ఆ ముగ్గురు కలిస్తే జగన్ అవుట్ .. అందుకే వైసీపీలో వణుకు

Publish Date:May 21, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్’లో మళ్ళీ మరో మారు, ఆ మూడు పార్టీలు ఒకటవుతాయా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ, జనసేన కూటమి మళ్ళీ తెలుగు దేశం పార్టీతో పొత్తుకు సిద్డంవుతోందా, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవుననే అంటున్నారు.

వ్యతిరేక ఓట్లు చీలకుండా చుస్తానని ఎప్పుడోనే మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో అడుగు ముందు కేశారు. తెలుగు దేశంతో పొత్తుకు బీజేపీని ఒప్పించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించిన విధంగానే పొత్తుల విషయంలోనూ బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించగలనన్న విశ్వాసం వ్యక్త పరిచారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా, మూడు పార్టీలు కలిసి, కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ముందుకు వెళ్ళాలని అన్నారు. మంచి ఆలోచన. ప్రస్తుత పరిస్థితులలోఅవసరమైన ఆలోచన.  

అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం విషయం ఎలా ఉన్నా, బీజేపీలో జగన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి  కొమ్ముకాస్తున్న వర్గం ఇందుకు అంగీకరిస్తుందా అన్నదే ఇప్పుడు అందరి ముందున్నప్రశ్న. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ వంటివారు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే అనేక సందర్భాలలో స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన కూటమిలో మూడో పార్టీకి స్థానం లేదని అంటున్నారు. మరో వంక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడవలసిన, ‘చారిత్రక’ అవసరాన్ని నొక్కి చెపుతున్నారు.

ఈ నేపద్యంలో కొంత కన్ఫ్యూజన్,గందరగోళం ఉన్నా, పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనతో, బీజేపీ సంగతి ఎలా ఉన్నా, తెలుగు దేశం, జనసేన పొత్తు ఖరారు అయినట్లుగానే భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి, ఏపీలో బీజేపీకి ఉన్న బలం ఆవగింజలో అరవయ్యో వంతు కూడా ఉండదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక శాతం కంటే తక్కువ (0.84) ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

అంతకు ముందు 2014లో టీడీపీ, జనసేన పొత్తులో పోటీ చేసి నాలుగు (4) అసెంబ్లీ, ఒక (1) లోక్ సభ స్థానం గెలుచుకున్న కమల దళానికి 2019లో ఒక్క సీటు కూడా రాలేదు. అసలు ఖాతానే తెరవలేదు. నిజానికి, జాతీయ స్థాయిలో ఉన్న బలమే ఏపీలో బీజేపీ ఉనిని కాపాడుతోందంటే, అందులో ఆక్షేపించవలసిన, అభ్యంతరం చెప్పవలసిన అంశం ఏదీ లేదు.    అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి తిరుగులేదు. కను చూపు మేరలో ఎక్కడా బీజేపీకి మరో ప్రత్యాన్మాయం పార్టీ,కూటమి ఏదీ కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుటల్లో చేరిపోయిన నేపధ్యంలో మరో ప్రత్యాన్మాయ పార్టీ, కూటమి ఏర్పడే అవాకాశాలు సైతం అంతగా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, ఏపీ రాజకీయాలలో బీజేపీ పోషించేది, పోషించగలిగేది, ఆటలో అరటి పండు పాత్ర మాత్రమే. అందులో ఎవరికీ సందేహం లేదు.

అయితే, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పవన్ కళ్యాణ్ బీజేపీతో తెగతెంపులు చేస్కునేందుకు సిద్ధంగా లేరని అయన మాటలను బట్టి అర్థమవుతోంది. అలాగే ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం అండదండలు అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అంతే కాకుండా, జనసేన, బీజేపీల మధ్య చాలా కాలంగా పొత్తున్నా. రెండు పార్టీల మధ్య సయోధ్యత మాత్రం ఇంకా మొగ్గ తొడగలేదు. గడచిన రెండు మూడేళ్ళలో రెండు పార్టీల చేసిన ఉమ్మడి ఉద్యమం ఒక్కటి కూడా లేదు. ఉభయ పార్టీల నాయకులు కలిసి కూర్చున్న  సందర్భాలు ఆల్మోస్ట్ నిల్’.. సున్నా. ఎవరి దారిన వారు పోతున్నారు.. పవన్ కళ్యాణ్ నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడతారే కానీ, రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా అయిన పలకరించరు. బీజీపే పెద్దన్న పాత్రను అసలే అంగీకరించరని, బీజేపీ నాయకులు  ఉడికి పోతున్నారని అంటారు. ఏమైనా, బీజేపే నిర్ణయం ఏదైనా, ఏపీలో తెలుగు దేశం , జనసేన పొత్తు ఖరారైనట్లేనని, తెలుస్తోంది. అందుకే అధికార  వైసీపీలో వణుకు మొదలైంది. పవన్ కళ్యాణ్ అన్నట్లుగా, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అన్న నాలుగు పదాలు వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.