జగన్ పై బాలినేని బాంబు.. నా ఆస్తులు లాక్కొన్నారంటూ సంచలన ఆరోపణ

Publish Date:Mar 14, 2025

Advertisement

జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని  మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పిఠాపురంలో శుక్రవారం (మార్చి 14) జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా బాలినేని ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ తల్లి, చెల్లితో ఆస్తుల పంచాయతీ కోర్టుకెక్కిన నేపథ్యంలో బాలినేని చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

బాలినేని కూడా జగన్ కు సమీప బంధువు. నిన్న మొన్నటి దాకా ఆయన వైసీపీలోనే ఉన్నారు. పలు మార్లు ఆ పార్టీ అధినేతతో విభేదించారు. అలకబూనారు. ధిక్కార స్వరం వినిపించారు. అయినా సర్దుకు పోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తరువాత కూడా ఆయన కొంత కాలం వైసీపీలో కొనసాగారు. ఒంగోలులో తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఆరోపణలు చేశారు. ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తరువాత వైసీపీ తీరుతో, మరీ ముఖ్యంగా జగన్ వైఖరితో విసికి పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.  

ఇప్పటి వరకూ జగన్ పై రాజకీయ విమర్శలే చేస్తూ వచ్చిన బాలినేని జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనవే కాదు తన వియ్యంకుడి ఆస్తులు కూడా జగన్ లాగేసుకున్నారని ఆరోపించారు. జగన్ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఆస్తల కబ్జాల గురించి  తర్వాత సమయం వచ్చినప్పుడు  వివరంగా చెబుతానని బాలినేని అన్నారు.  జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని ఓ సారి సీఎం కాగలిగారన్నారు. ఇక మరోమారు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని బాలినేని కుండబద్దలు కొట్టారు.  త్వరలో జనసేనాని పవన్ కల్యాణ్ హీరోగా తాను ఓ సినిమా నిర్మించనున్నట్లు బాలినేని జయకేతనం సభ వేదికగా ప్రకటించడం కొసమెరుపు.  

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.