ఐప్యాక్ వైపే జగన్ మొగ్గు.. వైసీపీలో నిస్తేజం!

Publish Date:Aug 12, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తన సొంత పార్టీ నేతల కంటే ఐప్యాక్ నివేదికలపైనే ఎక్కువ నమ్మకం ఉండేదన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలలో తన పార్టీ ఘన విజయం సాధించి తాను ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టడానికి ఐప్యాక్ వ్యూహాలే కారణమన్నది ఆయన నమ్మకం.  అదే నమ్మకంతో జగన్ ఐప్యాక్ నివేదికలే నమ్ముకుని జగన్ 2024 ఎన్నికలకు వెళ్లారు. అయితే ఈ సారి మాత్రం ఐప్యాక్ వ్యూహాలు జగన్ కు రిత్ర కనీవినీ ఎరుగని పరాజయాన్ని మిగిల్చాయి. 2019 ఎన్నికల విజయం తరువాత 2019 ఎన్నికలలో పార్టీ కోసం పని చేయడానికి జగన్ ఐప్యాక్కు 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెబుతారు. అంటే 2024 ఎన్నికలలో ఐప్యాక్ కు జగన్ అంత కంటే ఎక్కేవే చెల్లించి ఉంటారు. అసలు ఐప్యాక్ అనేది వైసీపీలో ఒక భాగంగా మారిపోయింది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో నిండా తల దూర్చింది. ఐప్యాక్ తో ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ములకు జగన్   సంస్థకు కొన్ని కాంట్రాక్టులు ఇచ్చారనీ, అలా ఐప్యాక్ కు పార్టీ పరంగా చెల్లించాల్సిన సొమ్ములు ముట్టచెప్పారని పార్టీ వర్గాలు బాహాటంగానే చెప్పుకున్నాయి. అంతే కాకుండా పలువురు ఐప్యాక్ సభ్యులను వివిధ ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులుగా అప్పాయింట్ మెంట్ పత్రాలు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించారని కూడా తెలిసింది. 

ఇక ఐపాక్య సభ్యులైతే వైసీపీ ఎమ్మెల్యేలను నీడలా ఫాలో అవుతూ వారేం చేయాలో నిర్దేశించేవారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అయితే ఐప్యాక్ సభ్యులే వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. 2024 ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడ వారితో ఫొటోలు తీయించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం కంటే అధిక స్థానాలను గెలుచుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అయితే తీరా ఎన్నికలు వచ్చిన తరువాత గతంలో ఏ పార్టీ ఓడిపోనంత ఘోరంగా వైసీపీ పరాజయం పాలైంది. అసలు వైసీపీ ఎన్నికల ప్రచారమే వైనాట్ 175 అంటూ వైసీపీ నేతలే బిత్తరపోయే రేంజ్ లో సాగింది. పార్టీ క్యాడర్ కు, నేతలకు క్షేత్ర స్థాయి పరిస్థితులు ఏమిటి అన్నది అలోచించే సావకాశం ఇవ్వకుండా సాగిన ఆ ప్రచారం చేసిన నష్టమేమిటో పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఫలితాల తరువాత కానీ తెలియలేదు. ఒటమి తరువాత వైసీపీ నేతలు బాహాటంగానే  ఐప్యాక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవాలు పార్టీ నాయకత్వానికి తెలియకుండా.. విజయం సాధించబోతున్నామంటూ తప్పుదోవపట్టించిందని విమర్శలు గుప్పించారు. ఇక ఐప్యాక్ తో వైసీపీ బంధం ముగిసిందనే అంతా భావించారు. 

అయితే 2029 ఎన్నికలలో కూడా పార్టీ తరఫున పని చేయడానికి జగన్ ఐప్యాక్ తో ఒప్పందం కుదుర్చుకోవడం వారిని దిగ్భ్రమకు గురి చేసింది. వచ్చే ఎన్నికలలో వైసీపీకి గెలుపు వ్యూహాలు రచించేందుకు ఐప్యాక్ తో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారిక ప్రకటన ఏమీ రాకపోయినా.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు అలాంటి ఒప్పందం ఏదో కుదిరిందన్న సందేహాలకు తావిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తరువాత ఐప్యాక్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా జగన్ కు, వైసీపీకి మద్దతుగా ఎటువంటి పోస్టులూ ఐప్యాక్ పెట్టలేదు. కానీ ఇటీవలి కొన్ని రోజులుగా ఐప్యాక్ యాక్టివ్ అయ్యింది.

జగన్ కు మద్దతుగా, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. అలాగే జగన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు, రాష్ట్రపతి పాలన అంటూ ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు.  దీంతో జగన్ మరోసారి ఐప్యాక్ కు పార్టీని వచ్చే ఎన్నికలలో విజయం బాట పట్టించేందుకు వ్యూహాల రూపకల్పన కోసం ఐప్యాక్ ను ఆశ్రయించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవే అనుమానాలు పార్టీలోనూ గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ నిస్తేజంగా మారిపోయారు. మరోసారి వైసీపీని నమ్ముకుని అడుగులు వేస్తే రాజకీయ మనుగడ ఉండదన్న భయంతో సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.