జగన్ సర్కార్ చేతివాటం.. చోరీ రికవరీ సొమ్ము మాయం!

Publish Date:Apr 20, 2022

Advertisement

ఏపీ సర్కార్ రోజువారీ వ్యవహారాల కోసం కూడా రూపాయి రూపాయి వెతుక్కునే పరిస్థితిలో ఉంది. అప్పు చేయకుండా ఒక్కరోజు కూడా గడిచే పరిస్థితి లేదంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే  వాటిని వేటినీ ఖాతరు చేయకుండా సాగుతున్న జగన్ ఉచితాల పందేరాలతో ముందుకు సాగుతూనే ఉన్నారు. మరి వీటన్నిటికీ సొమ్మెక్కడిదన్న సందేహాలు అందరిలోనూ ముప్పిరిగొంటున్నాయి. కానీ క్రమంక్రమంగా ఉచితాల పందేరానికి జగన్ మంత్రం ఏమిటన్నది వెల్లడౌతున్నది. పంచాయతీ నిధులు, విపత్తు నిర్వహణ నిధులు ఇలా ఒక టేమిటి కనిపించిన ప్రతి ఖాతా నుంచి సొమ్ము బొక్కేసి మరో సారి అధికారంలోకి రావడానికి పెట్టుబడిగా ఉచితాలను పందేరం చేస్తున్నారు. అయితే ప్రభుత్వఖాతాల నుంచి బదలాయింపులు సరిపోవడం లేదేమో ఆఖరికి చోరీ సొత్తుపై కూడా ఆయన చూపు పడింది. 
చోరీలు, దోపిడీలు జరిగినప్పుడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల నుంచి చోరీ సొత్తు రికవర్ చేస్తారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రికవరీ వవరాలను కోర్టుకు నవేదిస్తారు. విచారణ తరువాత సదరు సొత్తును సొంత దారులకు అందజేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత ఆ సొత్తును సొంత దారులకు అందజేస్తారు. 
అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పని జరగడం లేదు. కోర్టు ఆదేశాల తరువాత కూడా సదరు సొత్తు సొంత దారులకు చేరడం లేదు. 
ఎందుకా అని ఆరా తీస్తే .... ఔరా! అంటే ముక్కున వేలేసుకునేలంటి దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. అదేమిటంటే చోరీ రికవరీ సొత్తును కూడా జగన్ సర్కార్ వదలడం లేదట. ఆసొమ్మునూ ప్రభుత్వ ఖజానాకు తరలించేసి పబ్బంగడుపుకుంటోందట. సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తే సోమవారం ఒంటి పొద్దులుండి, మంది సొమ్ముతో మంగళవారం ముప్పొద్దులా తిన్నట్లు....తన అధికార యావతో జనం జనం సొమ్మును కూడా ఉచిత పథకాలకు వాడేస్తున్నారు. కోర్టుల్లో డిపాజిట్ల రూపంలో ఉండాల్సిన సొత్తును కూడా జగన్ సర్కార్ సొంత లాభం కోసం వాడేసుకుంటున్నది. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అన్నాడు మహాకవి గురజాడ ....  జగన్ సర్కార్ దానిని కొద్దిగా మార్చుకుని పొరుగువాడి సొత్తైనా వాడేసుకుని సొంత లాభం చూసుకోవోయ్ అన్నట్లు వ్యవహరిస్తున్నది. 
 

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.