వైసీపీ ఎఫెక్ట్.. మెజారిటీ నుంచి మైనస్ కు పడిపోయిన పీడీఎఫ్ లక్ష్మణరావు!

Publish Date:Mar 5, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. కూటమి పాలన పట్ల ప్రజలలో అభిమానం, సానుకూలత రోజు రోజుకూ పెరుగుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ ఎనిమిది నెలలో వైసీపీ పొలిటికల్ గ్రాఫ్ మరింత దిగజారిందని తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు నిర్ద్వంద్వంగా నిరూపించాయి. ఓటమి తరువాత వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా మారుతోందనడానికి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితమే తిరుగులేని సాక్ష్యంగా చెప్ప వచ్చు. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాపై సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు పోటీ చేశారు. ఈ ఎన్నికలో ఆయనకు 62 వేల ఓట్లు వచ్చాయి. ఆలపాటి రాజా తొలి రౌండ్ నుంచీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ చివరికి భారీ   మెజారిటీతో విజయం సాధించారు. 

గత ఎన్నికలలో అంటే 2017లో స్వతంత్ర అభ్యర్థిగా ఈ స్థానం నుంచి పోటీ చేసిన లక్ష్మణ రావు 68 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థి ఏ పార్టీ తరఫునా పోటీ చేయలేదు. ఆయనకు మద్దతుగా అప్పట్లో ఏ పార్టీ కూడా ప్రచారం చేయలేదు. అంటే గత ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ  చేసి ఘన విజయం సాధించిన  లక్ష్మణరావు విజయం పూర్తిగా వ్యక్తిగతం. అయితే ఈ సారి ఆయనకు తన సొంత బలానికి తోడుగా వైసీపీ మద్దతు కూడా అభించింది. ఫలితం ఘోర పరాజయం. వైసీపీ మద్దతు లేకుండా ఆయన గతంలోలాగే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే.. ఈ స్థాయిలో ఓటమిని మూటగట్టుకుని ఉండేవారు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వైసీపీ మద్దతు కారణంగానే ఆయన పరాజయం ఇంత ఘోరంగా ఉందని అంటున్నారు. గత ఎన్నికలలో 68 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించిన లక్ష్మణరావు ఈ సారి మాత్రం 62 వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అంటే గతంలో ఆయనకు వచ్చిన మోజారిటీ ఓట్ల కంటే ఈ సారి ఆయనకు తక్కువ ఓట్లు పడ్డాయి. ఇందుకు ఆయన వైసీపీతో అంటకాగడమే కారణమని చెబుతున్నారు. రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పవనాలు ఎంత బలంగా వీస్తున్నాయో చెప్పడానికి ఇదే తార్కాణమంటున్నారు.  

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.