మొన్న బ్బ బ్బ.. నిన్న బై బై.. అంతా జగన్నాటకం!

Publish Date:Feb 8, 2025

Advertisement

నన్ను వదిలేయకండి బాబోయ్ అంటూ పార్టీ నేతలు, శ్రేణులను వేడుకున్న జగన్ తాను మాత్రం ఏపీలో ఉండటానికి సిద్ధంగా లేరు. మీ కష్టాలు మీరు పడండి, మీ ఇబ్బందులు మీవే.. కానీ నా వెంట మాత్రం ఉండాలని బతిమలాడుకున్న జగన్.. పార్టీ సంక్షోభంలో ఉన్నా ఇసుమంతైనా పట్టించుకోకుండా బెంగళూరుకు చెక్కేశారు. 
ఒక వైపు విజయసాయి క్యారెక్టర్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ రేగుతోంది. స్వయానా జగన్ సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. జగన్ కు అసలు క్యారెక్టరే లేదంటూ.. వైఎస్ అభీష్ఠానికి వ్యతిరేకంగా తనకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా మోసం చేశారని మరో సారి ధ్వజమెత్తారు.  
ఇక పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలోనూ పీకల్లోతు కూరుకుపోయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో పార్టీని, పార్టీ ఇబ్బందులనూ పట్టించుకోకుండా జగన్ బెంగళూరు చెక్కేశారు. దీంతో పార్టీ నేతలూ, క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒక వైపు మళ్లీ మనం అధికారంలోకి వస్తాం అంటూ చెబుతున్న జగన్ పార్టీని పట్టించుకోకుండా రాష్ట్రం బయటే గడపడం పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. 

ఆయన శుక్రవారం వరకూ ఏపీలో ఉన్నారు. అసలు గురువారం రాత్రే ఆయన బెంగళూరు వెళ్లాల్సి ఉందని, ఆ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు వైసీపీలో చేరే కార్యక్రమం ఉండటంతో ముళ్లమీద కూర్చున్నట్లుగా శుక్రవారం ఉదయం ఆయన చేరిక పూర్తయ్యే వరకూ ఆగిన జగన్ ఆ తరువాత క్షణం ఆలస్యం చేయకుండా గన్నవరం విమానాశ్రాయినికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు.  

ఆయన ఏపీ రాజకీయాలను ఏదో వీకెండ్ వ్యవహారంలో చూస్తున్నారని పరిశీలకులు అంచనావేస్తున్నారు. వారంలో ఏదో రెండు మూడు రోజులు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి, ఆ టైంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాసుకొచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అధికార తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పించి మళ్లీ బెంగళూరు వెళిపోవడం రివాజుగా మారిపోయింది. 

వాస్తవానికి తన విదేశీ పర్యటనకు ముందు సంక్రాంతి తరువాత నుంచీ జిల్లాల పర్యటన చేపడతాననీ, కార్యకర్తలతో జగనన్న కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తాననీ చెప్పిన జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు.  దీంతో క్యాడర్ కూడా జగన్ ను పట్టించుకోవడం మానేసింది.   

అసలే విజయసాయిరెడ్డి పార్టీని వీడటం,సీనియర్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆక్రమించారనే ఆరోపణలపై దర్యాప్తు ఆరంభం కావడం, మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులను ఈడీ సీజ్ చేయడం వంటి వరుస ఘటనలతో పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా జగన్ పార్టీనీ, పార్టీ ఇబ్బందులను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్లిపోవడం పట్ల పార్టీలోనే తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.