Publish Date:Mar 17, 2025
పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జి ఎస్పీఎస్ఎస్ వర్మ చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో.. వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు.
Publish Date:Mar 17, 2025
బిఆర్ ఎస్ కార్యనిర్వాహణాధ్యక్షుడు కెటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( చింతపండు నవీన్ కుమార్ ) అసెంబ్లీలో భేటీ అయ్యారు. తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ నేతను కలవడం చర్చనీయాంశమైంది. బిసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బిఆర్ఎస్ నేతలైన కెటీఆర్ , హరీష్ రావులను కోరారు
Publish Date:Mar 17, 2025
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం పేరు మార్చనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీలు, సంస్థలు ఒకే పేరుపై ఉండటం వల్ల పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయనీ, అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణ కు సంబంధించిన పేర్లే పట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ చెప్పారు.
Publish Date:Mar 17, 2025
తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసులపై తిరుమలేశుని దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలపై శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించనుంది.
Publish Date:Mar 17, 2025
అమెరికాలోని ఫ్లోరిడా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకుల పల్లి గ్రామ మాజీ ఎంపీటీసీమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవి దంపతుల కుమార్తె ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్, కుమార్తె అత్త సునీతలు ఈ ప్రమాదంలో మరణించారు.
Publish Date:Mar 17, 2025
ఓయూలో ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై విద్యార్థి లోకం భగ్గు మంది. విద్యా
విద్యార్థుల స్వేచ్ఛను కాలరాస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలను నిషేదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.
Publish Date:Mar 17, 2025
తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ మెడలో మిర్చి దండలు వేసుకుని నిరసనకు దిగారు.
Publish Date:Mar 17, 2025
ఇరాన్ లో ఇటీవలె బ్లడ్ రెయిన్ కురిసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. స్వచ్చమైన నీరు రంగు రుచి వాసన ఉండదు. ఈ మూడు లేనిదే స్వచ్చమైన నీరు అని మనవ అభివర్ణిస్తుంటాం.
Publish Date:Mar 17, 2025
బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్క్భాన్ని ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు జిల్లాల పర్యటనకు సమాయత్తమౌతున్నారు.
Publish Date:Mar 17, 2025
బీజేపీ ఎంపీ, మాజీ మంతరి డీకే అరుఏణ ఇంట్లోకి అగంతకుడు జొరబడటం ఇప్పుడు సంచలనం సృష్టించింది. మామూలుగా ఇళ్లల్లో దొంగలు పడటం, పోలీసులకు ఫిర్యుదు అందగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం మామూలు విషయమే.
Publish Date:Mar 17, 2025
కాలు జారితే, వెనక్కి తీసుకోవచ్చును, కానీ, నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఒక్కొక్క సారి, నోరు జారిన నేరానికి, భారీ మూల్యమే చెల్లించుకోవలసివస్తుంది, ఉత్తరాఖండ్’ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రేమ్ చంద్ అగ్రవాల్ విషయంలో అదే జరగింది. అవును. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో,ఆయన,రాష్ట్రమంటే కేవలం’ పహాడీలు’ (గిరిజనులు) మాత్రమే కాదు,అంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆతర్వాత ఆయన, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా చాలా చాలా వివరణ ఇచ్చుకున్నారు. అయినా కొంచెం ఆలస్యంగానే అయినా, రాజీనామా చేయక తప్పలేదు. ఆదివారం (మార్చి 16) ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Publish Date:Mar 17, 2025
ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అమరావతి చుట్టూ భారీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రణాళిక మేరకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దదిగా ఉంటుంది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరణకు ఇప్పటికే అధికారుల నియామకం పూర్తయ్యింది.
Publish Date:Mar 17, 2025
వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇటీవల తన ప్రాణాలకు ముప్పు ఉంది, భద్రత కల్పించాలని కోరిన సంగతి తెలిసిందే. దస్తగిరి ప్రాణాలకు ముప్పు మాట నిజమేననడానికి తాజాగా ఆయన భార్య షబానాపై జరిగిన దాడి రుజువుగా నిలిచింది. షబానాపై ఆమె నివాసంలోనే దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారు వైసీపీ మహిళా కార్యకర్తలని ఆమె ఆరోపించారు.