జ‌గ‌న్ ఆశ అడియాశే.. వైసీపీ ఆట ముగిసిన‌ట్లే!?

Publish Date:Nov 20, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న దిగ్విజ‌యంగా ముందుకు సాగుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. గ‌త ఐదేళ్లు క‌నీస స‌దుపాయాలులేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల్లోనే రోడ్ల మ‌ర‌మ్మ‌తుల ద‌గ్గ‌ర నుంచి ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఏపీలో పెట్టుబ‌డుల ప్ర‌వాహం మొద‌లైంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన పై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏకంగా రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే..  రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారం కోల్పోయిన నాటి నుంచి  అనేక మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలలో చేరారు. మ‌రికొంద‌రు ఆ దారిలోనే నడిచేందుకు రెడీగా ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన జ‌గ‌న్ మాత్రం జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయి.. మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌దేప‌దే చెబుతూ ముఖ్య‌నేత‌లు పార్టీ వీడ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వంలోని పార్టీల నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తేలా వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూటమి ఐక్యత విచ్ఛిన్నం అవుతుందనీ, మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహిస్తాననీ  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ల‌లు కంటున్నారు. తాజాగా అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ ఆశ‌లు అడియాశల‌యిన‌ట్లేన‌ని వైసీపీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిస‌హా వైసీపీకి చెందిన ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బాయ్ కాట్ చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్ర‌మే అసెంబ్లీకి హాజ‌ర‌వుతున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. స‌మ‌స్య ప‌రిష్కారానికి మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో గ‌త ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో ప్ర‌శాంత‌వాతావ‌ర‌ణంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌రుగుతుlన్నది.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రులు, కొంద‌రు వైసీపీ స‌భ్యులు అస‌భ్య‌ ప‌ద‌జాలంతో అప్పటి ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల‌పై తీవ్ర‌ స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దీంతో ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు అంటేనే ప్ర‌జ‌లు టీవీలు బంద్‌పెట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ, చంద్ర‌బాబు సార‌థ్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయి. తాజాగా.. బుధ‌వారం (నవంబర్ 20)   అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అద్భుత‌మైన పాల‌న సాగుతున్నద‌ని అన్నారు.  ఐదు సంవ‌త్స‌రాలే కాదు.. ద‌శాబ్ద‌కాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు నాయుడే ఉంటార‌ని, కూట‌మి ప్ర‌భుత్వం దిగ్విజ‌యంగా ముందుకు సాగుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌ల ఆశ‌లు అడియాశ‌లైన‌ట్లేన‌ని చెప్పొచ్చు. 

అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ నుంచి తెలుగుదేశం కూట‌మి పార్టీల్లోకి  వ‌ల‌స‌లు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే వైసీపీ హ‌యాంలో బూతుల‌తో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. సహజంగా వీరిలో వైసీపీకి చెందిన నేత‌లే ఎక్కువ‌గా ఉన్నారు. దీనికి తోడు వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపైనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లు కూట‌మిపార్టీల్లోకి చేరేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం.. జ‌మిలి ఎన్నిక‌లు రాబోయేతున్నాయి.. మ‌ళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంద‌ని పదేప‌దే చెబుతుండ‌టంతో కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న నేత‌లు కాస్త వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను సైతం బెదిరింపుల‌కు గురిచేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది వైసీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టిన అధికారుల‌ను గుర్తుపెట్టుకొని మేము అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇటీవ‌ల‌ హెచ్చ‌రించారు. అంతే కాదు.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టి.. త‌రువాత‌ ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది విదేశాల‌కు పోయిన‌వారినిసైతం ప‌ట్టుకొచ్చి  జైలుకు పంపిస్తామంటూ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. దీంతో కొంద‌రు అధికారులు వైసీపీ నేత‌ల జోలికి వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌తో.. వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి చేరే నేత‌ల‌ సంఖ్య పెర‌గ‌నుండ‌టంతో పాటు.. అధికారుల్లో దైర్యాన్ని నింపిన‌ట్ల‌యింది.

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (నవంబర్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
 ప్రముఖ సినీ రచయిత,వైకాపా నేత పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.  కుటుంబ కారణాల రీత్యా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు మోక్షం లభించే రోజులు వచ్చేశాయి. . నిజాంపేటలో 32  ఎకరాలు, పేట బషీర్ బాద్ లో 38  ఎకరాలు 2008లో జెఎన్ జె హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసింది. న్యాయ వివాదాల్లో ఇరుక్కుని  రెండు దశాబ్దాలుగా లబ్దిదారులకు అంద లేదు. 2017 లో సుప్రీం ఇంటెరిం ఆర్డర్ వచ్చినప్పటికీ కెసీఆర్ ప్రభుత్వం ఆ స్థలాలు  జర్నలిస్టులకు అప్పగించలేదు.
 కూకట్ పల్లిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను తల్లిదండ్రులు స్కూల్ లో దింపారు అయితే సాయంత్రం కూతుళ్లు రాకపోయేసరికి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాలకు స్వస్థి చెప్పి గుజరాత్ వెళ్లిపోయింది. శైవక్షేత్రాల దర్శనార్థమే అఘోరీ గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది. వరంగల్ రంగ సాయి పేటలో వింతపూజలు చేసిన అఘోరీ ఐదు రోజుల పాటు మౌనవ్రతంలో ఉన్నారు.
దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ అవినీతి తీగ కదిలినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ డొంక కదిలే పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన వైసీపీ, రాష్ట్రాన్ని అవినీతికి, అక్రమాలకు కేంద్రంగా మార్చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దగ్గర నుంచి పలు అంశాలలో వైసీపీ నేతల ప్రమేయం బయటపడింది.
రష్యా నిర్ణయంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఔననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన క్షణం నుంచీ భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేసే అత్యంత భయంకరమైన అణ్వాయుధం రష్యా వద్ద ఉంది.
వైసీపీ అధినేత జగన్ కు స్వప్రయోజనాలు తప్ప ప్రజా క్షేమం, ప్రజా ప్రయోజనాలు ఇసుమంతైనా పట్టవని మరో మారు నిర్ద్వంద్వంగా రుజువైపోయింది. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా మిగిలింది.
తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం టీచర్ దే.  మాతృదేవో భవ, పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ మాత్రమే.  కానీ తమిళనాడులో ఓ టీనేజ్ అబ్బాయి ఏకంగా టీచర్ నే ప్రేమించేశాడు.
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిన వ్యాఖ్యలు అరెస్టైన నటి కస్తూరికి బెయిలు మంజూరైంది. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ సభలో నటి కస్తూరి తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దార్శనికత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏ పని చేసినా అందులో ముందు చూపు, భవిష్యత్ దర్శనం ఉంటాయి.
భారత కుబేరుడు, వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదై, అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అయితే ఆ కేసు, అరెస్టు వారెంట్ ఇండియాలో కాదు. అగ్రరాజ్యం అమెరికాలో. అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.