మేనమామనూ జగన్ దూరం పెట్టేశారా ..?

Publish Date:Dec 28, 2022

Advertisement

ఏపీ సీఎం జగన్ కు ఒక్కరొక్కరుగా కుటుంబ సభ్యులు, ఆత్మీయులూ దూరం అవుతున్నారు. తండ్రి వైఎస్ మరణానంతరం జగన్ కు అన్ని విధాలుగా అండగా ఉండి, ఆయన జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ పార్టీని భుజాలపై మోసి.. జగన్ అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలుగా సహకరించిన వారు ఒక్కరొక్కరుగా దూరం అవుతున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో విభేదించిన సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత, ఆ తరువాత   తల్లి విజయమ్మ, సోదరి షర్మిల జగన్ కు దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా జగన్ కు స్వయాన మేనమామ.. అంటే తల్లి విజయమ్మకు సోదరుడు అయిన పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా జగన్ కు దూరం అయ్యారు. జగన్ కు మేనమామ అయినా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. అలాగే ఆయన పెరిగింది దాదాపుగా వైఎస్ వద్దే అని చెబుతారు. మొదటి నుంచీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు. దీంతో ఆయన  తనకంటే వయసులో చిన్నవాడైన జగన్ కు  దాదాపుగా కేర్ టేకర్ గా   వ్యవహరించారని చెబుతారు. ఆ కారణంగానే ఇప్పటి వరకు వైసీపీలో రవీంద్రనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అలాగే ఇప్పటి వరకూ కమలాపురం నియోజకవర్గంలోనే కాకుండా, సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి హవా కొనసాగుతూ వచ్చింది.  

అయితే ఇప్పుడు ఇదంతా గతం. ఎందుకంటే ఇప్పుడు జగన్ మేనమామకు పార్టీలో ఇసుమంతైనా ప్రాధాన్యత లేకుండా పోయింది. అసలు సీఎం జగన్ తన మేనమామ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడటం లేదనీ, ఇరువురి మధ్యా మాటా మంతీ లేదనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడానికి తమ శక్తివంచన లేకుండా పాటుపడిన వారంతా ఇప్పుడు ఆయనకు దూరం అవుతున్నారు. సొంత కుటుంబంలోనే విభేదాల కుంపటి రాజుకుంది. జగన్ సోదరి అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేర సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటే.. తల్లి విజయమ్మ జగన్ ను కాదని, వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని మరీ తన కుమార్తెకు తోడుగా వైఎస్సార్టీపీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నారు. జగన్ సంగతి మనకెందుకు అని మీడియా ప్రశ్నలకు ఏపీ సీఎంతో తమకు సంబంధం లేదని చెప్పకనే చెప్పారు.

వారిరువురూ జగన్ కు దూరం జరిగినా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఇటీవలి కాలం వరకూ జగన్ కే మద్దతుగా నిలిచారు.  మేనమామగా ఉన్న చనువుతో  రవీంద్రనాథ్ రెడ్డి  అవకాశం దొరికిన ప్రతి సందర్బంలోనే సోదరి షర్మిలతో విభేదాలెందుకు అంటూ ఆమెతో సామరస్యం కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇది రుచించని జగన్ ఆయనను దూరం పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎదురు పడినా కనీసం పలకరించకపోవడం, అప్పాయింట్ మెంట్ సైతం నిరాకరిస్తుండటంతో రవీంద్రనాథ్ రెడ్డికి విషయం బోధపడి జగన్ కు దూరం జరిగారని అంటున్నారు. ఇటీవల జగన్ కడప జిల్లా పర్యటనకు రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. అయినా జగన్ ఆయనను పట్టించు కోలేదనీ, ఎదురుపడిన సమయంలో కూడా ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయారనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

కడప జిల్లాలో ఇప్పుడు సీఎం జగన్, రవీంధ్రనాథ్ రెడ్డిల మధ్య పెరిగిన దూరంపైనే హాట్ హాట్ చర్చ నడుస్తున్నది. ఎంత సీఎం అయినా కడప జిల్లాలో వైసీపీ పట్టు నిలవాలంటే కనీసం ఎన్నికల నాటికైనా జగన్ కుటుంబ సభ్యులతో సామరస్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులను దూరం పెట్టిన జగన్ తీరుపై జిల్లాలో వైఎస్ అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోందనీ, వైఎస్ వివేకా హత్య, షర్మిల, విజయమ్మలనూ దూరం పెట్టడంతో పాటు ఇప్పుడు మేనమామను సైతం దూరం చేసుకోవడంపై కడప జల్లాలో జగన్ తీరు పట్ల వ్యతిరేకత గూడుకట్టుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

By
en-us Political News

  
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.