జగన్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారా?

Publish Date:Oct 17, 2015

Advertisement

 

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం నాయకుడు జగన్మోహన్ రెడ్డి రానని చెప్పడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చంటిపిల్లాడిలాగ వ్యవహరిస్తూ తనకీ, తన పార్టీకి కూడా ప్రజలలో దురాభిప్రాయం ఏర్పడేలా చేస్తున్నారని ప్రజలే అనుకొంటున్నారు. రాజకీయాలలో ఉన్నవారు ఎంతో బ్యాలన్స్ గా ఉండాలి. ప్రతీ దానికి వెంటనే ఆవేశంగా స్పందించడం, దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం అసలే తగదు. అటువంటివాళ్ళు ప్రజల నోళ్ళలో, మీడియాలో బాగానే నానుతారు కానీ రాజకీయాలలో మాత్రం ఎన్నడూ రాణించలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు మాజీ మంత్రి శంకర్ రావు వంటివాళ్ళు అనేకమంది సజీవ సాక్ష్యాలుగా కళ్ళముందే ఉన్నారు.

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి చాల విపరీతంగా ద్వేషిస్తున్నారు కనుక ఆయన, ప్రభుత్వం ఏమి చేసినా దానిని వ్యతిరేకించడమే “వైకాపా పాలసీ”గా మార్చుకొని ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగానే కనబడుతోంది. ఆ కారణంగా  ఆయన చేస్తున్న పోరాటాలు ఎన్నడూ విజయవంతం కాలేకపోతున్నాయని చెప్పవచ్చును. ఆయన ప్రజల తరపున నిలబడి పోరాడుతున్నప్పటికీ వారి మద్దతు పొందలేకపోతున్నారు. ఆ విషయం ఆయన ఇంతవరకు గ్రహించక పోవడం విచిత్రమే. 

 

రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి రాష్ట్రాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి దొరకాలంటే తప్పకుండా ప్రత్యేక హోదా కావలసిందేనని వాదిస్తూ నిరాహార దీక్ష చేసారు. ఆయన నిజంగానే ప్రత్యేక హోదా కోసమే నిరాహార దీక్షకు కూర్చొని ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు అందరూ ఆయనకి తప్పకుండా మద్దతు పలికేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు మరే ఇతర సమస్య కనబడకపోవడంతో ఈ సమస్యని అందుకొని దీక్షకి కూర్చొన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం దానిపై హామీ ఇచ్చే పరిస్థితి ఉండదు కనుకనే దానిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే ఆయన దీక్ష చేసారని చెప్పవచ్చును. అందుకే తన దీక్షలో చంద్రబాబు నాయుడుని ఆయన ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ యుద్ధం చేసారు తప్ప ప్రత్యేక హోదా ఏవిధంగా సాధించుకోవాలని ఆలోచనలు చేయలేదు.

 

అమరావతి శంఖుస్థాపనకి సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం ముమ్మురంగా అందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రాష్ట్ర ప్రజల దృష్టి వాటిపైకి మళ్లడంతో జగన్ దీక్షకు ఆశించినంతగా స్పందన రాకపోవడం, చివరికి తమ దీక్షను పోలీసులచేత భగ్నం చేయించమని ప్రాధేయపడవలసిన పరిస్థితులు ఎదురవడంతో జగన్ అండ్ కో చంద్రబాబు నాయుడుపై, ఆయన ప్రభుత్వంపై చాలా పగతో రగిలిపోవడం సహజం. బహుశః అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా శంఖుస్థాపన కార్యక్రమానికి పిలిచినా రానని జగన్ ప్రకటించేశారు. అయితే తన కోడి కూయకపోతే లోకానికి తెల్లారదని వెనకటికి ఎవరో అనుకొన్నట్లే, తను వెళ్ళకపోతే శంఖుస్థాపన కార్యక్రమానికి జరగదనే భ్రమలో జగన్ ఉన్నట్లున్నారు. కానీ రాష్ట్రానికి చెందిన ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ప్రజలకి తన గురించి ఎటువంటి అభిప్రాయం కలిగిస్తున్నారో గ్రహించడం లేదు. ఇటువంటి దుందుడుకు వ్యక్తికి  రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏమవుతుందో..అనే ఆలోచన ప్రజలలో ఆయనే స్వయంగా రేకెత్తించగలిగారు. ప్రజలు తాము చంద్రబాబు నాయుడిని ఎన్నుకొని పొరపాటు చేయలేదని గ్రహించేలా జగన్ చేసారు.

 

జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటన చేసిన 24 గంటల వరకు వైకాపా నేతలు ఎవ్వరూ మీడియా ముందుకు వచ్చి తమ అధినేతను సమర్ధిస్తూ మాట్లాడకపోవడం గమనించినట్లయితే ఆయన తన నిర్ణయం ప్రకటించే ముందు తన పార్టీలో సీనియర్ నేతలెవ్వరినీ సంప్రదించలేదని స్పష్టం అవుతోంది. పార్టీ అంటే కేవలం తనే అనే అభిప్రాయం ఉన్నవాళ్ళే ఈవిధంగా వ్యహరిస్తుంటారు. అటువంటివాళ్ళు ఇంకా చాల మందే ఉన్నారు. కానీ వాళ్ళ చేతిలో అధికారం ఉంది కనుక ఏమి మాట్లాడినా ఏమి చేసినా చెల్లుతుంది. కానీ ప్రతిపక్షంలో కూర్చొని పార్టీకి ఈవిధంగా శల్య సారధ్యం చేస్తుంటే చివరికి ఆయన నడుపుతున్న వైకాపా రధం ఎన్నికల యుద్దరంగం చేరేనాటికి అందులో ఎవరూ ఉండకపోవచ్చును. అందరూ అవతలవైపు నిలబడి ఆయనతోనే యుద్ధం చేయడానికి నిలబడి ఉండే అవకాశం ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.