పులివెందుల జగన్ చేజారినట్లేనా?

Publish Date:Nov 16, 2023

Advertisement

పులివెందుల.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమే.  నాలుగున్నర దశాబ్దాలుగా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నదీ, విజయం సాధిస్తున్నదీ కూడా వైఎస్ కుటుంబమే. 1978 నుంచి  పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ కుటుంబం పోటీ చేస్తున్నది. గెలుస్తున్నది.  పులివెందుల నుంచి 1978, 1983, 1985లో వైఎస్ రాజశేఖరరెడ్డి విజయం సాధించారు. 1989లో వైఎస్సార్‌ కడప ఎంపీగా పోటీ చేస్తే, ఆయన సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.   ఆ తర్వాత 1994లోనూ వివేకానే గెలుపొందగా.. మళ్ళీ 1999, 2004, 2009ల్లో వైఎస్సార్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్సార్‌ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ సతీమణి విజయమ్మ గెలుపొందారు. ఆ తరువాత కూడా వైసీపీ నుంచి మరోసారి విజయమ్మ పోటీ చేశారు. విజయం సాధించారు.  

ఇక 2014, 2019ల్లో   జగన్‌ పులివెందులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  అందుకే పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. నిన్నమొన్నటి వరకూ అందరూ ఆఖరికి ప్రతిపక్షాలతో సహా ఈ విషయమే చెప్పేవారు. అయితే ఇప్పుడు  ఆ పరిస్థితి మారిందా? ఇప్పుడు వైఎస్ కుటుంబం కంచుకోట పులివెందుల బద్దలు అవుతుందా? పులివెందులలో జగన్ ఓటమి ఖాయమైందా అంటే రాజకీయవర్గాలు, పరిశీలకులు అవును ఆ పరిస్థితి ఉందని అంటున్నారు. విపక్షాలైతే పులివెందుల ఇంకెంత మాత్రం వైఎస్ కుటుంబ కంచుకోట కాదని ఖరాకండీగా చెప్పేస్తున్నారు.

2019 ఎన్నికల తర్వాత కడప జిల్లా రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య తర్వాత ప్రజల దృష్టి, ఆలోచనా మారిందన్న అభిపాయాలు వ్యక్తమౌతున్నాయి. బాబాయిని హత్యచేసింది అబ్బాయేననే బలమైన ఆరోపణలు ఉండగా.. ఆ అబ్బాయితో సహా నిందితులకు జగన్ కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వివేకా హత్య కేసులో నిందితులు ఎవరన్నది న్యాయదేవత ఇంకా తేల్చకపోయినా, నిజం ఏంటన్నది పులివెందుల ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది. సాక్షాత్తు వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. అన్న జగన్ పై తనకు నమ్మకం లేదంటూ.. నాన్నను చంపిన వాళ్ళని నా అనుకున్న వాళ్ళే కాపాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు, తనకు న్యాయం చేయాలని ఇతర రాష్ట్రాల కోర్టుల చుట్టూ తిరగడం, కూతురు అల్లుడే ఆస్తి కోసం వివేకాను చంపారనేలా వైసీపీ నుంచి రివర్స్ ప్రచారం చేయడం పులివెందుల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ కేసులో పలువురు అప్రూవర్లు గా మారడంతో ఈ కేసులో అసలు నిజా నిజాలు ఏంటన్నది పులివెందుల నియోజకవర్గం మొత్తం రచ్చబండ మీద చర్చగా బయటపడిపోయాయి.

 ఇక  వైఎస్ సొంత కుటుంబంలో వివాదాలు కూడా ఇక్కడ జగన్ కు మైనస్ గా మారాయి.  తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను కూడా జగన్ దూరం చేసుకోవడం సొంత నియోజకవర్గం మీద ప్రభావం చూపిందంటున్నారు. తల్లి విజయమ్మ ఇప్పుడు జగన్ తాడేపల్లి నివాసంతో పాటు సొంత గడ్డ పులివెందులకు కూడా దూరం అయ్యారు. హైదరాబాద్ కూతురు షర్మిల వద్దనే ఆమె ఉంటున్నారు.   అందుకు జగనే కారణమని పులివెందుల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఆస్తులు, పదవుల కోసమే జగన్ తల్లి, చెల్లిని తరిమేశారన్న సంకేతాలు బలంగా ప్రజలలోకి వెళ్లిపోయాయి. నియోజకవర్గంలో అటు తండ్రి,  ఇటు బాబాయ్ తో దగ్గరి సంబంధాలు ఉన్న  వారంతా ఇప్పుడు జగన్ పై నమ్మకం కోల్పోయారు. ఆ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు.   అసలే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంతృప్తికి, సొంత నియోజకవర్గంలో నెలకొన్న ఈ పరిస్థితులు కూడా తోడయ్యాయి.

ఇలా ఎన్నో అంశాలతో సొంత గడ్డపై కూడా జగన్ కు వ్యతిరేకత ఎదురౌతోంది. మరోవైపు తెలుగుదేశం పులివెందుల ఇంచార్జి బీటెక్ రవి సైతం పులివెందుల నియోజకవర్గంలో దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. పార్టీ కార్యాలయాలను ప్రారంభించి చాప కింద నీరులా విస్తరించారు. దీంతో జగన్ కంచుకోట గేట్లు బద్దలయ్యాయని అంటున్నారు. ఈ విషయం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. కానీ అప్పట్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల  శాఖల మంత్రి.. పట్టభద్రులు కాదు.. తమ ఓటర్లు వేరే ఉన్నారంటూ  మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మరి ఇప్పుడు నిఘా వర్గాలు హెచ్చరించాయో.. సొంత సర్వేలలో ఫలితాలు షాక్ కొట్టేలా చేశాయో కానీ ఇప్పటికిప్పుడు జగన్ పులివెందుల మీద ఫోకస్ పెంచినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బీటెక్ రవిని సీఎం జగన్ అక్రమంగా అరెస్టు చేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ తరుణంలో భూ పంపిణీ కోసం ప్రత్యేక జీవో జారీ చేయడం ఆ ఆరోపణలు వట్టి ఆరోపణలు కావని తేలుస్తోంది.   పులివెందులలో ఓటమి   భయంతోనే జగన్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.