Publish Date:Apr 27, 2022
జగనన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీని ధిక్కరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. బహిరంగ విమర్శలు చేసే వారినీ పక్కన పెట్టేస్తానని స్పష్టం చేశారు. ఆ మేరకు మంత్రులు, వైసీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్‌రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ వార్నింగ్‌తో.. ఇటీవల ఓవరాక్షన్ చేసిన మాజీ మంత్రులు బాలినేని, సుచరిత, అనిల్ నుంచి.. మినిస్టర్ పోస్ట్ రాలేదని రచ్చ రచ్చ చేసిన సామినేని, పిన్నెళ్లి, కోటంరెడ్డి తదితరలు అందరికీ జగనన్న షాక్ ఇచ్చారని అంటున్నారు. వారిని ఉద్దేశించే ఇలాంటి హెచ్చరిక చేశారని చెబుతున్నారు. పార్టీలో తానే సుప్రీం అని.. తోక జాడిస్తే.. ఎమ్మెల్యే టికెట్ కట్ చేస్తానంటూ.. బాసిజం ప్రదర్శించారు జగన్.
‘‘విభేదాలు వీడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మే లో ‘ఇంటింటికి వైసీపీ’ కార్యక్రమం నిర్వహిద్దాం. విభేదాలు వీడి కలసికట్టుగా పని చేయాలి. త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తా. జులై 8న ప్లీనరీ’’ అని ఆ మీటింగ్‌లో జగన్ చెప్పారు.
పనిలో పనిగా ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతానని స్పష్టం చేశారు. రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీంమన్నారు. గెలిస్తేనే మంత్రి పదవి అని, గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎవ్వరూ తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదని.. 175కి 175 సీట్లు ఎందుకు గెలవమని జగన్ అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-mla-ticket-warning-to-ycp-leaders-25-135095.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.