తెలుగుదేశం గూటికి కమేడియన్ సప్తగిరి

Publish Date:Jun 13, 2023

Advertisement

సినిమాలలో పాపులారిటీ సంపాదించుకుంటే అది రాజకీయ ఎంట్రీకి ఒక షార్ట్ కట్ 2019 ఎన్నికలకు ముందు వరకూ కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలన్న ఉత్సాహం ఉత్సుకత చూపిన నటులు చాలా మందే ఉన్నారు. అలా 2019 ఎన్నికల ముందు రాజకీయాలలోకి వచ్చిన వారిలో ప్రముఖంగా ఇద్దరు కమేడియన్లను చెప్పుకోవాలి. వారిలో ఒకరు అలీ అయితే మరొకరు ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్. పోసాని కూడా ఉన్నారనుకోండి.. కానీ ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనే రాజకీయాలలోకి వచ్చారు. సో ఇక్కడ చెప్పుకుంటున్న 2019 ఎన్నికలలో రాజకీయ ప్రవేశాల జాబితాలోకి ఆయన రారు. ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. ఆయన రాజకీయ ప్రవేశం ఉత్సాహంతో నేల విడిచి సాము చేశారు. వైసీపీ తరఫున ప్రచారంలో నేల విడిచి సాము చేశారు. తన రాజకీయ ప్రవేశానికి బాట పరిచిన సినీ పరిశ్రమపైనే విమర్శలు గుప్పించారు. పరిశ్రమలో అగ్రనటులుగా వెలుగొందుతున్న వారిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా తీవ్ర విమర్శలు చేశారు. సరే ఆయన ఏం చేసినా చివరకు ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. జగన్ కూడా పృధ్వీ శ్రమను గుర్తించారు. ఎస్వీబీసీ పదవి ఇచ్చి సముచిత స్థానమే కల్పించారు. కానీ ఓ వివాదంలో చిక్కుకున్న పృధ్వీని ఆ తరువాత పార్టీ పట్టించుకోలేదు. కూరలో కరివేపాకులా తీసి పారేసింది. ఇచ్చిన పదవినీ ఊడబీకేసింది. ఆ తరువాత పృధ్వి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అయ్యింది. ఎన్నికల ప్రచార 
సమయంలో ఆయన సినీ ఇండస్ట్రీపై గుప్పించిన విమర్శల కారణంగా సినిమా అవకాశాలూ కోల్పోయారు. రాజకీయంగా ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోయారు. ఇప్పుడిప్పుడే తేరుకుని మెల్లిమెల్లిగా సినిమాల్లోనూ, టీవీషోల్లోనూ కనబడుతున్నారు. రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేనకు అనుకూలంగా గళమెత్తుతున్నారు. ఆ పార్టీలోకి ఆయన ప్రవేశానికి జనసేనాని తలుపులు తెరుస్తారా లేదా అన్నది అనుమానమే.

ఇక అలీ విషయానికి వస్తే ఆయన రాజకీయ అడుగులు వేయడానికి ముందు అన్ని పార్టీలనూ చుట్టేశారు. ఎక్కడ తనకు గుర్తింపు, సముచిత స్థానం లభిస్తుందా అని గాలించారు. చివరకు ఆయనకు వైసీపీలో అయితే తనకు మంచి భవిష్యత్ ఉంటుందని నిర్ణయించుకుని ఆ పార్టీ గూటికి చేరారు. ఇందు కోసం ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇండస్ట్రీలో ఆయనకు అత్యంత ఆత్మీయుడిగా భావించే పవన్ కల్యాణ్ ను దూరం చేసుకున్నారు. అలీ వైకాపా గూటికి చేరిన తరువాత ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో మననుంచి సహాయ సహకారాలు పొందిన వారు కూడా హ్యాండిచ్చారు అని పరోక్షంగా అలీపై వ్యాఖ్యలు చేశారు.

సరే అదలా ఉంచితే.. వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి చట్టసభలో అడుగుపెట్టాలన్న అలీ కల నెరవేరలేదు. పోనీ వక్ఫ్ బోర్డు చైర్మన్, రాజ్యసభ అంటే వేరే ఆశలు పెంచుకున్నా అవీ నెరవేరలేదు. మూడేళ్ల ఎదురు చూపుల తర్వాత వందల సంఖ్యలో ఉన్న సలహాదారుల పోస్టులలో ఒక అనామక పోస్టును అలీకి ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు జగన్. సరే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. చిరంజీవి వంటి మెగాస్టార్ నుంచి అందరూ తన వద్దకు రావాల్సిందే.. తాను చెప్పింది వినాల్సిందే అన్నట్లుగా వ్యవహరించారు.

ధియేటర్ల టికెట్ల ధరలు తగ్గించేసి మొత్తం పరిశ్రమ అంతా నువ్వే దిక్కు అని ఆయన వద్దకు వాలిపోయేలా చేసుకున్నారు. దీంతో సినీ పరిశ్రమ నుంచి ఎవరూ కూడా రాజకీయ ప్రవేశం చేయడానికి ముందుకు రావడానికి వెనుకాడే పరిస్థతి ఏర్పడింది. అందుకే గతంలో పోలిస్తే రాజకీయ ప్రవేశం చేయాలని ఉత్సాహం చూపు నటుల సంఖ్య గనణీయంగా తగ్గింది. పరిశ్రమ నుంచే వచ్చి రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలోకి వచ్చి చేరేందుకు కూడా నటులు జంకే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఒక యువ నటుడు, కమేడియన్, హీరో..తన విలక్షణ నటనతో తక్కువ కాలంలోనే మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి అలియాస్ సప్తగిరి ప్రసాద్ తన రాజకీయ అరంగేట్రంను ప్రకటించారు. అభివృద్ధి, దార్శనికతకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రకటించి త్వరలో ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన సప్తగిరి పార్టీ ఆదేశిస్తే జిల్లాలో ఎక్కడ నుంచైనా ఎన్నికల బరిలోకి దిగుతానంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయనతో కలిసి అడుగులేశాననీ, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాననీ చెప్పిన సప్తగిరి సినిమాలలో ఎలాగైతే నిజాయతీగా, చిత్తశుద్ధితో కష్టపడ్డానో తెలుగుదేశం పార్టీలో కూడా అలాగే చిత్తశుద్ధి, నిజాయితీతో పని చేసి ప్రజాసేవలో నిమగ్నమౌతానని చెబుతున్నారు. మహామహులుగా పేరొందిన సీనియర్ దిగ్గజాలు కూడా రాజకీయాల వైపు చూడడానికి కూడా భయపడుతున్న ఈ సమయంలో ధైర్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలో చేరతానంటూ ముందుకు వచ్చిన సప్తగిరి ఏ మేరకు రాణిస్తారో చూడాలి. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.