ఏబీవీపై మళ్లీ సస్పెన్షన్ వేటు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Publish Date:Jun 28, 2022

Advertisement

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్‌ సర్కార్ మరోసారి సస్పెన్షన్‌ వేటు వేసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయక తప్పని అనివార్య పరిస్థితుల్లో ఏబీవీని  ఈ నెల 14న  ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ పోస్టులో నియమించింది.

అయితే రెండు వారాల్లోనే మళ్లీ సస్పెండ్‌ చేసింది. జగన్ కు నచ్చని అధికారి ఎంత ప్రాధాన్యత లేని పోస్టులోనైనా సరే ప్రభుత్వ సర్వీసులో ఉండటానికి వీల్లేదన్న అప్రకటిత నిబంధన అమలౌతున్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఏబీవీ సస్పెన్షన్ కు ప్రభుత్వం ఉత్తర్వులలో చెప్పిన కారణమేమిటంటే.. 1969 ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారని. ఆలిండియా సర్వీస్ రూల్స్ సబ్‌ రూల్‌ 3, రూల్‌ 3 ప్రకారం ఏబీవీని సస్పెండ్‌ చేస్తూ మంగళవారం రాత్రి సీఎస్‌ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏ అభియోగం ప్రకారం జగన్ సర్కార్ తనను సస్పెండ్ చేయడం చెల్లదని సుప్రీం కోర్టు విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చిందో ఇప్పుడు అదే అభియోగంపై జగన్ సర్కార్ ఆయనను మళ్లీ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వంలో ఐబీ అధిపతిగా ఉంటూ ఇజ్రాయెల్‌ నుంచి రక్షణ పరికరాల కొనుగోలుకు.. ప్రభుత్వ అనుమతి లేకుండా తన వాళ్లకు సంబంధించిన ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు  రూ.35 లక్షలు చెల్లించారనే అభియోగంపై జగన్ సర్కార్ ఆయనను   సస్పెండ్‌ చేసింది.

అదే నెల 18న ఏబీవీపై  ఏసీబీ కేసు నమోదు చేసింది.  తనను అన్యాయంగా దురుద్దేశ పూర్వకంగా  కేసులో   ఇరికించారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఏబీవీకి ఊరట లభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. వెంకటేశ్వరరావు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 22న విస్పష్ట ఆదేశాలు  జారీ  చేసింది. ఫిబ్రవరి 8 నుంచే ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ జీత భత్యాలు చెల్లించాలని స్పష్టం చేసింది. సుప్రీం  కోర్టు  తీర్పుతో గత్యంతరం  లేని పరిస్థితుల్లో జగన్  సర్కార్ ఆయనకు ఈ నెల 14న   పోస్టింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు ఏబీవీ తనపై ఉన్న ఏసీబీ కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ   మళ్లీ సస్పెండ్‌ చేసింది.  

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.