దువ్వాడ శ్రీనివాస్‌ని జగన్ ఓదార్చాలి!

Publish Date:Aug 10, 2024

Advertisement

శవం దొరికితే చాలు.. ఓదార్పు పేరుతో పీక్కుతినడానికి రెడీ అయిపోతున్న వైసీపీ నాయకుడు జగన్ ఇప్పుడు జస్ట్ ఫర్ ఛేంజ్ మరో ఓదార్పు యాత్ర చేపట్టాలి. అర్జెంటుగా టెక్కలికి బయల్దేరాలి. ఆయన ప్రస్తుతం ఓదార్చాల్సింది ఎవర్నో కాదు.. తన పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని. ‌

భర్త, ముగ్గురు ఆడపిల్లలు వున్న దివ్వెల మాధురి అనే వైసీపీ నాయకురాలిని పాపం దువ్వాడ శ్రీనివాస్ ఎంతో పెద్దమనసుతో, చక్కగా తన ఇంట్లోనే పెట్టుకుని ఆదుకుంటుంటే, ఓర్వలేని అతని భార్య, కూతుళ్ళు గొడవ పడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ని రోడ్డు మీదకి లాగుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇద్దరూ రాసుకుని పూసుకుని తిరుగుతూ వుంటే, గుళ్ళో గోపురాలకు వెళ్తుంటే, విహారయాత్రలకు చెక్కేస్తుంటే చూసి ఓర్చుకోలేని దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతుళ్ళు వాళ్ళిద్దరికీ సంబంధం వుందని అన్యాయంగా ఆరోపించారు. దివ్వెల మాధురి కుటుంబం మొత్తం మాధురిని తిట్టారు. దాంతో దివ్వెల మాధురి బాగా హర్టయింది. ఆ తర్వాత దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఒక హోటల్ గదిలో కలిశారు. ‘‘ఏంటి సార్ ఈ అన్యాయం.. అన్నెం పున్నెం ఎరుగని నా మీద మీ భార్య లేనిపోని ఆరోపణలు చేస్తోంది. మనిద్దరం కలసి గుళ్ళూగోపురాలకి, విహారయాత్రలకి తిరిగామే తప్ప అంతకన్నా ఏమైనా చేశామా? నేనేమో సంప్రదాయిని.. మీరేమో సుద్దపూస. అలాంటి మనిద్దరికీ సంబంధం వుందని మీ భార్య వాణి ఆరోపిస్తోంది. నా కుటుంబంలో నేను బద్నామ్ అయిపోయాను. ఇక నాకు చావే శరణ్యం’’ అని వెంటనే తాడుతో ఉరేసుకోబోయింది. ఉరితాడులో తల పెట్టేసి కిందకి దూకేసింది. అది చూసి బిత్తరపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఉరితాడుకి, దివ్వెల మాధురి గొంతుకి మధ్య తన చేతిని అడ్డుగా పెట్టాడు. ఆ తర్వాత చాలా తంటాలు పడి ఆమెని ఉరితాడు నుంచి తప్పించి కిందకి దించాడు. ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని ఆమెని వారించాడు. నీకు ఎవరూ లేకుండా పోయారు కాబట్టి నీకు అండగా నేనుంటాను అని మాటిచ్చాడు. అప్పటి నుంచి ఆమెను తన ఇంట్లోనే వుంచుకుంటూ ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇద్దరు వివాహితులు వేరేవాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా తప్పుకాదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందంట. ఆ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, ఇద్దరూ  ‘అడల్ట్రీ’ అనే సంబంధం పెట్టుకుని సంతోషంగా జీవిస్తుంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు నానా రచ్చ చేస్తున్నారు.

ఒక మంచి పని చేస్తుంటే ఇలా రచ్చ రంబోలా అవుతున్నందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంత హర్టయ్యాడో ఏం పాడో.. మరోవైపు ఆ నిప్పులాంటి మహాతల్లి దివ్వెల మాధురి కూడా ఎంత బాధపడుతోందో ఏంటో! దివ్వెల మాధురి జగన్‌కి ఆల్రెడీ తెలుసు. 2022 అక్టోబర్‌లో ఆమెని జగన్‌కి దువ్వాడ శ్రీనివాస్ పరిచయం చేసి, పార్టీలో చేరిస్తే, జగన్ వెంటనే ఆమెకి శ్రీకాకుళం జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇచ్చేశాడు. దువ్వాడ శ్రీనివాస్‌తోపాటు అమె కూడా హర్టయి వుంటుంది కదా.. అందుకే ఆ ఇద్దరు పవిత్ర ప్రేమ పక్షులను ఓదార్చడానికి జగన్ అర్జెంటుగా టెక్కలికి బయల్దేరాలి. బెంగళూరు నుంచి టెక్కలికి ట్రావెల్ చేసే సమయంలోనే, ఈ ‘కేసు’లో టీడీపీని ఎలా ఇరికించవచ్చో కూడా ఆలోచించాలి. 

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.