మంగ్లికీ ఓ సలహాదారు పదవి

Publish Date:Nov 22, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలహాదారుల పదవుల నియామక మేళా జరుగుతోంది. వారానికి ఇద్దరు చొప్పున సలహాదారు పదవులలో నియమితులౌతున్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. అంతా నా యిష్టం అన్న రీతిలో విమర్శలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వ సలహాదారుల నియామకాల జోరు పెంచేస్తున్నారు.

 తాజాగా ప్రముఖ గాయని మంగ్లీని ఏపీ ప్రభుత్వం ఓ సలహాదారు పదలో నియమించింది. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి పదవులిస్తూ ప్రోత్సహిస్తున్నారు సీఎం జగన్. అలీ, పోసాని మురళిలక సలహాదారు పదవులు ఇచ్చిన జగన్ తాజాగా   మంగ్లీకి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా మంగ్లీని నియమించారు.

వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే మంగ్లిని సలహాదారుగా నియమిస్తూ ఎస్వీబీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వీబీసీ అనగానే ధర్టీ ఇండస్ట్రీస్ పృధ్వికి జరిగిన మర్యాద గుర్తొచ్చిందో ఏమో ఉత్తర్వులు వెలువడినా మంగ్లీ మాత్రం ఇంత వరకూ బాధ్యతలు చేపట్ట లేదు. చివరకు సమాధానపడి, నాలుగు రోజుల క్రితమే ఆమె ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మంగ్లీకి లక్ష రూపాయల జీతం ఫిక్స్ చేసింది జగన్ సర్కార్.

ఇవి కాకుండా ఇతర ఫెసిలిటీస్ అదనం. ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారు పదవిలో మంగ్లీ రెండేళ్లపాటు  కొనసాగుతారు. ఆమె తిరుపతికి వచ్చే సమయంలో వాహన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ నియామకంపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. అటు మంగ్లీ కూడా తనకు పదవి వచ్చిన విషయంపై కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన విషయంపై కానీ స్పందించలేదు. ఈనెల 17న తిరుమలకు వచ్చి రెండురోజులపాటు అక్కడే ఉండి శ్రీవారిని దర్శించుకున్నారు గాయని మంగ్లీ. అదే సమయంలో ఆమె ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా అలీని ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమించిన సంగతి విదితమే.

కాగా ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా మంగ్లి నియామకం పట్ల మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందిస్తూ రోజా తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తనదైన ప్రత్యేకత చాటుకుంటూ గాయనిగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న గాయని మంగ్లిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ )కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా(ఎస్వీబీసీ) ఏపీ ప్రభుత్వం నియమించడం చాలా ఆనందంగా ఉంది. మంగ్లి తన సాంగ్స్ తో  స్వామిని స్మరిస్తూ మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నా.. ఆల్ ది బెస్ట్ మంగ్లీ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.