Publish Date:Jul 24, 2026
వైసీపీలో ఎప్పుడు ఎవరికి అందలం దక్కుతుందో.. ఎప్పుడు ఎవరికి అధ:పాతాళమే దిక్కౌతుందో తెలియని పరిస్థితి ఉంది. జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ అండతో చెవిరెడ్డి పార్టీలో ఓ వెలుగు వెలిగారు. చెవిరెడ్డికి దక్కిన ప్రాధాన్యత వైసీపీలో మరెవరికీ దక్కలేదంటే అందులో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. అటుంటి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో సరిపెట్టకుండా, ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి మరీ పోటీకి దింపారు జగన్. అటువంటి చెవిరెడ్డిని జగన్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
జగన్ అధికారంలో ఉండగా జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మద్యంవిధానంరూపకల్పన దగ్గరనుంచి డిస్టిలరీల వరకూ చెవిరెడ్డి అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ కుంభకోణంపై ఈడీ దర్యాప్తుచేపట్టింది. అంతకు ముందే ఇదే కేసులో చెవిరెడ్డి అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉండి బెయిలుపై బయటకు వచ్చారు. ఇప్పుడు అదే కుంభకోణం చెవిరెడ్డిని జగన్ కు దూరం చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం కుంభకోణం వ్యవహారంలో జగన్ దృష్టికి కూడా రాకుండా చెవిరెడ్డి తన సొంతంకోసం సొమ్ములు వెనకేశారనీ, సిట్ దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డిని అరెస్టు చేసి విచారించిన సందర్భంలో ఆ వివరాలు వెల్లడయ్యాయనీ పార్టీ వర్గాల భోగట్టా. దీంతో మద్యం కుంభకోణం విషయంలో తన అనుకునన చెవిరెడ్డే తనను మోసం చేశారన్న అసంతృప్తితో జగన్ చెవిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
దీంతో ఒకప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే తరచుగా కనిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ తలుపులు బంద్ అయ్యాయని అంటున్నారు. ఈ కారణంగానే గత కొంత కాలంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి జగన్ దరిదాపుల్లో కూడా నిలబడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారనీ చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగాఇటీవలి కాలంల ో పార్టీ సమావేశాలకు కూడా ఆయనఎంట్రీని జగన నిేధించరనిపేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కే అవకాశాలు దాదాపు శూన్యమని పార్టీవర్గాలే చెబుతున్నాయి.
Jagan keeps Chevireddy at a distance, Ap Liquor cam, Chevireddy Bhaskarreddy, Cheating
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-keeps-chevireddy-at-a-distance-39-226969.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.