తొందరపడి ఓ కోయిలా ముందే కూస్తోందా?.. ప్లీనరీ వేదికగా జగన్ అభ్యర్థుల ప్రకటన

Publish Date:Jun 21, 2022

Advertisement

వైసీపీ ప్లీనరీ వేదికగా జగన్ సంచలన ప్రకటన చేయబోతున్నారా? అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించడమే ఆ సంచలన ప్రకటనా అంటే పార్టీ శ్రేణులు ఔననే అంటున్నాయి. ఒక వైపు ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటూనే.. మరో వైపు విపక్షాలపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు, ప్రణాళికలకు పదును పెడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్లీనరీ వేదికగా సంచలన ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల బరిలో నిలిపే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను పార్టీ ప్లీనరీ వేదికగా జగన్ ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

నిజానికి జగన్ ఈ ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పార్టీ పదవులు ఖరారు చేయడంతో పాటు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎమ్మెల్యేలను జనంలోకి పంపారు. అది విఫలమయ్యేసరికి సామాజిక న్యాయభేరి అంటూ మంత్రుల బస్సుయాత్ర చేయించారు. అదీ విఫలమైనా జగన్ తగ్గేదేలే? అన్నట్లుగా పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.

మళ్లీ అధికారమే లక్ష్యంగా  ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ జగన్ సింగిల్ పాయింట్ అజెండాతో ఎన్నికలకు, కొత్త ఎత్తులతో కదులుతున్నారు.  ఇప్పుడెలా ఉన్నా.. ఎన్నికల సమయానికి జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ- జనసేన ఏకం అవుతాయని వైసీపీ భావిస్తోంది. ఎన్నికలకు తాము సిద్ధమని చెబుతూనే.. వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించి, ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా  ఇడుపులపాయ వేదికగా ఒకేసారి ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితాను జగన్ ప్రకటించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరుపై పలు కోణాల్లో నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు.

ప్రజలు, పార్టీ పట్ల వారి పనితీరు, వచ్చిన నివేదికల ఆధారంగా మార్కులు కేటాయిస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని టిక్కెట్ల ఖరారులో తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల భోగట్టా.  ఎన్నికలకు ఆరు నుంచి 10 నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించేందుకు జగన్  ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారనీ,  తద్వారా అభ్యర్ధులను ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గర చేసి,   ఎన్నికల సమయానికి వారు ప్రజలతో   మమేకం అయ్యేలా చూడాలన్నదే జగన్ వ్యూహమని అంటున్నారు. దీంతో పొత్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచటంతో పాటు టిక్కెట్లు ఎవరికో తేల్చేయటం ద్వారా అభ్యర్ధులకు ప్రచారానికి, ప్రజలకు దగ్గరవ్వటానికి తగినంత సమయం దొరుకుతుందని విశ్లేషిస్తున్నారు.

ఈ సారి టిక్కెట్లు ఇవ్వలేకపోయే వారికి ముందుగానే స్పష్టత  ఇచ్చి వారి సేవలను ఎన్నికల వేళ పార్టీకి వినియోగించుకోవటం, పార్టీ అధికారంలోకి వస్తే కీలక బాధ్యతలు ఇచ్చేలా ముందస్తు హామీ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు   వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్లీనరీ వేదికగా వచ్చే ఎన్నికలపైన కీలక ప్రకటనతో పాటు 2019 ఎన్నికల హామీలు, 2024లో చేయబోయే కార్యక్రమాలపైన ముందుగానే జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

 అయితే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విపక్షంలో ఉందనీ, అప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆ పార్టీ అధికారం చేపట్టలేదనీ.. అందుకే అభ్యర్థుల జాబితాను ఒకే సారి ముందుగానే ప్రకటించినా అసమ్మతి, అసంతృప్తి బెడద పెద్దగా లేదనీ, ఇప్పుడలా కాదనీ, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణతో పార్టీలో భగ్గు మన్న అసమ్మతిని గమనిస్తే.. ప్లీనరీ వేదికగా జగన్ అభ్యర్థుల జాబితా ప్రకటించడమంటూ జరిగితే.. పార్టీలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా ఎగసి పడటం ఖాయమనీ.. అప్పుడు ముందే కూసిన కోయిలలా జగన్ చిక్కుల్లో పడటం ఖాయమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.