టీచర్ నియామకాలకు స్వస్తి పలికే కుట్ర..!

Publish Date:Jun 17, 2022

Advertisement

పిల్ల‌లు చ‌దువు విష‌యంలో ఈ మ‌ధ్య‌ కాలంలో ఎన్నోర‌కాల మార్పులు వ‌చ్చాయి. వాటిలో విద్యతో పాటు పిల్లలలో మానసిక ఎదుగుదలకు, సచ్ఛీలతకు దోహదపడేవి ఎన్నంటే జవాబు మాత్రం వెంటనే దొరకదు. గ‌తంలో వ‌లె స్కూలు కాగానే పుస్త‌కాలు ప‌ట్టుకుని అలా ట్యూష‌న్‌కి ప‌రిగెట్ట‌న‌వ‌స‌రం లేదు. ఈ రోజుల్లో పిల్ల‌ల‌కు అంతా ఆన్‌లైన్ బోధ‌నా సౌక‌ర్యం బాగా అందుబాటులోకి వ‌చ్చేసింది. స్కూల్ అయిపోగానే ట్యాబ్ ల ముందో, స్మార్ట్ ఫోన్లు చేపబట్టుకునో పిల్లలకు పాఠాలు చెప్పేసే యాప్ లు అందుబాటులోకి వచ్చేశాయి.

కొత్తొక వింత అన్నట్లు ఇవి పిల్లలో విద్య పట్ల ఆసక్తి అభిరుచి పెంచేస్తాయని తల్లిదండ్రులూ నమ్మేస్తున్నారు. కాదు కాదు  నమ్మేలా అడ్వర్టైజ్ మెంట్లతో యెడ్యూ టెక్ యాప్ లు ఊదరగొట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా వాటకి తోడైంది.  నిజానికి ఈ ఎడ్యూటెక్ యాప్‌లపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని.. తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయని.. భారీగా డబ్బులు గుంజుతున్నాయని విమర్శలు ఉన్నాయి.  ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో వీటి విజృంభణ ప్రారంభం కాలేదు. బైజూస్ స్టార్టప్‌గా ప్రారంభించి కాస్త ఆదరణ పొందగానే పెట్టుబడులు సమీకరించి.. ఇతర ఎడ్యూటెక్ స్టార్టప్‌లను కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుంది. వాస్తవానికి ఇలాంటి ఎడ్యూటెక్ యాప్ ల వల్ల    విద్యార్థుల మనుసులు కలుషితం అవుతాయనీ.. లాభార్జన  వీటి లక్ష్యం తప్ప విద్యార్థుల భవిష్యత్ కాదనీ.. విద్యను వ్యాపారం చేసేస్తున్నాయన్న ఆరోపణలు కోకొల్లలు.

ఇప్పటికే యెడ్యూటెక్ లు విద్యార్థుల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయంటే చైనా వాటిని తమ దేశంలో నిషేధించింది. పలు దేశాలు అదే దారిలో ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు సైతం యెడ్యూటెక్ యాప్ లపై పలు ఆంక్షలు విధించాయి. వాస్తవం ఇలా ఉండగా..జగన్ సర్కార్ మాత్రం విద్యా విధానంలో పెద్ద సంస్కరణగా అభివర్ణిస్తూ జగన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ తరహా బోధనను అందించాలని సంకల్పించారు.

దీని కోసం దేశంలోనే అతి పెద్ద యెడ్యుకేషన్ టెక్ కంపెనీగా గుర్తింపు పొందిన బైజూస్ లో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ప్ర‌బుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్ధుల‌కు మ‌రింత నాణ్య‌మైన విద్య అందించ‌డానికి ఎంతో వీలుంటుంద‌ని జ‌గ‌న్ అంటుంటే..    రాష్ట్రంలో విద్యను మరింత నాశనం చేసే యత్నంగా విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  అయితే జగన్ మాత్రం పిల్లలకు మంచి జరుగుతుంది, వారికి కాస్ట్‌లీ చదువులను అందజేస్తున్నామంటూ వాదిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిజమే ఇది నిజంగా కాస్ట్లీ వ్యవహారమే. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలల్లో యెడ్యూ టెక్ కు అవసరమైన ఇన్ఫ్రాస్టర్చర్, ఒప్పందం మేరకు చెల్లింపులు కచ్చితంగా ప్రభుత్వానికి కాస్ట్లీయే. కానీ ఇక్కడ వ్యయం, ఖరీదు కాదు.. అసలు వాస్తవం   ఇక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల రిక్రూట్ మెంట్ అనేది లేకుండా చేయడమే జగన్ ఉద్దేశం అని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.