తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ పెట్టారు కదా. వైసీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలకు, దోపిడీలు, దారుణాలు, వేధింపులకు పాల్పడిన వాళ్ళ పేర్లు ఆ రెడ్ బుక్‌లో రాశారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్‌లో పేర్లున్న వాళ్ళ సంగతి తేలుస్తానని చాన్నాళ్ళ క్రితమే చెప్పారు కదా. అయితే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా, ఇంతవరకు ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు కదా. నారా లోకేష్ ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే వైసీపీ నాయకుడు జగన్ ‘రెడ్ బుక్ ఓపెన్ చేశారు మొర్రో’ అని మొత్తుకుంటున్నారు కదా. రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే వైసీపీ వర్గాలు ఇలా మొత్తుకుంటున్నాయి... ఇక రెడ్ బుక్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో అని జనం అనుకుంటున్నారు కదా.. ఇదిలా వుంటే, వైసీపీ అధ్యక్షుడు జగన్ నిన్నటిదాకా బెంగళూరు ప్యాలెస్‌లో రెస్టు తీసుకుని, మళ్ళీ ఇంకోసారి ఆంధ్రప్రదేశ్‌కి చుట్టపుచూపుగా వచ్చారు. అయ్యగారు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మీటింగ్ పెట్టడం, కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోయడం, 2029లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పడం, ఆ తర్వాత ఫ్లయిటెక్కి తుర్రుమని బెంగళూరు వెళ్ళిపోవడం మామూలే కదా. జగన్ గారు మళ్ళీ ఆ టైమ్ టేబుల్ ఏమాత్రం తప్పకుండా పాటిస్తున్నారు. ఈసారి ఆయన మంగళగిరిలో పార్టీ నాయకులతో సమావేశం పెట్టారు. ఎప్పట్లాగే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబుని విమర్శించడం అయిన తర్వాత, ఆయన ప్రసంగంలో ఒక ప్రాస విసిరారు. లోకేష్ రెడ్ బుక్ పెట్టారని అంటున్నారని, మనం కూడా ‘గుడ్ బుక్’ పెడదామని జగన్ అన్నారు. ఆ గుడ్ బుక్‌లో పార్టీలో మంచి పనులు చేసిన వాళ్ళ పేర్లు రాస్తారట. అలా మంచి పనులు చేసిన వాళ్ళకి ఆ తర్వాత కిరీటాలు పెడతారట. జగన్ ఈ మాట చెప్పినప్పుడు ఆ మీటింగ్‌లో వున్న వాళ్ళ ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. కాకపోతే, వైసీపీ వాళ్ళు ‘గుడ్ బుక్’ పెట్టినా, ఆ గుడ్ బుక్ తెరిచే అవసరం ఎప్పటికీ రాదు.. ఒక వేళ ఎవరైనా తెరిచినా ఆ గుడ్‌బుక్‌లో ఎప్పటికీ తెల్లటి కాగితాలే కనిపిస్తాయి. ఎందుకంటే, అధికారంలో వున్న ఐదేళ్ళలో ఒక మంచి పనీ చేయడానికి చేతులు రాని వైసీపీ నాయకులు, ఇప్పుడు అధికారంలో లేకపోతే ఇంకేం చేస్తారు... అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-good-book-25-186562.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.