ఏపీ సీఎం నార్సిసిజంతో బాధపడుతున్నారు.. రఘురామ రాజు

Publish Date:Apr 10, 2023

Advertisement

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో మారు సొంత పార్టీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసీపీ చేపట్టిన కార్యక్రమం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రచ్చబంగా కార్యక్రమంలో భాగంగా శనివారం ( ఏప్రిల్ 8)న మీడియాతో  మాట్లాడిన రఘురామరాజు వైసీసీ మా నమ్మకం నువ్వే జగన్ అంటుంటే జనం మాత్రం మా నమ్మకం కాదు.. నమ్మక ద్రోహం నువ్వే జగన్ అంటూ విరుచుకుపడుతున్నారని అన్నారు.  

అందుకే జగన్ ను కీర్తిస్తూ వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విపక్ష తెలుగుదేశం సైతం స్వాగతిస్తోందని అయిన అన్నారు. విపక్షం జగనే తమకుఅధికారం కట్టబెడతారన్న నమ్మకం తెలుగుదేశంలో కనిపిస్తోందని చెప్పారు.  విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, ఇంటి పన్నులను పెంచి, చెత్తపై కూడా పన్ను వేసి   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  జనంలో తన విశ్వసనీయతను అధ:పాతాళంలోకి దిగజార్చుకుంటే.. వైసీపీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నువ్వే మా నమ్మకం జగన్ అంటూ ఇంటింటికి తిరిగి స్టిక్కర్లను అతికిస్తుంటే జనం  ఏవగించుకుంటున్నారన్నారు.

ఒకవైపు వైసీపీ వారు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అతికిస్తుంటే, చాలా చోట్ల జనం వాటిని పీకి పారేయడం కనిపిస్తోందని చెప్పిన రఘురామరాజు..  అలా స్టిక్కర్లు పీకేసిన వారిపై జగన్ సర్కార్  చర్చలు తీసుకుంటుందేమోనని అనుమానం కలుగుతోందనిఅన్నారు.  

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నార్సిసిజం అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని రఘురామరాజు అన్నారు. నార్సిసిజం అనేది తనను తాను అతిగా ప్రేమించుకునే మానసిక రుగ్మత పేరు అని వివరించారు.  

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.