అవినాష్ కూడా జగన్ కు జెల్ల కొట్టేస్తారా!?

Publish Date:Jul 9, 2024

Advertisement

ఓటమి వైసీపీ ఇంటిగ్రిటీని దెబ్బతీసిందా?  జగన్ పార్టీ ముక్కలుచెక్కలు కాబోతోందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది. వైసీపీ పూర్తిగా దివంగత వైఎస్సార్ లెగసీపైనే ఆధారపడి ఉంది. అంటే వైఎస్ కుటుంబ ఐక్యతే ఆ పార్టీకి బలం. అయితే ఇప్పుడు ఆ బలం వైసీపీకి లేదు. జగన్ తన ఐదేళ్ల పాలనతో చేతులారా వైసీపీ లెగసీని వదులుకున్నారు. కాదు కాదు దూరం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత భవిష్యత్ లో పార్టీపై తన ఆధిపత్యానికి అడ్డువస్తారన్న అనుమానమో, మరోటో కానీ ముందు చెల్లి షర్మిలను, ఆ తరువాత తల్లి విజయమ్మనూ పార్టీకి దూరం చేశారు. వారంతట వారే పార్టీతో బంధాన్ని పుటుక్కున తెంచేసుకునేలా చేశారు. ఆ క్రమంలో చెల్లినీ, తల్లినీ కూడా అవమానించారు.

దీంతో ముందు షర్మిల తెలంగాణకు వలస వెళ్లి తండ్రి వైఎస్ పేరుమీద ఆ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేసుకుని తన రాజకీయాలు తాను చేసుకుంటూ సాగుతుంటే అందుకు కూడా జగన్ పలు ఆటంకాలు కల్పించారు. షర్మిలకు ఎటువంటి సాయం అందకుండా మోకాలడ్డారు. ఈ క్రమంలో తల్లి షర్మిల కూడా వైసీపీతో అనుబంధాన్ని తెంచుకుని, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో సహా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కుమార్తె షర్మిల పంచన చేరారు. సొదరుడి వేధింపుల కారణంగా షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి, ఆ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి సోదరుడికే సవాల్ విసిరారు. సరే షర్మిల ఫ్యాక్టర్ కూడా పని చేసింది. అంతకు మించి తన ప్రజావ్యతిరేక విధానాల కారణంగా జగన్ ను ఆయన పార్టీని ఏపీ ప్రజలు అధికారం నుంచి దించేశారు. 

దీంతో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమైంది. జగన్ ఒక్కడూ ఒక వైపు, వైఎస్ కుటుంబం మొత్తం మరో వైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో వైసీపీలో ఉండేదెవరు? గోడ దూకేసేదెవరు అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి. నిన్నమొన్నటి దాకా జగన్ చూసి రమ్మంటే కాల్చి  వచ్చినట్లు వ్యవహరించిన ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలంతా సైలెంటైపోయారు. ఏ మాత్రం సందు చిక్కినా పార్టీ గోడదూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన వారు కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలా వెళ్లిన వారిలో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి,  మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ వంటి వారు ఉన్నారని పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.

ఈ తరుణంలో ఇడుపులపాయలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలు వైఎస్ కుటుంబంలో ముగ్గరూ మూడు దారులు అన్న చందంగా  జరిగాయి. వైఎస్ కుటుంబంలో ముగ్గురూ మూడు దారులు అన్నట్లుగా ఆ కార్యక్రమం జరిగింది. ఇడుపుల పాయలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమం సాక్షిగా జగన్ వైఖరిని గమనించిన వారు.. కుటుంబంతో ఆయన సయోధ్య అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చేశారు. అంతే కాకుండా సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్ ను వెంటబెట్టుకుని ఆయన తిరగడంతో జగన్ వైఎస్ అభిమానులకూ దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఇంత కాలం  ఏ అవినాష్ కు అయితే తాను రక్షణ కవచంగా నిలబడ్డారో అదే అవినాష్ కూడా రివర్స్ అయ్యేలా జగన్ అడుగులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లడానికి ఇసుమంతైనా ఆసక్తి చూపని జగన్ దృష్టి ఇప్పుడు లోక్ సభపై పడిందని అంటున్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి ఏదో మేరకు రక్ష కావాలంటే లోక్ సభ సభ్యుడిగా ఉంటేనే సాధ్యమౌతుందని ఆయన భావనగా చెబుతున్నారు. అందుకే పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి కడప లోక్ సభ సభ్యునిగా పోటీలో దిగాలని జగన్ భావిస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన అవినాష్ ను కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. గతంలో కూడా వైఎస్ వివేకానందరెడ్డిపై ఇలాగే ఒత్తిడి తెచ్చి కడప లోక్ సభ సభ్యత్వా నికి దూరం చేసిన సంగతి విదితమే. 

అయితే ఇప్పుడు అవినాష్ అందుకు అంగీకరించే పరిస్థితి లేదని అంటున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు తనకు రక్షణ కవచమని వైఎస్ అవినాష్ రెడ్డి బలంగా భావిస్తున్నారు.  అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠం చేజారడంతో అక్రమాస్తుల  కేసుల్లో కేంద్రాన్ని మేనేజ్ చేసేందుకు పార్లమెంట్ కు వెళ్లడమొక్కటే మార్గమని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఈ విషయంలో ఇరువురి మధ్యా విభేదాలు పొడసూపే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే..అంటే అవినాష్ కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిరాకరించి తమ్ముడుతమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు రాజకీయం రాజకీయమే అంటే  జగన్ పరిస్థితి ఏమిటన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. మొత్తం మీద ఏ రకంగా చూసినా ఎక్కడా కూడా జగన్ మాట నెగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.