మేకపాటి ఫ్యామిలీలో జ‌గ‌న్ చిచ్చు.. గౌత‌మ్‌రెడ్డి సీటు ఎవ‌రికి?

Publish Date:Mar 4, 2022

Advertisement

జగన్ రాజేసిన చిచ్చు కారణంగా మేకపాటి కుటుంబం రెండుగా చీలనుందా...? జగన్ కావాలనే మేకపాటి రాజమోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహం రచించాడా...? దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో రాజకీయంగా ఆ కుటుంబాన్ని బలహీన పరిచేందుకు వ్యూహం పన్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే అనిపిస్తుంది. మేకపాటి కుటుంబంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అందుకు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. మేకపాటి కుటుంబంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పొలిటికల్ టాక్ నడుస్తోంది.

నెల్లూరు జిల్లాలో ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి కుటుంబాల తరువాత మేకపాటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ ముఖ్యమంత్రులు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి లాంటి రాజకీయ కురువృద్ధులతో కూడా విభేదించి రాజకీయంగా నిలదొక్కుకున్న కుటుంబం మేకపాటి కుటుంబం. చివరిగా వైఎస్సార్ తో సఖ్యతగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగింది ఈ కుటుంబం. రాజశేఖరరెడ్డి మరణానంతరం మేకపాటి కుటుంబం జగన్ కు అండగా నిలిచింది. కాంగ్రెస్ హైకమాండ్ ను ఎదిరించి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి జగన్ కు తోడుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేకపాటి కుటుంబం పదవులు త్యాగం చేసి ఆర్దికంగా, రాజకీయంగా జగన్ కు మద్దతుగా నిలిచింది.

సీన్ కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డికి ఎంపి టిక్కెట్ ఇవ్వకుండా జగన్ షాకిచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జగన్ ముఖం చూసేందుకైనా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇష్టపడలేదట. ఆ తరువాత రాజమోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కొందరు నేతలు రాజమోహన్ రెడ్డి త్యాగానికి ప్రతిఫలంగా మంచి పదవి ఇవ్వాలని జగన్ వద్ద మొరపెట్టారట. దానికి జగన్ స్పందిస్తూ.. ఆయన కొడుకు గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాం కదా.. అని చెప్పి మరోసారి అవమానించారట. దీంతో జగన్ కు రాజమోహన్ రెడ్డికి ఇంకాస్త దూరం పెరిగిందంటారు. అదలా ఉండగా.. మంత్రి మేకపాటి గౌతమ్ అకాల మరణం ఆ కుటుంబాన్ని మరింత చిక్కుల్లో పడేసింది. గౌతమ్ మరణంతో ఆ కుటుంబంపై మరింత బాధ్యత పెంచింది. కొడుకు చూసుకుంటాడులే.. అనుకుని ప్రశాంతంగా ఉన్న సమయంలో గౌతమ్ రెడ్డి మరణించడంతో రాజమోహన్ రెడ్డి మరింతగా కుంగిపోయారు.

ఇదే సమయంలో.. జగన్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై మరో బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి పేరు తెరమీదకు తెచ్చారట జగన్ రెడ్డి. దీంతో ఆ కుటుంబం సంక్షోభంలో పడిందంటున్నారు. నిజానికి మేకపాటి కుటుంబంలోని మహిళలు ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు తన కోడలికి ఎమ్మెల్యే పదవిని ఆశ చూపి తమ కుటుంబంలో జగన్ రెడ్డి చిచ్చురగిలించారని మేకపాటి రాజమోహన్ రెడ్డి కోపంతో రగిలిపోతున్నారట. అసలే కొడుకును కోల్పోయిన బాధలో ఉంటే తన కుటుంబాన్బి విచ్ఛిన్నం చేసేందుకు జగన్ దుర్మార్గమైన పన్నాగం పన్నారని రాజమోహన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారట.

వాస్తవానికి గౌతమ్ మరణం తరువాత ఆ బాధ్యతలు మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇస్తారని, ఉప ఎన్నికలలో ఆయన పోటీ చేస్తారని, మంత్రి పదవిని కూడా ఆయనకు కట్టబెడతారని కార్యకర్తలు ప్రచారం చేశారు. ఈ విషయం ముందు నుండే పసిగట్టిన జగన్ తన ఎత్తుగడను ముందే అమలు చేశారని ఇప్పుడు తెలియడంతో మేకపాటి కంగుతిన్నారట. గౌతమ్ చనిపోయిన వెంటనే జగన్ సతీ సమేతంగా వెళ్లి ఓదార్చారు. తరువాత అంత్యక్రియలకు ఆయన సతీమణి భారతీరెడ్డిని రంగంలోకి దించారు. గౌతమ్ రెడ్డి భార్య చెవిలో ‘నువ్వే ఎమ్మెల్యే.. రెడీగా ఉండు.. మేం అండగా ఉంటాం’ అని చెప్పారట.

అప్పటి వరకూ రాజమోన్ రెడ్డి మాట జవదాటని కోడలిగా పేరున్బ కీర్తిరెడ్డి ఒక అడుగు ముందుకేసి, తాను ఎమ్మెల్యే అయిపోయినట్టు ఫీలయి రోజుకు రెండుసార్లు భారతీరెడ్డితో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు ఎమ్మెల్యే ఇస్తే.. మంత్రి పదవి కూడా ఇవ్వాల్సి వస్తుందని జగన్ ముందుగానే ఇలాంటి స్కెచ్ వేశారని రాజమోహన్ రెడ్డికి తెలిసిపోయింది. ఈ మధ్య కాలంలో గౌతమ్ రెడ్డి శాఖను అప్పలరాజుకు అప్పచెప్పి.. ఇక మేకపాటికి లేదని చెప్పకనే జగన్ చెప్పారంటున్నారు. కీర్తిరెడ్డికి ఉప ఎన్నికలలో అవకాశం ఇస్తున్నామని ఇప్పటికే ఆయన దూతల చేత తెలియజేశారు. దీంతో ఇప్పుడు మామా కోడళ్ల మధ్య చాలా దూరం పెరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.