గా పూర్తి చేస్తే వారికి చాక్లెట్ అంటూ త‌ల్లి, ఎవ‌రు ప‌రీక్ష బాగా రాస్తే వారికి  పుస్త కాలు ఫ్రీ అని హెడ్‌మాస్ట‌రు, ఎవ‌రు బాగా ఆడితే వాళ్లే కెప్టెన్ అని ఆట‌ల్లో పిల్ల‌ల‌కి తాయిలాలు ప్ర‌క‌టించి వారిని ఊరించ‌డం చూస్తూనే ఉంటాం. రాజ‌కీయాల్లోకి ఇది వ‌చ్చేసింద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ద్వారా తెలి సింది.  ఎవ‌రు గెలిస్తే వారికి, ఎవ‌రిని గెలిపిస్తే ఆ విజేత‌కీ మంత్రిప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ తాయిలాల ప్ర‌చా రం మొద‌లెట్టారు. 

రాజ‌కీయాల్లో స‌హ‌జ‌సిద్ధంగా ఎద‌గాల్సి ఉంటుంది. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ఆయా ప్రాంతాల్లో వారికి కాస్తం త మంచిపేరు ఉండాలి, మంచి ఫాలోయింగ్ అవ‌స‌రం. అలాంటివారికి ఎలాగూ పెద్ద‌గా ప్ర‌చారం అవ‌స రం లేదు. కానీ ప్ర‌త్య‌ర్ధిని అనుస‌రించి ప్ర‌చారం గ‌ట్టిగానే చేయాల్సివ‌స్తుంది. కానీ గెల‌వ‌డానికి అభ్య‌ర్ధి లేదా అభ్య‌ర్ధిని గెలిపించి మ‌హా వీరాభిమానులు కాళ్లు చేతులు విరిగేలా ప‌నిచేసుకుని మెజారిటీ సాధిం చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి తోడు జ‌గ‌న్ కొత్త‌గా తాయిలాల ప‌ద్ద‌తి ఆరంభించారాయె. క‌నుక ఇపుడు గెలిచి తీరాలి. గెలిస్తే బ‌తిమాల‌కుండానే ఆయ‌న మంత్రిప‌ద‌వి ఇస్తాన‌ని హామీ కూడా ఇచ్చేశారు. అంటే ఇలా పార్టీని మంచి మెజారిటీతో నిల‌బెట్ట‌డానికి వ్యూహం అయిన‌ప్ప‌టికీ అది ఆ అభ్య‌ర్ధికి ఏ మేర‌కు నిజం గానే ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది త‌ర్వాత చూడాలి. నానా అవ‌స్థాప‌డి గెలిచాక జ‌గ‌న‌న్న కాస్తా మొండిచేయి చూపితే ప‌డిన క‌ష్టంతో ఒళ్లుపులిసి, కాసులు పోయి ఇంటికి ప‌రిమితం కావాల్సి వ‌స్తుంది. 

రాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది!  కానీ... వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గెలిస్తే నువ్వే మంత్రి. గెలిపిస్తే మీ నాయకుడికి మంత్రి పదవి ఇస్తా నం టూ నేతలను, కార్యకర్తలను ఊరిస్తున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు... పార్టీ బలహీనంగా ఉన్నచోట, గెలు పు సందేహాస్పదంగా ఉన్నచోటల్లా ‘గెలిస్తే మంత్రి పదవి నీకే’ అని మాట ఇస్తున్నారు. ఎన్నికల వ్యూహం లో భాగంగా గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాపులు, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమా వేశాలు నిర్వహిస్తున్నారు. మీ నాయకుడిని గెలిపించుకుని రండి.  మంత్రిని చేస్తా అంటూ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలకు చెబుతున్నారు. అస‌లే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంతో అవ‌మానాలు ఎదుర్కొ న్న‌వారు ఇపుడు ఎన్నిక‌ల్లో గెలిచేందుకు మ‌ళ్లీ ఇంటింటికీ వెళ్లి మొహం చూప‌డం క‌ష్ట‌మే. మ‌రి జ‌గ‌న‌న్న ఆశ‌పెట్టారు గ‌నుక అవ‌మానాలు, తిట్లూ ఒక లెక్కా అనుకుంటే అలాగే ముందుకు సాగిపోతారు, తిట్ల‌కంటే, అవ‌మానాల‌కంటే మంత్రిప‌ద‌వి అత్యుత్త‌మం అన్న‌ది రాజ‌కీయ‌ప్ర‌భోద క‌దా.  

ఉదాహ‌ర‌ణ‌కు కుప్పంలో భరత్‌ను గెలిపించుకు రావాలని, ఆయనను మంత్రిని  చేస్తానని  చెప్పారు. రాజాంలో  కంబాల  జోగులును గెలిపించుకుని వస్తే  ఆయనకూ మంత్రి  పదవి ఇస్తానని  తెలిపారు.  మీ నాయకుడిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాన‌ని జగన్‌ చెప్పడం ప్రసార మాధ్యమాల్లోనూ రావడం పరిపాటిగా మారింది.  

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులయ్యే వీలుందని .. ముఖ్యమంత్రి జగన్  ఇస్తున్న హామీలు  చూస్తుంటే.. ఆ సంఖ్య  దాటేస్తుందని  వైసీపీ నేతలు అంటున్నారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు. ఎంతకైనా తెగించేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నట్లు భావిస్తున్నారు.  జగన్‌ మంత్రి పదవి హామీ ఇచ్చిన తర్వాతే కుప్పంలో చంద్రబాబును భరత్‌ వర్గం అడ్డుకునే ప్రయ త్నం చేసిందని రాజకీయవర్గాలు పేర్కొంటు న్నాయి.

గత ఎన్నికల సమయంలోనూ...ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల ఆశ చూపి... చివరికి చెయ్యివడం జగన్‌కు కొత్తేమీ కాదని గత అనుభవాలు చెబుతున్నాయని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. 2019 ఎన్ని కల ముందు కూడా ఇలాంటి హామీలు అనేక మందికి ఇచ్చారని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మె ల్యే సీటును ఆశించిన మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇస్తానని జగన్‌ హామీలు గుప్పిం చారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయింది. మంత్రిపదవి పక్కనపెడితే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మె ల్సీ కూడా దక్కలేదు. 

తాజాగా 2023లో మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా పలు జిల్లాల్లో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానంటూ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మ‌రి ఈ నేప థ్యంలో నాయ‌కుని హామీకి త‌లొగ్గి  వైసీపీ నేత‌లు ఏమాత్రం ఉత్సాహ‌ప‌డ‌తారో చూడాలి.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.