జగన్ హస్తిన ధర్నా అట్టర్ ఫ్లాప్

Publish Date:Jul 25, 2024

Advertisement

జగన్ హస్తిన ధర్నా ఘోరంగా విఫలమైంది. ఎంత ప్రయత్నించినా ఆయన ధర్నాకు జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్  పెద్దగా లేదు. ఎంతో కష్టపడి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల పార్టీల నేతలను ధర్నాకు తీసుకురాగలిగినా.. వారెవరూ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న మాట పొరపాటున కూడా నోటి వెంట రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఏదో మొహమాటానికి వచ్చినట్లుగా వచ్చి ధర్నాలో కూర్చుని వెళ్లిపోయినట్లుగా వారి తీరు కనిపించింది. 

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ జగన్ హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అదే ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ ధర్నా కంటే ఆయన నిరసనకే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.  అయితే పరిశీలకులు మాత్రం జగన్ ధర్నా ఒక సాకు మాత్రమేననీ, ఆయన హస్తిన టూర్ అసలు ఉద్దేశం వేరే ఉందని అంటున్నారు. అఖిలేష్ ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లాలన్నది ఒక ప్లాన్ కాగా, ఎలాగో అలా బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ సాధించి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం కాకుండా చూసుకోవాలన్నది మరో ప్లాన్ అని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు అఖిలేష్ ను అతి కష్టమ్మీద ధర్నాకు తీసుకువచ్చారని అంటున్నారు. ఆయన ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానంతో టచ్ లోకి వెళ్లాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు.

పనిలో పనిగా బీజేపీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కూడా కోరానని చెబుతున్నారు. ఆ కారణంగానే హస్తినలో ధర్నా అయిపోయినా జగన్ ఇంకా అక్కడే మకాం వేశారని చెబుతున్నారు. 
ఇది పక్కన పెడితే ధర్నా ముందూ, తరువాత కూడా మీడియాతో మాట్లాడిన జగన్ ఆవు కథ చెప్పడానికే పరిమితమయ్యారు.  జాతీయ మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి అస్సలు ఇష్ట పడలేదు.  తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారం చేపట్టిన అనంతరం జరిగిన హింసాకాండలో మరణించిన వారి పేర్లు చెప్పమన్న మీడియా ప్రశ్నకు ఇక్కడ ఫొటో ఎగ్జిబిషన్ చూడండి, టాపిక్ ను డైవర్ట్ చేయకండి అంటూ అసహనం చేశారు. జగన్ మీడియాతో మాట్లాడిన రెండు సార్లూ కూడా స్వోత్కర్ష్, పర నిందకే ప్రాధాన్యత ఇచ్చారు. తన హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉందనీ, ఎక్కడా కక్ష సాధింపు ధోరణి, హింసాకాండా లేదనీ చెప్పుకుని తన భుజాలను తానే చరిచేసుకున్నారు.

అదే  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నిండా 45 రోజులు కూడా కాకుండానే రాష్ట్రం అగ్ని గుండంలా మారిందనీ, రాజకీయ హింస ప్రజ్వరిల్లిందనీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయనీ గగ్గోలు పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జగన్ ధోరణితో వైసీపీ నేతలే నివ్వెర పోయారు. జగన్ తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.