పార్టీ క్యాడర్ ను పట్టించుకోని జగన్!.. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసిన వైసీపీ కార్యకర్త

Publish Date:Dec 26, 2024

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం నుంచీ, గతంలో తాను చేసిన తప్పుల నుంచీ గుణపాఠం నేర్చుకోలేదు. అత్యంత అవమాన కరరీతిలో జనం ఆయన పార్టీని ఎన్నికలలో ఓడించిన తరువాత కూడా గతంలో చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారు. దీంతో సొంత పార్టీ క్యాడర్ కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. నిరసన వ్యక్తం చేస్తున్నది. పులివెందులలో గురువారం (డిసెంబర్ 26) ఆయన నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన సొంత క్యాడర్ నుంచే  నిరసన ఎదుర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదు. 

జగన్  పార్టీ కార్యకర్తలను విస్మరించడమే ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమని వైసీపీ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాన్ని ఓటమి తరువాత ఆయన దృష్టికీ తీసుకువెళ్లారు. అయితే జగన్ మాత్రం పార్టీ ఓటమికి తెలుగుదేశం కూటమి అసత్య ప్రచారం, ఈవీఎంల టాంపరింగే కారణమంటూ అస్మదీయుల హితవచనాలను పక్కన పెట్టేశారు. పార్టీ అధికారంలో ఉండగా ప్రజల దృష్టిలో భ్రష్టులుగా ముద్రపడిన గోరంట్ల మాధవ్ వంటి వారికి ఇప్పుడు పార్టీ పదవులు కట్టబెడుతూ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా వ్యవహరిస్తున్నారు.  ఆయన తీరు పార్టీకి క్యాడర్ ను దూరం చేస్తున్నది. ఇందుకు రుజువుగా గురువారం (డిసెంబర్ 26) పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో పార్టీ క్యాడర్ ను కూడా జగన్ కలవడానికి సుముఖంగా లేరంటూ వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.  

జగన్ కు కలిసేందుకు పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో ఉదయం ఏడు గంటలకే పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే  వారికి ఆయన దర్శన భాగ్యం దక్కలేదు. వర్షాన్ని లెక్క చేయకుండా జగన్ ను కలసేందుకు తిండితిప్పలను కూడా విస్మరించి క్యూలైన్ లో వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో పార్టీ క్యాడర్ లో  అసహనం పెల్లుబికింది. జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్నంతా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వైసీపీ కార్యకర్త జగన్ తీరుపై విమర్శలు గుప్పించడం పార్టీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఎంత అసహనంతో ఉన్నారో తేటతెల్లం చేసంది. 

By
en-us Political News

  
మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. కన్ ఫర్డ్ ఐఏఎస్ అయిన ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికలకు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకుని మరీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మన్మోహన్ పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి తరువాత వెలువడే అవకాశం ఉంది. మొత్తం మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరగనున్నాయి.
రేవంత్ స‌ర్కార్, టాలీవుడ్ మ‌ధ్య త‌లెత్తిన వివాదం తెలంగాణ రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా హీటెక్కించింది. పుష్ప-2 బెనిఫిట్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద‌ తొక్కిస‌లాట చోటుచేసుకుని మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సినీ న‌టుడు అల్లు అర్జున్‌, థియేట‌ర్ యాజ‌మాన్యంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
ఒక వైపు పేర్ని నాని కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. ఆయన భార్య పేర్ని జయసుధ పేరిట ఉన్న గోదాం నుంచి భారీగా రేషన్ బియ్యం మాయం అయినట్లు తేలడంతో ఆయన ఇక తప్పించుకునే మార్గం లేదని ఖరారు చేసుకునే కుటుంబంతో సహా పరారైనట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఒక వైపు ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ప్రారంభించింది.
కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడపలో మాత్రం జగన్ మాటే నెగ్గుతుంది. జగన్ పేరు చెప్పుకుని చెలరేగే వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ అలాగే సాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కడపలో వైసీపీయుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఆ తరువాత అంటే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఇటీవలి కాలం వరకూ వైసీపీ హవాయే నడిచింది.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు సార్లు వారి లేఖలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడం, కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో భక్తులు తిరమలకు పోటెత్తుతున్నారు. శనివారం (డిసెంబర్ 28)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామ శివారులోని వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద, వెళ్లే దారిలో గల నిర్లక్ష్యానికి గురైన క్రీ.శ. 10-13 శతాబ్దాల నాటి శిల్పాలు, శాసనాలను భద్రపరిచి, కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సిఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తదననంతర పర్యవశానాలను గమనిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలుగు సినీ పరిశ్రమను తన గుప్పిటిలోకి తెచ్చుకోవడమే కాకుండా అటు బీఆర్ఎస్, బీజేపీలను కంగు తినిపించారు. చాలా దృఢంగా నిలబడి.. తెలుగు సీనీ పరిశ్రమ మెడలు వంచడమే కాకుండా.. సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటనను ఆసరాగా చేసుకుని రేవంత్ సర్కార్ ను బదనాం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు వేరు వేరుగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు తడబడేలా చేయగలిగారు.
 దిగ్గజ పారిశ్రామిక  సంస్థ  సుజుకి మోటార్ కార్పోరేషన్ మాజీ సీఈవో  ఒసాము సుజుకి క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు.
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో న‌టుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా ప‌డింది. త‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్ ఇవ్వాల‌ని బ‌న్నీ నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ వేశారు. కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు పోలీసులు స‌మ‌యం కోర‌డంతో కోర్టు విచార‌ణ‌ను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.