వివేకా హత్య వెనుక అంత:పుర రహస్యం?

Publish Date:Jun 13, 2023

Advertisement

అయ్యిందేదో అయిపోయింది. ఎలాగో అలా కడపను దక్కించుకుని ఆబోరు కాపాడుకుంటే చాలు అన్నట్లుగా తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. సొంతబాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో పార్టీ పరువే కాకుండా వ్యక్తిగతంగా తన పరువూ మసకబారిన పరిస్థితుల్లో.. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కపడ లోక్ సభ స్థానాన్ని గెలుచుకోలేకపోతే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారు.

వివేకా హత్య వెనుక అంత:పుర రహస్యం ఉందనీ, ఆధిపత్య పోరు ఉందనీ, అందుకే అవినాష్ ను కాపాడేందుకు జగన్ ప్రయత్ని స్తున్నారనీ జనం నమ్ముతుండటంతో.. అలాంటిదేమీ లేదని చాటేందుకైనా  కడప లోక్ సభ స్థానంలో అవినాష్ రెడ్డి బదులు మరో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఒక వేళ అవినాష్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చినా అక్కడ గెలిచే పరిస్థితి లేదనీ, స్థానికంగా అవినాష్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని సొంత సర్వేలే తేల్చేయడంతో ఇక అవినాష్ ను వదిలించేసుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారంటున్నారు.

ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని పూర్తిగా వినియోగించడమే కాకుండా శక్తికి మించి ప్రయత్నించిన జగన్ ఇంకా అదే పద్ధతి కొనసాగిస్తే అవినాష్ పై వ్యక్తమౌతున్న వ్యతిరేకత తనపై ప్రతిఫలించచే అవకాశాలున్నాయని గ్రహించారు. దీంతో వచ్చే ఎన్నికలలో కడప నుంచి ఎవరిని నిలబెడితే విజయం తథ్యం అన్న అన్వేషణ ప్రారంభించారు. అయితే కడప నుంచి వైఎస్ కుటుంబం బయట నుంచి ఎవరు నిలబడినా విజయం సాధించే అవకాశం లేదని అక్కడి పార్టీ శ్రేణులే చెబుతుండటంతో జగన్ తన తల్లినే అక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే బెటర్ అన్న భావన కు వచ్చారు.

 అయితే ఇందుకు విజయమ్మ అంగీకరిస్తారా అన్న విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచీ   గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తల్లిని జగన్  సాగనంపి ఆమెకు పార్టీతో ఉన్న సంబంధాన్ని తెంపేశారు. ఆ తరువాత నుంచీ ఆమె తన కుమార్తె షర్మిలతో పాటే ఆమె పార్టీ వైఎస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలిగా పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు. అంతే కాదు     జగన్మాత ఇప్పుడు కుమారుడిని ఇంటికి కూడా వెళ్లేందుకు సుముఖంగా లేరు. అందుకే ఇటీవల అమరావతి వచ్చినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ గడపలో అడుగు పెట్టలేదు. తన స్థాయికి ఏ మాత్రం తగకపోయినా సజ్జల నివాసానికి వెళ్లారు. దీంతో జగన్ కోరినంత మాత్రాన ఆమె కడప లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి అంగీకరిస్తారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.  ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో అవినాష్ రెడ్డికి మాత్రం కడప నుంచి పోటీ చేసే అవకాశం జగన్ ఇవ్వరన్నది మాత్రం కచ్చితమేనని అన్నారు. వివేకా హత్య కేసులో ఔట్ కమ్ ఏమిటన్నది పక్కన పెడితే.. వైసీపీకి అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధం దాదాపుగా తెగిపోయినట్లేనని చెబుతున్నారు.  

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని కడప వాసులు గట్టిగా నమ్ముతుండటమే ఇందుకు కారణమని  వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.   దీంతో జగన్ కు అవినాష్ ను కడప నుంచి దూరం పెట్టడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే అవినాష్ ను కాకుండా మరెవరిని నిలబెట్టాలన్న విషయానికి వస్తే.. అక్కడా జగన్ కు తాను దూరం పెట్టిన తల్లిని మళ్లీ తీసుకువచ్చి నిలబెడితే తప్ప ఆ సీటును కాపాడుకోలేని పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే జగన్ వెళ్లి తల్లిని కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడమని అర్ధిస్థారా? అలా అర్ధించినా, గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ‘సగౌరవంగా’ సాగనంపిన కొడుకు అభ్యర్థనను ఆమె ఔదాలుస్తారా అన్నవి ప్రశ్నలే? మొత్తం మీద అక్కడ నిలబడేది ఎవరన్నది పక్కన పెడితే ఆ సీటు అవినాష్ చేయి జారిందని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.  

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.