అమరావతి నెత్తిన జగన్ పాలు పోశారంటున్నారు పరిశీలకులు. అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. సరే రాష్ట్ర ప్రజలంతా అమరావతి వెంనే ఉన్నారన్న సంగతి 2024 ఎన్నికల ఫలితం తేల్చేసింది. అధికార పగ్గాలు చేపట్టినత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అమరావతి పురోగతి పనులను వాయువేగంతో చేపట్టింది. జగన్ కాలంలో జంగిల్ గా కనిపించిన అమరావతి ఇప్పుడు ఆకాశ హర్మ్యాలతో, నిరాటంకంగా సాగుతున్న నిర్మాణ పనులతో కలకలలాడు తోంది. అయినా అందరిలో ఓ చిన్న అనుమానం. ఐదేళ్ల తరువాత అంటే 2029 ఎన్నికలలో ఏదైనా అనూహ్యం సంభవించి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇదే సంశయం అమరావతి రాజధాని రైతులనూ తొలిచేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు.
ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం కూడా అందుకు సై అంది. అమరావతికి రక్షణగా నిలవడానికి ముందుకు వచ్చింది.దీంతో ఆంధ్రప్రదేశ్ శాశ్వత, ఏకైక రాజధానిగా అమరావతి అని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు చట్టబద్ధత కల్పించడానికి సై అంది.
ఇక ఆ దిశగా చర్యలు తీసుకోవడం లాంఛనమే అన్నది రూఢీ అయిపోయింది. దేశం మొత్తంలోనే ఏ రాష్ట్ర రాజధానికీ ఇలా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలేదు. చటబద్ధత కల్పించిన పరిస్థితీ లేదు. ఒక్క అమరావతికి మాత్రమే ఆ భాగ్యం దక్కింది. ఇందుకు ఎవరు ఔనన్నా కాదన్నీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కారణం. ఆయన ఇసుమంతైనా దాచని అమరావతి ద్వేషం కారణంగానే సపోజ్ ఫర్ సపోజ్ ఆయన భవిష్యత్ లో పొరపాటున అధికారంలోకి వచ్చినా అమరావతిలో ఒక్క ఇటుక ముక్క కూడా కదిలించే అవకాశం లేకుండా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రాబోతోంది. దేశంలో ఏ రాజధానికీ దక్కని ఈ భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దక్కడానికి జగన్ ద్వేష పూరిత, కక్ష సాధింపు రాజకీయ వైఖరే కారణమనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-hatred-towards-amarawathi-became-boon-to-ap-capital-39-210532.html
Publish Date:Sep 10, 2026
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.