విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర జగన్ సర్కార్ గారడీ!

Publish Date:Mar 7, 2023

Advertisement

విశాఖ వేదికగా జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్ఘాత్మకంగా అనే కంటే హడావుడిగా, ఆర్భాటంగా రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సాధించిందేమిటన్న దానిపై భిన్న వాదాలు, అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. అవన్నీ పక్కన పెడితే అధికారంలో ఉన్న నాలుగేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి వీసమెత్తు ప్రయత్నం చేయని జగన్ సర్కార్.. తీరా ఎన్నికలకు సిద్ధమౌతున్న వేళ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ఇంత హడావుడిగా, ఆర్భాటంగా నిర్వహించడమే విడ్డూరం.

మామూలుగానే ఇలాంటి సదస్సుల్లో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ తమ పెట్టుబడులను గ్రౌండ్ చేస్తాయన్న నమ్మకం లేదు. సదస్సు వేదికగా  పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు ప్రకటించడం షరామామూలుగానే జరుగుతుంటుంది. అయితే ఆ తరువాత పెట్టుబడుల వచ్చాయా లేదా అన్నది ఎప్పటికో కానీ తెలియదు. ఇక జగన్ సర్కార్ తన అధికారం చివరి సంవత్సరంలో నిర్వహించిన ఈ సదస్సు ప్రధాన లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణ కంటే  రాజకీయంగా పట్టు, పలుకుబడి సంపాదించడానికి, రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో చేస్తున్నామని జనాన్ని నమ్మించడానికేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.  ఇటీవలి కాలంలో జగన్ పట్ల, ఆయన సర్కార్ పట్ల ప్రజలలో ఇమేజ్ మసకబారిన నేపథ్యంలో దానిని పెంచుకోవడానికే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర ఓ కార్యక్రమం నిర్వహించారన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయంటూ ఆర్భాటపు ప్రకటనలే తప్ప వాస్తవంగా కుదిరిన ఒప్పందాలేమిటి? ఆ ఒప్పందాలు కుదిరిన  కంపెనీల జాబితా ఏమిటి? ఏయే రంగాలలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అన్న వివరాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గతంలో గుజరాత్‌, మహారాష్ట్రలలో   ఆర్భాటంగా సమ్మిట్ లు నిర్వహించి అప్పట్లో ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు తమ ఇమేజ్ ను పెంచుకున్నాయి.   అదే దారిలో ఇప్పడు ఏపీలో జగన్ సర్కార్ కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించింది. 13 లక్షల కోట్ల రూపాయల మేరకు 342 అవగాహనఒప్పందాల మీద సంతకాలు జరిగాయని ప్రకటించింది.  అయితే ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ ఓ 74 కంపెనీల పేర్లు ప్రకటించింది. ఆ కంపెనీల చరిత్ర ఏమిటీ, వాటి సత్తా ఏమిటి అన్న విషయంలో సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవి ప్రకటించిన పెట్టుబడులకు, వాటి వాస్తవ ఆర్థిక పరిస్థితికి పొంతన లేదన్నట్లుగానే ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో లేని కొన్ని కంపెనీలు, కొందరు పారిశ్రామిక వేత్తలూ కూడా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్పు వేదికగా తాము ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. మరి వాటి పేర్లు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఎందుకు లేవన్నది ఇప్పటివరకూ అయితే సమాధానం దొరకని ప్రశ్నే.

ఇక ఈ ఇన్వెస్టర్ల సదస్సు వెనుక పెద్ద భూ కుంభకోణానికి స్కెచ్ ఉందన్న ఆరోపణలూ వినవస్తున్నాయి. పెట్టుబడులు గ్రౌండ్ అవ్వడంతో సంబంధం లేకుండా కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టే కుట్ర దాగుందని పలువురు విశ్లేషణలు చేశారు. ఇక అన్నిటికీ మించి ఈ సదస్సులో హైలైట్ అయ్యిందేమిటంటే.. భోజనాల దగ్గర ఇన్వెస్టర్ల తోపులాట, సదస్సు కిట్ల కోసం జరిగిన తొక్కిసలాట. వేల, లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలైతే.. ఇలా తోపులాటలు, తొక్కిసలాటలూ జరిగేవా? వారంతా హుందాగా వ్యవహరించేవారు కదా అన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన వారిలో ఎక్కువ మంది ఐప్యాక్ సభ్యులేనంటూ కొన్ని ఫొటోలను కూడా విపక్షాలు మీడియాకు విడుదల చేశాయి. ఏమి ఏమైనా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర జగన్ సర్కార్ గారడీ చేసిందన్న అభిప్రాయమే గట్టిగా వ్యక్తమౌతోంది.  

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.