వాలంటీర్లపైనే విశ్వాసం.. ఎన్నికల్లో గట్టెక్కిస్తారన్నదే జగన్ ధీమా

Publish Date:Apr 22, 2022

Advertisement

వైఎస్ జగన్మోహనరెడ్డి...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇప్పటి పాలన సంగతి పట్టించుకోకుండా మరో రెండేళ్ల తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రస్తతం రాష్ట్రంలో అన్ని వర్గాలలో అసంతృప్తి గూడుకట్టుకుందన్న సంగతి ప్రస్ఫుటంగా తెలుస్తున్నా...రెండేళ్లలో జగన్మాయ చేయలేనా అన్న ధీమాతో ఉన్నారు. అందుకే పార్టీలో అసమ్మతినీ, ఉద్యోగులలో ఆగ్రహాన్నీ, సామాన్య జనంలో ఆవేదననీ దేనినీ అడ్రెస్ చేయడం లేదు...కనీసం చేద్దామని కూడా అనుకోవడం లేదు. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆయన ధీమా ఏమిటి?

ఇందుకు ఆయనే సృష్టించిన సరికొత్త (అ)వ్యవస్థ ఉందిగా... అదే వాలంటీర్ల వ్యవస్థ. దానిపైనే ఆయన నమ్మకం...వాలంటీర్లు ఉన్నారన్నదే ఆయన ధీమా అంటున్నారు విశ్లేషకులు. సొంత గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగమంటూ ఘనంగా ప్రకటించుకుని పెద్ద ఎత్తున నామమాత్రపు వేతనాలకు ఆయన నియమించుకున్న ప్రైవేటు సైన్యమే వాలంటీర్లు. వచ్చే ఎన్నికలను వారి ద్వారానే గట్టెక్కాలన్నది ఆయన యోచన. వైకాపా ఎమ్మెల్యేలు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో జగన్ ధీమా ఇదేనని చెప్పుకొస్తున్నారు. 
వలంటీర్లతో ఎన్నికలు గెలవడమేమిటి? ఎన్నికలలో విజయం సాధించాలంటే అభివృద్ధి పనులు చేయాలి. ప్రజా సంక్షేమం కుంటుపడకుండా కార్యక్రమాలు చేయాల. తద్వారా ప్రజా విశ్వాసం చూరగొనాలి. అప్పుడు కదా, జనం మెచ్చి ఒట్లేసేది? కానీ వైకాపా అధినేతకు అటువంటి వాటిపై నమ్మకం లేదు. ప్రజల వద్దకు నేరుగా ప్రభుత్వం అంటే వాలంటీర్లు వెళ్లి సేవలందిస్తున్నారు కదా! ఇంకేం చేయాలి? అన్న ధీమాలో ఉన్నారు. వాలంటీర్లనే బూతు స్థాయి అధికారులుగా నియమించేస్తే.. కాగల కార్యం వారే చూసుకుంటారన్న దీమా ఆయనది. అందుకే ఊరూరా, వాడ వాడలా వాలంటీర్లకు సన్మానం చేసే కార్యక్రమానికి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టారు. అది ఇంకా కొనసాగుతోంది. 

వారి మీద ఎంత విశ్వాసం అంటే స్థానిక ప్రజాప్రతినిథుల అధికారాలలో కోత పెట్ట మరీ వారికి కట్టబెట్టారు. స్థానికంగా ఎమ్మెల్యేలను మించిన పెత్తనం వారి చేతికే ఇచ్చేశారు. అధికారికంగా కాదు...  మీ అంతటి వారు లేరంటూ భుజకీర్తులు తగలించడం ద్వారా. ఇంతకీ వాళ్లు చేయాల్సిన పనేమిటి? వైకాపా కార్యకర్తల్లా పని చేయాలి. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు మోయాలి.
అయితే స్థానిక ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల మితిమీరిన జోక్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక దశలో వాలంటీర్ల జోక్యాన్ని అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. వారి ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. తరువాత బద్వేలు, తిరుపతి ఎన్నికలలో కూడా వారి తీరు, శైలి వివాదాస్పదం అయ్యింది. 
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పబ్బం గడిచేతి వారి చలువతోనే అని జగన్ నమ్మతున్న నేపధ్యంలో గతంలో వారి ప్రమేయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం ఈ సారి ఊరుకుంటుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
  జబ్బార్ భాయ్ విచారంగా మౌలానా దగ్గిరికి వచ్చాడు. తన కొడుకులు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మౌలానాకు వివరించాడు. నాకే ఇలా  ఎందుకు జరుగుతుంది.  కోట్లాది రూపాయల విలువ చేసే ఇల్లు నాకుంది . లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో నలుగురు కొడుకుల పేర్లు ఉన్నాయి. ఈ ఆస్తి వారికే చెందుతుంది. నా భార్య చనిపోయింది. రెండు పూటల భోజనం  దొరకడం లేదు. నలుగురు కొడుకులు  తిండి పెట్టడం లేదు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది. 
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్ 22) పెర్త్‌వేదికగా మొదలైంది. తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు సాగాయి. విపక్ష వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ తో సమావేశాలను బహిష్కరించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పీఏసీ కమిటీ సభ్యుల ఎన్నికకు పోలింగ్ పూర్తయ్యింది. దీనితో పాటు ప్రజాపద్దులు , అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కాట్ చేసింది.
 వైఎస్ జగన్ టార్గెట్ గా ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. నాడు ప్రభాస్ ఎవడో నాకు తెలియదు నేడు కూడా తెలియదు.
అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును రా ష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పదవి ద్వారా వేగుళ్లకు క్యాబినెట్ హోదా దక్కుతుంది.
ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా సాగిస్తున్న బుల్డోజింగ్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా భావించాలి. నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఒక అధికారి న్యాయమూర్తిగా వ్యవహరించి నిందితుడి ఆస్తిని నేలమట్టం చేయడం అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
హైద్రాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ రెడ్డి  అమెరికాలో గన్ ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆర్యన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి  ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం అరాచకం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుని వైసీపీయులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. పార్టీ కోసం పని చేసే వారికి దొడ్డిదారిన ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేసి.. ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. తన కోసం, తన ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారినీ, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్య పోస్టులు పెట్టీ, ఫోటోలు మార్ఫ్ చేసీ వేధింపులకు గురి చేసిన వారికీ పెద్ద పీట వేశారు.
రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా కీలక సమావేశం శుక్రవారం (నవంబర్ 22)న జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు.
పోసాని కృష్ణ మురళి తన విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందారు. ఏదో మేరకు అభిమానులనూ సంపాదించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి.. జగన్ పంచన చేరారో అప్పటి నుంచి ఆయన మాట, తీరు, నడక, నడత పూర్తిగా మారిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం బుర్ర, బుద్ధి అనే వాటితో అవసరం లేదనీ, కేవలం నోటికి పని చేబితే చాలు వైసీపీలో పబ్బం బ్రహ్మాండంగా గడిచిపోతుందనీ కనిపెట్టేశారు. అంతే అప్పటి నుంచీ పోసాని మంచి చెడు, మర్యాద, మన్నన అనేవి పూర్తిగా మరిచిపోయారు.
అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక రాజకీయ అండదండలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమౌతూనే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (నవంబర్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.