జగన్ ఓటమి ఒక్కటే మార్గం!

Publish Date:Jan 25, 2023

Advertisement

ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు, విశ్లేషషణలు చేస్తున్న, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతవరకు, రాజధాని సమస్య పరిష్కాం కాదని, రాజధాని లేని రాష్ట్రం అనే తలవంపులు పోవాలంటే, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి, జగన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఒక్కటే మార్గమని కుండ బద్దలు కొట్టారు.

అమరావతికి చెందిన కొందరు రైతులు కడపలో డీఎల్ ను కలిసారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీం కోర్టులోనూ జగన్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైనా, ఆయన అమరావతిని రాజధానిగా అంగీకరింఛక పోవచ్చని డీఎల్ చెప్పారు. నిజానికి   అమరావతి అభివృద్ధికి జగన్ రెడ్డి  చేయగలిగింది కూడా ఏమీ లేదని, రాష్ట్ర ఖజానా నిండుకున్న నేపధ్యంలో మిగిలిన సంవత్సరం పై చిలుకు కాలంలో  కోర్టు ఆదేశాలను అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయడం అయ్యే పని కాదని ఆయన స్పష్టం చేశారు. 

అయితే ప్రభుత్వం కోణంలో అమరావతి రాజధాని కాకపోయినా.. ప్రజలు మాత్రం అమరావతినే రాజధానిగా భావిస్తున్నారని డీఎల్ చెప్పుకొచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి  గత ప్రభుత్వ హయాంలో తీసుకున నిర్ణయాలను అమలు చేయాలని రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్ళిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి అక్కడా  మొట్టికాయలు తప్పవని  డీఎల్ జోస్యం చెప్పారు. మంత్రులు అమరావతి గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని, అప్పుడే రాష్ట్రానికి మంచి రోజులోస్తాయని  అమరావతి ఏకైక రాజధానిగా నిలుస్తుందని డీఎల్ చెప్పు కొచ్చారు. 

ఇక  2019 ఎన్నికల ముందు వైసీపీ లో చేరిన డీఎల్ ప్రస్తుతం టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత వీర శివారెడ్డి తనతో పాటుగా డీఎల్ టీడీపీలో చేరుతున్నారంటూ వెల్లడించారు. అయితే, డీఎల్ కు సంబంధించి సీటు పైన హామీ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. డీఎల్ మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ టీడీపీ అభ్యర్ధిగా సీనియర్ నేత సుధాకర్ యాదవ్ ఉన్నారు. టీడీపీ -జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. సీటు పైన స్పష్టత వచ్చిన తరువాతనే డీఎల్ టీడీపీలోకి వెళ్తారని తెలుస్తోంది.

By
en-us Political News

  
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.