జగన్ పర్యటన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ప్లస్ అయ్యేనా?

Publish Date:Jul 20, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. శ్రీపోట్టి శ్రీరాములు జిల్లాలో  శుక్రవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంకటగిరిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ  ఇన్ ఛార్జీగా నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని గతంలోనే నియమించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు   2019 ఎన్నికల్లో  వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆనం రామ్‌నారాయణ రెడ్డి గెలుపొందారు. కానీ ఆ తర్వాత.. జగన్ ఆయనకు పార్టీలో   సరైన గుర్తింపు ఇవ్వలేదన్న కారణంతో  ఆనం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రావడంతో  నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని  నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆనం పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రగ్గం సిద్దం చేసుకొన్నారని  అప్పట్లోనే పార్టీ శ్రేణుల్లో విస్తృత చర్చ జరిగింది. కాగా  ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో...   పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు.. ఆనం రామ్‌నారాయణ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్లితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. 

దీంతో సస్పెన్షన్ వేటు పడిన నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు టీడీపీ మద్దతు ప్రకటించించిన విషయం విదితమే. మరోవైపు గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 స్థానాలు జగన్ పార్టీ ఖాతాలో పడ్డాయి. కానీ ఇప్పుడు  ఆ పరిస్థితి లేదని.. వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా 10 స్థానాలూ టీడీపీ ఖాతాలో పడినా ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ ప్రచారం సైతం నెల్లూరు జిల్లాలో సాగుతోంది.

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. ఇటీవల నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైన ప్రజా స్పందనతో సాగింది. మరో వైపు  జిల్లాలో వైసీపీలో అసమ్మతి ఆరున్కొక్క రాగం ఆలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో  జిల్లాలో సీఎం వైయస్ జగన్.. పర్యటన ఆసక్తిరేపుతోంది. ఆయన పర్యటన పార్టీకి మరీ ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ కు ఏమైనా ప్లస్ అవుతుందా? లేదా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే సాగుతోంది. 

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.