జగన్ పారిపోతే దరిద్రం వదిలిపోతుంది!
Publish Date:May 10, 2024
Advertisement
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో వార్ వన్ సైడ్ అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ అధికారం కోల్పోవడంతోపాటు జగనన్న జైలుకు వెళ్ళడం ఖాయమని అందరికీ అర్థమైపోయింది. అందరితోపాటు జగన్‌కి కూడా ఈ విషయం అర్థమైపోయి దేశం నుంచి సతీ సమేతంగా లండన్ పారిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు తాను లండన్, స్విట్జర్లాండ్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టు ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీబీఐ సంగతి అలా వుంటే, ఏపీ జనం కూడా జగన్‌ని దేశం వదిలి పారిపోనివ్వకూడదని, అతన్ని దేశంలోనే ఉంచి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జీవితాంతం జైల్లోనే వుంచాలని కోరుకుంటున్నారు. జగన్ ఈసారి దేశం విడిచి వెళ్ళాడంటే తిరిగి రాడన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ చేసిన పాపాలకు తగిక శిక్ష పడాల్సిందేనని, అలా జరగాలంటే జగన్ దేశం విడిచి వెళ్ళకుండా చూడాలని భావిస్తున్నారు. అయితే జగన్ తిరకాసులు, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని, డబ్బు వెదజల్లి, రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసే మనిషి కాబట్టి, అలాంటి వ్యక్తి దేశం విడిచిపోతే రాష్ట్రానికి, దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని కొంతమంది భావిస్తున్నారు. అందువల్ల జగన్ దేశం విడిచి పారిపోతుంటే చూసీ చూడనట్టు ఊరుకోవడమే మంచిదని అంటున్నారు. జగన్‌కి ఇన్ని ఆస్తులున్నాయి కదా, దేశం వదిలి పారిపోతాడా అనే సందేహాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు దేశం వదిలి పారిపోయిన విజయమాల్యా, నీరవ్ మోడీ లాంటివాళ్ళు తక్కువ వాళ్ళేమీ కాదు. ఒక వేళ జగన్ దేశం వదిలి పారిపోవాలని నిర్ణయించుకుని వుంటే, విదేశాల్లో జీవితాంతం చీకూచింతా లేకుండా గడపడానికి అవసరమైన ఏర్పాట్లు ఏనాడో జరిగిపోయి వుంటాయి.
http://www.teluguone.com/news/content/jagan-escape-to-londan-39-175527.html





