మళ్లీ మాట తప్పి, మడమ తిప్పిన జగన్.. వాలంటీర్ల జీవితాలు చిందరవందరే!

Publish Date:May 11, 2022

Advertisement

మాట తప్పను..మడమ తిప్పను అంటూ గోప్పగా చెప్పుకునే ఏపీ సీఎం.. వరుసగా మాట తప్పుతున్నారు. మడమ తిప్పుతున్నారు. ఏపీ రాజధాని అమరావతే అన్న వాగ్దానం నుంచి ఈ మూడేళ్ల కాలంలో ఆయన మాట తిప్పని, మడమ తిప్పని సందర్భం ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలకు ముందు, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేస్తున్నట్లే కనిపిస్తూ.. ప్రతి పథకంలోనూ కోతలు విధిస్తూ వచ్చారు. వృద్ధాప్య పింఛన్ల విషయంలోనూ ఆయన మాట తిప్పి మడమ తిప్పి తాతా అవ్వలను నిలువునా మోసం చేశారు. ఇలా ఏ విషయం చూసుకున్నా చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంటోంది. 

ఇప్పుడు తాజాగా ఆయన వాలంటీర్ల ప్రొబేషన్ విషయంలో మళ్లీ మాట తప్పి మడమ తిప్పారు. వాలంటీర్ వ్యవస్థ తన మానస పుత్రికగా గొప్పగా చెప్పుకునే జగన్ వారికి ప్రొబేషన్ ఇచ్చే విషయంలో ముందు వెనుకలాడుతున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. వారి జీవితాలను చిందర వందర చేసేదిగా ఉంది. ప్రొబేషన్ ఇవ్వడానికి అనధికారికంగా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొని..అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ ప్రొబేషన్ స్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. అయితే నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా జూన్ నుంచి అందరికీ ప్రొబేషన్ ఇస్తామని అన్నారు. వాలంటీర్లు నమ్మారు. అయితే ఇప్పుడు ప్రొబేషన్ కు అర్హులు ఎవరో చెప్పాలంటూ  జిల్లా యంత్రాంగాలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంటే గతలో అనధికారికంగా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణతే అర్హతగా వాలంటీర్లకు ప్రొబేషన్ ఇస్తారన్న మాట. 

అంటే వాలంటీర్లందరికీ ప్రోబేషన్ ఇస్తామన్న మాటను జగన్ తప్పారు. ఇచ్చిన హామీ విషయంలో మడమ తిప్పారు.   గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలు రాసే ఉద్యోగంలోకి వచ్చారు. వారి సర్వీస్ రికార్డులో కానీ..జాయినింగ్ రిపోర్టులో కానీ రెండేళ్ల తర్వాత మరోసారి పరీక్షలు పెడతాం… అందులో పాసయితేనే ప్రొబేషన్ ఇస్తామనే షరతు ఎక్కడా పెట్టలేదు. పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగంలో చేరే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారనే ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా అప్పాయింట్ మెంట్ కూడా ఇచ్చింది. కానీ రెండేళ్లు గడిచాయో లేదో.. వారికి ఉద్యోగ భద్రత లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది.

 పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఫెయిలయ్యారంటూ వాలంటీర్లలో  కనీసం ముఫ్పై శాతం మందిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నది.    ప్రభుత్వాన్ని నమ్మి మంచి భవిష్యత్‌ను వదులుకుని సొంత ఊరిగా ఉద్యోగం అన్న ఆశతో గ్రామ, వార్డు సచివాలయాల్లో కేవలం పదిహేను వేలరూపాయల జీతానికి  పని చేస్తున్న వాలంటీర్లను నిలువునా ముంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. 

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.