72 మందితో జగన్ ఫస్ట్ లిస్ట్.. 22 మంది కొత్త మొహాలే!

Publish Date:Jul 31, 2023

Advertisement

ఏపీలో వైసీపీకి అస్సలు టైం బాగాలేదు. ఒకవైపు టీడీపీ, జనసేన గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్పలేని ఆరోపణలతో సతాయిస్తుంటే.. సొంత పార్టీ నేతలేమో కుమ్ములాటలు పెట్టుకొని పార్టీ పరువు బజారున పడేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, గత ఎన్నికలలో ఇచ్చి  ఇప్పటికీ నెరవేర్చని హామీలు, వివేకానంద రెడ్డి హత్యకేసు వెక్కిరిస్తున్నాయి. అన్నిటినీ పొలిటికల్ మేనేజ్మెంట్ తో ఓవర్ టేక్ చేయాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ పెద్దలు మిగతా వారి కంటే ముందే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే త్వరలోనే తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 72 మందితో ఈ తొలి జాబితా ఉంటుందని, ఇప్పటికే ఈ 72 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.

కాగా, ఈ 72 మందితో రానున్న తొలి జాబితాలో 22 మంది కొత్త ముఖాలే కావడం విశేషం అంటున్నారు. 2019 ఎన్నికలలో గెలిచిన, పోటీ చేసిన 22 మందికి ఈసారి టికెట్లు కేటాయించలేదని తెలుస్తుంది. ఈ మొదటి జాబితా 72 మందితో సిద్ధం చేయగా అందులో 50 మంది మాత్రమే సిట్టింగులు కాగా మిగిలిన 22 మంది కొత్తముఖాలని తెలుస్తున్నది. ఏ ఏ నియోజకవర్గాలతో ఈ మొదటి జాబితా రెడీ అయ్యిందనే విషయం బయటకి పొక్కకపోయినా 22 మంది కొత్త మొఖాలతో ఈ జాబితా బయటకి రావడం పక్కా అంటున్నారు. రెడీ అయిన ఈ తొలి జాబితాను మరోసారి క్రాస్ చెక్ చేసుకుని దసరా పండుగ నాటికి ఫైనల్ చేసి బయటకి వదలనున్నట్లు తెలుస్తుండగా.. ఎంత క్రాస్ చెక్ చేసినా ఒకటీ రెండు స్థానాలు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉండగా 20కి పైగా కొత్త అభ్యర్థులతో ఈ జాబితా రానున్నట్లు కనిపిస్తుంది.

కాగా, ఈ 72 మంది జాబితాలోనే 22 మంది కొత్త వారంటే.. ఇక రాష్ట్రం మొత్తం మీద 175 స్థానాలలో వంద కూడా సిట్టింగులకు దక్కే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. ఇందులో సీనియర్లు, మాజీ మంత్రులు, మంత్రులు కూడా ఉండడం గ్యారంటీ  అని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఉత్తరాంధ్ర నుండి అవంతి, నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్, రాయలసీమ నుండి రోజా లాంటి వారికే ఈసారి సీటు దక్కడం అనుమానమే అని పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. సగానికి సగం మందిని కొత్త వారిని దించే క్రమంలోనే ఎంత వీలయితే అంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజలకు చేరువ చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తున్నది. కనీసం ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రజలలోకి పంపి తమ ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకి తీసుకెళ్లాలన్నది జగన్ అభిమతంగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.

ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలు, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం, మరికొన్ని ప్రైవేట్ సంస్థలు, సీఎం జగన్ సొంత  సంస్థల ఫీడ్ బ్యాక్ అన్నటినీ కలిపితే వచ్చిన ఫలితాల ఆధారంగానే  సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఇప్పటికే ఒకటీ రెండు సార్లు జగన్ హెచ్చరించినా ఎమ్మెల్యేలలో ఏ మాత్రం మార్పు లేదని, అందుకే సంపూర్ణ ప్రక్షాళన దిశగానే ఈ అభ్యర్థుల జాబితాలు బయటకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరి ఇంత పెద్ద మొత్తంలో సిట్టింగులకు చాన్స్ లేదంటే.. ఈసారి వైసీపీకి రెబల్స్ బెడద తీవ్రంగా ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది.  ఈ పరిస్థితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.