మోడీ ప్రసంగంతో జగన్ డీలా... అశలన్నీ వమ్ము? కింకర్తవ్యం?

Publish Date:Nov 12, 2022

Advertisement

జగన్ మూడు రాజధానుల పల్లవిని ప్రధాని మోడీ అసలు వినడానికే ఆసక్తి చూపలేదా? మోడీ సమక్షంలో వికేంద్రీకరణ లక్ష్యం అంటూ జగన్ తన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చినా మోడీ పట్టించుకోలేదా అంటే విశాఖ సభ వేదికగా మోడీ ప్రసంగం విన్నవారంతా ఔననే అంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడటానికి ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హీటెస్ట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశమే కారణమని చెప్పక తప్పదు. విశాఖలో మోడీ సమక్షంలో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువస్తారా?  తీసుకువస్తే మోడీ ఎలా రియాక్ట్ అవుతారు? మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేతలకు గట్టిగా గళం వినిపించినప్పటికీ కేంద్రం నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా లేదు. పైపెచ్చు రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అన్నట్లుగానే కేంద్రం వ్యవహరిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో జగన్ విశాఖ సభ వేదికపై నుంచి మోడీ సమక్షంలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం అందుకు మోడీ అనుమతిని కోరినట్లుగానే అంతా భావించారు. దీనికి మోడీ ఏం చెబుతారా  అన్న అసక్తి అందరిలోనూ వ్యక్తమైంది. అయితే మోడీ తన  ప్రసంగంలో అసలు జగన్ ప్రస్తావించిన ఏ అంశాన్నీ కూడా స్పృశించలేదు.

అసలు జగన్ ప్రసంగాన్నీపట్టించుకున్నట్లే కనిపించలేదు. జగన్ వినతులు, విజ్ణప్తులకు తన ప్రసంగంలో చోటివ్వలేదు.  దీంతో జగన్ మోడీని పొగడ్తల్లో ముంచెత్తి, ఆయన ప్రాపకం కోసం పడిన తాపత్రేయమంతా బూడిదలో పోసిన పన్నీరు చందమైంది.   మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్, ఇతర కేబినెట్ మంత్రులు పదే పదే ఇదే మాట చెబుతున్న నేపథ్యంలో, అందులోనూ విశాఖ పాలనా కేంద్రంగా, అక్కడి నంచే త్వరలో జగన్ పాలన సాగిస్తారనీ  స్పష్టం చేస్తున్న తరుణంలో  విశాఖలో ప్రధాని మోడీ పర్యటనపై జగన్ సర్కార్ పలు ఆశలు పెట్టుకుంది. అందుకే మోడీ సభ ఏర్పాట్లను జగన్ సర్కార్ స్వయంగా భుజానికెత్తుకుంది. ప్రధాని మోడీ సభకు జనసమీకరణకు చెమటోడ్చింది.

సభా ఏర్పాట్లతో మోడీని మెప్పించి, ఆయన సమక్షంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావిస్తే ఆయన అభ్యంతరం చెప్పరని ఆశలు పెంచుకుంది. కేంద్రం మద్దతుతోనే మూడు రాజధానుల విధానాన్ని చేపట్టామని జనానికి చెప్పుకునే అవకాశం ఉంటుందనీ భావించింది. అయితే మోడీ తనదైన శైలిలో అసలా విషయం తన చెవిన పడలేదన్నట్లుగా వ్యవహరించడంతో జగన్ ఆశలు, వ్యూహాలు దెబ్బతిన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.